టాంజానియా నవలా రచయిత,,,

అబ్దుల్‌రాజాక్ గుర్నా

 2021 నోబెల్ సాహిత్య బహుమతిని గెలుచుకున్నారు


టాంజానియా నవలా రచయిత అబ్దుల్‌రాజాక్ గుర్నాకు 2021 లో సాహిత్యo లో  నోబెల్ బహుమతి లభించింది. స్వీడిష్ అకాడమీ అతనికి "గల్ఫ్ దేశాలలోని శరణార్ధుల భవిష్యత్ పై వలసవాదం ఏవిధంగా ప్రభావం చూపిస్తుంది అనే అంశంపై” నోబుల్ గౌరవాన్ని ప్రదానం చేసింది.

72 ఏళ్ల టాంజానియా నవలా రచయిత అబ్దుల్‌రాజాక్ గుర్నా 1948 లో జన్మించారు మరియు హిందూ మహాసముద్రంలోని జాంజిబార్ ద్వీపంలో పెరిగారు, కానీ 1960 ల చివరలో శరణార్థిగా ఇంగ్లాండ్ వచ్చారు. ఇటీవల వరకు, అతను కాంటర్‌బరీలోని కెంట్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ మరియు పోస్ట్‌ కలోనియల్ లిటరేచర్  ప్రొఫెసర్‌గా పదవీ విరమణ పొందారు. గుర్నా పది నవలలు మరియు అనేక చిన్న కథలను ప్రచురించాడు.


 

అబ్దుల్‌రాజాక్ గుర్నా రచనలన్నీ శరణార్థుల అనుభవం అనే అంశంపై   రచించబడినవి. అబ్దుల్‌రాజాక్ గుర్నా రచనలు  గతంపట్ల  అతని దృష్టికోణాన్ని ప్రతిబిoబిస్తాయి, 

అబ్దుల్‌రాజాక్ మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో వలసరాజ్యాల తూర్పు ఆఫ్రికా నేపద్యం పై రచించిన  1994 నవల "పారడైజ్" తో బాగా ప్రసిద్ది చెందాడు, ఇది ఫిక్షన్ కోసం బుకర్ ప్రైజ్ కోసం షార్ట్‌లిస్ట్ చేయబడింది.


అబ్దుల్‌రాజాక్ గుర్నా నవలలు వెనుకటి గతం లోనికి  వెళ్లి, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో చాలామందికి తెలియని సాంస్కృతికంగా వైవిధ్యభరితమైన తూర్పు ఆఫ్రికా వైపు దృష్టిని తెరిచాయి" అని అకాడమీ పేర్కొంది

అబ్దుల్‌రాజాక్ గుర్నా మొదటి నవల “మెమరీ ఆఫ్ డిపార్చర్ (1987)”. కానీ అబ్దుల్‌రాజాక్ గుర్నా కు పేరు తెచ్చిన రచన 1990 లో తూర్పు ఆఫ్రికాలో అతని ప్రయాణం నుండి వెలుబడిన పారడైజ్ Paradise (1994). ఈ నవల ముఖ్యంగా అందులోని కథానాయకుడి పాత్ర  జోసెఫ్ కాన్రాడ్ యొక్క హార్ట్ ఆఫ్ డార్క్నెస్ Heart of Darkness  (1899) ద్వారా ప్రభావితమైంది

టాంజానియా రిపబ్లిక్ గా ఏర్పడిన తర్వాత అబ్దుల్‌రాజాక్ గుర్నా చిన్నతనంలో జాంజిబార్‌ను విడిచిపెట్టవలసి వచ్చింది, ప్రవాస నేపథ్యం మరియు శరణార్థులు ఎదుర్కొన్న నిర్లిప్తత భావన పై అతను  రచనలు  చేసాడు. "గుర్నా రచన అతని ప్రవాస కాలం నుండి వచ్చింది, అతను వదిలిపెట్టిన ప్రదేశంతో అతని సంబంధానికి,  అతని జ్ఞాపక శక్తీ కి  సంబంధించినది” అని స్వీడిష్ నోబెల్ ప్రైజ్ వెబ్‌సైట్ గుర్నా గురించి రాసింది.

గుర్నా పాత్రలు ఎల్లప్పుడూ వివిధ గుర్తింపులు, దేశాలు మరియు ఖండాల మధ్య తిరుగుతూ ఉంటాయి. గుర్నా రచనలలో  మూస పద్ధతులను బిన్నంగా అన్వేషించడం కనిపిస్తుంది. 

 స్వీడిష్ అకాడమీ మాటలలో . "గుర్నా  నవలలు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో చాలామందికి తెలియని సాంస్కృతికంగా విభిన్నమైన తూర్పు ఆఫ్రికా వైపు మన దృష్టిని తెరుస్తాయి. గుర్నా 21 ఏళ్ల శరణార్థిగా రాయడం ప్రారంభించినప్పటి  నుండి అతని  సాహిత్య విశ్వంలో - జ్ఞాపకాలు, పేర్లు, గుర్తింపులు. మేధో అభిరుచి ద్వారా నడిచే అంతులేని అన్వేషణ అతని పుస్తకాలన్నింటిలోనూ ముఖ్యంగా ‘ఆఫ్టర్‌లైవ్స్’ (2020) లో ప్రముఖంగా కన్పిస్తుంది., 

సాహిత్యానికి నోబెల్ కమిటీ ఛైర్మన్ అండర్స్ ఓల్సన్ అతన్ని "ప్రపంచంలోని ప్రముఖ పోస్ట్ కలోనియల్ రచయితలలో ఒకరు" అని పేర్కొన్నాడు..

ప్రతిష్టాత్మక నోబాల్ పురస్కారం కు ఒక బంగారు పతకం మరియు 10 మిలియన్ స్వీడిష్ క్రోనర్ ($ 1.14m) లబిస్తాయి.

1901 లో మొదటి నోబెల్ ప్రదానం చేసినప్పటి నుండి 118 మంది సాహిత్య విజేతలలో 95 - లేదా 80 శాతం కంటే ఎక్కువ మంది - యూరోపియన్లు లేదా ఉత్తర అమెరికన్లు.

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: