మహాత్మాగాంధీ ప్రాణ రక్ష కుడు,,,

బతఖ్ మియా అన్సారీ


(జానో జాగో వెబ్ న్యూస్_గుంటూరు ప్రతినిధి)

జాతిపిత మహాత్మా గాంధీ ప్రాణ రక్షకుడు త్యాగం వెలకట్టలేనిది ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సైదా అన్నారు.  మహాత్మాగాంధీ జయంతి కార్యక్రమాన్ని ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు సంఘాల సహకారంతో శనివారం నకరికల్లులో నిర్వహించారు. జాతిపిత మహాత్మాగాంధీ, ఆయన ప్రాణ రక్షకుడు బతఖ్ మియా అన్సారీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.    1917లో మహారాష్ట్ర చంపారన్ ప్రాంతంలోని నీలి పంటల రైతులను హింసిస్తున్న బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రైతుల తరపున ఉద్యమం తీవ్రతరం చేసేందుకు విచ్చేసిన మహాత్మా గాంధీని హతమార్చాలని ఇర్విన్ అనే బ్రిటిష్ వ్యాపారవేత్త కుట్ర పన్నారన్నారు. కుట్రను బహిర్గతం చేసి గాంధీజీ ప్రాణాలను కాపా డిన బతఖ్ మియా అన్సారీ తన ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్నారని

 అది గాంధీజీ పై ఉన్న ప్రేమకు. అతని దేశభక్తికి నిదర్శనమని అన్నారు. కుట్రను భగ్నం చేసిన బతఖ్ మియా అన్సారీని బ్రిటిష్ వారు ఉద్యోగం నుంచి తొలగించడమే కాదు గ్రామ బహిష్కరణ చేసి మానవ  సమాజంలో కి రాకుండా నానా అవస్థలు పెట్టారన్నారు. చివరకు తిందితిప్పలు దొరక్క దారిద్య్రం అనుభ వించారని చరిత్ర ద్వారా తెలుస్తోంది అన్నారు.   స్వాతంత్రానంతరం విషయం తెలుసుకున్న తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ బతఖ్ మియా అన్సారీ ని ఆదుకుంటామని 50 ఎకరాల పొలం,  ఉద్యోగం ఇచ్చి ఆదుకుంటామని రాష్ట్రపతి హోదాలో హామీ ఇచ్చారన్నారు . మూడు తరాలు మారినా నేటి వరకు ఆ హామీ అమలుకు నోచుకోక దుర్భర పరిస్థితుల్లో బతఖ్ మియా అన్సారీ మృతి చెందారని వారి వారసులు సైతం కడు పేదరికాన్ని అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఓ సందర్భంలో బతఖ్ మియా అన్సారీ వారసులను పిలిపించి హామీలు అమలు చేసేందుకు కావలసిన పత్రాలను సిద్ధం చేసినప్పటికీ ఎలాంటి సాయం అందక పోవడం దారుణం అన్నారు. ఆనాడు మహాత్మాగాంధీ లాంటి మహనీయుని ప్రాణాలను రక్షించుకోండి పోతే నేడు స్వాతంత్ర ఉద్యమ చరిత్ర మరో విధంగా ఉండేదని అన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో అసువులు బాసిన ముస్లింలకు హామీలను ప్రభుత్వం ఇప్పటికైనా నెరవేర్చాలని కోరారు గాంధీజీ ప్రాణం రక్షకుడిగా ధైర్యసాహసాలు ప్రదర్శించిన బతఖ్ మియా అన్సారీ సేవలు భావితరాల కు అందజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి నిడిగొండ నాగేశ్వరరావు,  పి డి ఎం జిల్లా నాయకులు షేక్ మస్తాన్ వలి,  మాల మహానాడు జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ గోదా బాల , ఎం సిపిఐయు జిల్లా మహిళా అధ్యక్షురాలు గాదె కుమారి, సిఐటియు నాయకులు కోటనాయక్, ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ తరపున జిల్లా కార్యదర్శి గుంటూరు ఖాదర్ , న్యాయ సలహాదారు జిలానీ,   వర్కర్స్ యూనియన్ నాయకులు స్వీట్స్ సుభాని,  టైలర్ మహమ్మద్ , ఇమామ్ వలీ, కరెంట్ సైదా,  మండల కమ్యూనికేటర్ గుత్తికొండ చిన్న సైదా,  యూత్ నాయకులు ఈసుబ్, మస్తాన్, లింగోజీ, హనుమంతు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: