రైతు భరోసా కేంద్రంలో సబ్సిడీపై,,,

 పప్పు శనగ  విత్తనాలు పంపిణీ

వ్యవసాయ అధికారి ఆర్. చంద్రశేఖర్ రావు

(జానో జాగో వెబ్ న్యూస్_  తర్లుపాడు ప్రతినిధి)

 ప్రకాశం జిల్లాలోని తర్లుపాడు మండలంలో వ్యవసాయ అధికారి చంద్రశేఖరరావుగారి ఆధ్వర్యములో రైతులకు 25% సబ్సిడీపై పప్పు శనగ విత్తనాలు వ్యవసాయ కమిషనర్ ఆదేశాల మేరకు రబీ సీజన్2021 నందు పంపిణీ చేయుటకు రైతు భరోసా కేంద్రం నందు అందుబాటులో ఉంచి యున్నాము.JG-11 రకము శనగ విత్తనాలు సర్టిఫైడ్ విత్తనాలు క్వింటాలు ధర రూ 7000/- సబ్సిడీ రూ 1750/- లు రైతులు రూ 5250/- చెల్లించిపొందవచ్చును. ట్రూత్ ఫుల్ లేబుల్( Truth ful  label) విత్తనం క్వింటా ధర రూ 6900/- సబ్సిడీ రూ1725/- లు పోను రైతులు రూ5175/- చెల్లించి విత్తనాలు పొందవచ్చును. విత్తనాలు కావలసిన రైతులుమీ గ్రామంలోరైతు భరోసా కేంద్రంలో పేర్లు నమోదు చేయించుకోవలెను. కౌలు రైతులు,  సన్న చిన్న కారు రైతుల కు ప్రాధాన్యతఇవ్వబడును. ఒక్కొక్క రైతుకు 5 ఎకరములు వరకు 25% సబ్సిడీ విత్తనములు ఇవ్వబడుతుంది. విత్తనం కావలసిన రైతులు విత్తనము ను కచ్చితంగా పొలంలో సాగు చెప్పానని సొంత ధ్రువీకరణ పత్రం ఇవ్వవలెను. సబ్సిడీ విత్తనాల పొంది సాగు చెయ్యని  రైతులకు ప్రభుత్వ పథకాలు రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ పథకం,పంటల బీమా నుండి వారి పేర్లను శాశ్వతంగా తొలగించి అనర్హులుగా ప్రకటిస్తాము. ఇది వ్యవసాయ కమిషనర్ గారి ఆదేశాల మేరకు జారీ చేసినారు. కావున సబ్సిడీ విత్తనాలు సాగు చేసుకోవాలని రైతులను కోరుచున్నాము. రైతు భరోసా కేంద్రం నకు మీయొక్క పట్టాదార్ పాస్ బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు,ధ్రువీకరణ పత్రం తీసుకొని ఆర్ బి కే నందు పేర్లు నమోదు చేసుకొనవలెను. సాగు చేసిన తర్వాత తప్పనిసరిగా ఈ కేవైసీ మరియు పంట నమోదు  చేయించుకో వలసిందిగా కోరుతున్నాము. ఖరీఫ్ సీజన్లో పంట నమోదు చేయించుకున్న రైతులు అందరూ మీయొక్క పొలములో జరుగు పంట వాలిడేషన్ లేదా వెరిఫికేషన్ కు వ్యవసాయ సహాయకులకు సహకరించ వలసినదిగా కోరుచున్నాము.


Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: