ఇందిరమ్మ కాలనీ ఫేజ్-2లో...

కనీస సదుపాయాలు కల్పించండి

సదుపాయాలు లేకపోవడంతో ఇళ్లకు లబ్ధిదారులు  దూరం

దీంతో అసాంఘిక శక్తులు అక్కడ తిష్టవేస్తున్నాయి

భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా అధ్యక్షులు పి.వి. కిృష్ణారావు

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

గత పదమూడేళ్లుగా ఏ అభివృద్ధికి నోచుకోని ఇందిరమ్మ కాలనీ ఫేజ్-2 లబ్దిదారుల పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొనివెళ్లే దిశగా భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా అధ్యక్షులు పి.వి. కిృష్ణారావు ఆధ్వర్యంలో తమ సభ్యులతో ఆ కాలనీలో పర్యటించడం జరిగింది,  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ కాలనీ ఫేజ్-2, గతంలో సుమారు మూడువేల మంది లబ్దిదారులకు గృహ నిర్మాణ సంస్ధ ద్వారా అప్పటి గౌరవ ముఖ్యమంత్రి దివంగత నేత వై.ఎస్.రాజశేఖర రెడ్డి

2007-2008 స్కీము ద్వారా మంజూరు చేయగా 3000 మంది లబ్దిదారులు ఇండ్లు నిర్మించుకోవటం జరిగిందని, నిరుపేదలైన ఒక్కొక్క లబ్దిదారునికి ఇంటి పూర్తి నిర్మణానికి ప్రభుత్వంవారు కేటాయించిన రూ.75,000/-లు కాకుండా అదనముగా లబ్దిదారులు సొంతింటికల త్వరగా తీరుతుందనే కోరికతో సుమారు రెండు లక్షల రూపాయల పైచిలుకు వడ్డీలకు అప్పులు తెచ్చి  ఖర్చుచేసి నిర్మించుకొని వున్నారు. కాని నేటికి పదమూడు సంవత్సరాలు గడుస్తున్నను కనీస సదుపాయాలైన విద్యుత్, నీరు, రోడ్లు ఏర్పాటు చేయకపోవడంతో,  నిర్మించిన కొన్ని  ఇండ్లకు చెదలు, ఇండ్లలోపల పిచ్చిచెట్లు పెరిగిపోయి మరికొన్ని ఇండ్లు శిధిలావస్ధకు చేరుకొని అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారినాయని

అలాగే మూడువేల మంది లబ్దిదారుల “ సొంతింటి కల “ నెరవేరకపోగా అప్పులు చేసి కట్టుకున్న సొమ్ముకు వడ్డీలు చెల్లించలేక ఒకవైపు బాడుగ ఇండ్లలో వుంటూ బాడుగలు చెల్లించలేక అవస్ధలు పడతున్నారని మరియు గత రెండు సంవత్సరాలుగా ప్రతి ఒక్కరికి గడగడలాడిస్తున్న “ కరోన మహమ్మారి “ విజృంబణ నేపద్యములో ఒకవైపుఉపాధి కోల్పోయి, మరోకవైపు అప్పులు, బాడుగలు చెల్లించలేక తీవ్ర దుర్భర పరిస్ధితులను ఎదుర్కొంటున్నామని అక్కడి ప్రజలు వాపోయారని తెలిపారు.

గతములో  ఉభయరాష్ట్రాలు కలసి వున్నప్పుడు ఎలక్ట్రికల్ వసతుల నిమిత్తము అప్పటి ధరల ప్రకారము రూ. ఒక కోటి ఎనిమిది లక్షల రూపాయలకు ఎస్టిమేషన్ తయారుచేసి పంపియున్నారని, కాని ఇప్పటి వరకు దానిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని తప్పకుండ మీసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొనివెళ్లి మీ అందరికి న్యాయం జరిగేలా నా వంతూ ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమములో భారతీయ మజ్దూర్ సంఘ్ సభ్యులతో పాటు కాలనీవాసులు పాల్గొన్నారు.


 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్


Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: