మనిషి ఆలోచన ధోరణీ మారాలి

అపుడే లింగబేధ వివక్ష రూపుమాపవచ్చు

వైద్య చరిత్రలో,,,

అత్యంత ప్రభావవంతమైన మహిళలు


యుగాలు మారుతున్న మహిళలపై వివక్ష మాత్రం రూపమాపలేకపోతున్నాం. వాస్తవానికి ఈ వివక్ష మార్పు కోసం చట్టాల కంటే మనషుల్లో నైతిక మార్పు అవసరం. ఏ రంగమైనా మహిళలు ఇట్టే రాణిస్తున్నారు. అందుకే మహిళల పట్ల వివక్షా ధోరణీని మనం విడనాడాలి. ఈ రోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే రంగాలలో వైద్య రంగం ఒకటి. ఈ రంగంలోనూ అత్యంత ప్రభావం చూసిన వారిలో మహిళలు ఉండటం విశేషం. వారెవ్వరో తెలుసుకొందామా...?

•గ్రీకు వైద్యురాలు  మెట్రోడొరా (200 - 400 AD లో) మెడికల్ ఎక్స్‌పోజిషన్ వ్రాసిన ప్రపంచంలో మొట్టమొదటి మహిళ.

•ఏడవ శతాబ్దపు  రుఫైదా అల్ -అస్లామియా మొదటి ముస్లిం నర్సుగా పరిగణించబడినది.

•ఇటాలియన్ మహిళా ప్రొఫెసర్, డోరోటియా బుక్కా (1360-1436) బోలోగ్నా విశ్వవిద్యాలయంలో మెడిసిన్ భోదించిన  మొదటి మహిళ.

•బోస్టన్‌లో, 1848 సంవత్సరం న్యూ ఇంగ్లాండ్ మహిళా వైద్య కళాశాల పునాది వేయబడినది. 

•ఇప్పుడు హోబర్ట్ & విలియం స్మిత్ కాలేజ్, USA అని పిలువబడే జెనీవా మెడికల్ కాలేజీ నుండి గ్రాడ్యుయేట్ చేసిన మొదటి బ్రిటిష్ మహిళ ఎలిజబెత్ బ్లాక్‌వెల్,

•"లేడీ విత్ ఎ లాంప్" గా ప్రసిద్ధి చెందిన నర్స్ ఫ్లోరెన్స్ నైటింగేల్,  1860 లో మొదటి నర్సింగ్ స్కూల్ స్థాపకురాలు. 

•1862 లో, మేరీ ఎడ్వర్డ్ వాకర్ అనే మహిళా అమెరికన్ సివిల్ వార్ సమయంలో యూనియన్ ఆర్మీలో సర్జన్‌గా పనిచేశారు. గాయపడిన వారికి చికిత్స చేయడo లో ఆమె చేసిన కృషికి "మెడల్ ఆఫ్ ఆనర్" అందుకున్న ఏకైక మహిళ మేరీ ఎడ్వర్డ్ వాకర్.

•ప్రపంచంలో మొట్టమొదటి మహిళా శస్త్రచికిత్సరాలు  ప్రొఫెసర్ ప్రిన్సెస్ వెరా గెడ్రోయిట్స్ (1870-1932). ఆమె రష్యాలో మహిళా సైనిక సర్జన్,

•1864 లో రెబెక్కా లీ క్రంప్లర్ మొదటి ఆఫ్రికన్-అమెరికన్ మహిళా వైద్యురాలు.

•1886 వ సంవత్సరం భారతదేశానికి చెందిన కాదంబినీ గంగూలీని మొదటి మహిళా వైద్యురాలు అయింది.

 •1922 లో మొదటి టర్కిష్ మహిళ, సఫియే అలీ ఫిజిషియన్‌గా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు.

•ఆగ్నెస్ సావేజ్ 1929 లో ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రురాలు అయ్యారు.  ఆగ్నెస్ సావేజ్ డాక్టర్‌గా అర్హత సాధించిన మొదటి పశ్చిమ ఆఫ్రికన్ మహిళ.

రచయిత-నిలోఫర్ 

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: