ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా...

రైతు కోసం తెలుగుదేశం

మార్కాపురంలో టీడీపీ నిరసన

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల ఇస్తున్న మోసపూరిత వైఖరికి నిరసనగా గురువారంంనాడు రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమం మార్కాపూర్ పట్టణంలో నియోజకవర్గంలోని మార్కాపూర్ పట్టణ మార్కాపూర్ గ్రామీణ తర్లుపాడు కొనకనమిట్ల పొదిలి మండలం ల నుండి తెలుగుదేశం కార్యకర్తలు విచ్చేసి కార్యక్రమంను భారీ ఎత్తున విజయవంతం చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన విధులు తెలుగుదేశం కార్యకర్తలతో క్రిక్కిరిసి పోయాయి. ఈ నిరసన ర్యాలీ మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి నివాసం నుంచి ఆర్డిఓ ఆఫీస్ వరకు జరిగింది.  ఈ సందర్భంగా మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతాంగం మునుపెన్నడూ ఎదుర్కోని విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, అవగాహనా రాహిత్యం కారణంగా రాష్ట్రంలో వ్యవసాయం దుర్భరంగా తయారైంది అని  వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్ల బిగించి రైతులకు ఉరితాళ్లు బిగించాలని చూస్తున్నారని పంటలకు మద్దతు ధర లేకపోవడం, ఇలా అనేక రైతాంగ సమస్యలు మరియు రైతు వ్యతిరేక విధానాల కారణంగా రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు తీవ్రతరం అవుతున్నాయి అని రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే మన రాష్ట్రం అగ్ర స్థానంలో ఉన్నామని తెలిపారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వo రైతుల పట్ల అనుసరిస్తున్న మోసపూరిత వైఖరే ప్రధాన కారణం అని ఈ ప్రభుత్వం చేస్తున్న రైతు వ్యతిరేక విధానాల వలన రైతాంగ మనుగడ చరిత్రలో కలిసిపోయే ప్రమాదం ఉంది. ఇంకా వారు మాట్లాడుతూ విత్తనాలు, ఎరువులపై అందే సబ్సిడీ ప్రస్తుతం ఈ రాష్ట్ర ప్రభుత్వం నిలిపి వేసిందని ధ్వజ మెత్తారు.

ఆకాశాన్నంటుతున్న ధరలతో రైతులు ఎరువులు కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది అని పంట పండించేందుకు ప్రోత్సాహకాలు లేవు, ఉచిత ఎరువులు, విత్తనాలు లేవు. పండించిన పంటకు మద్దతు ధరలు లేవు. బహిరంగ మార్కెట్లో దళారుల అకృత్యాలపై నియంత్రణ లేదు. ప్రకృతి వైపరీత్యాలతో, చీడ పీడలతో దెబ్బతిన్న పంటలకు బీమా లేదు. పరిహారమూ దక్కదు. ఇన్ పుట్ సబ్సిడీ రెండేళ్లుగా ప్రశ్నార్ధకంగా మారిందని ధ్వజ మెత్తారు. గత ప్రభుత్వం రూ.50వేల వరకు ప్రత్యేక ప్రోత్సాహకం అందించి బిందు సేధ్యాన్ని (డ్రిప్ ఇరిగేషన్) ప్రోత్సహిస్తే ప్రస్తుతం ప్రోత్సాహకాలను నిలిపివేశారని  అలాంటి పథకం ఒకటి ఉందన్న మాటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరచిపోయింది అని తెలిపారు.ప్రభుత్వం సబ్సిడీపై యంత్రాలు అందించే ప్రక్రియకు తిలోదకాలిచ్చారని సూక్ష్మ పోషకాల జాడే లేకుండా చేశారని మట్టి పరీక్షలు(సాయిల్ టెస్ట్) ల ఊసే లేదని కౌలు రైతులకు గుర్తింపు కార్డులు గానీ, గుర్తింపు పత్రాలు గానీ లేకపోవడంతో ప్రభుత్వ సాయం ప్రశ్నార్ధకమైంది అని రైతులకు రుణమాఫీ రద్దు చేశారని  రైతు రథం ద్వారా ట్రాక్టర్లు అందించే పథకాన్ని ఎత్తేశారని  ప్రకృతి వ్యవసాయం పేరుతో సేంద్రీయ వ్యవసాయాన్ని నాడు ప్రోత్సహిస్తే.. నేడు పాతరేశారు అని విమర్శించారు.
మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మాజీ ఎం.ఎల్.ఎ. కందుల నారాయణ రెడ్డి

ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విషయంలోనూ రైతు సమస్యలను తుంగలో తొక్కుతూ రైతాంగాన్ని బలిపీఠం ఎక్కించాలని చూస్తున్నారని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విత్తు వేయడం నుండి.. ధాన్యం కొనుగోలు వరకు ప్రతి దశలోనూ రైతులకు ప్రభుత్వం అండగా నిలిచింది. కానీ నేడు అలాంటి పరిస్థితులు లేకుండా పోయాయి అని నేడు ఈ వైసీపీ ప్రభుత్వంలో పంట పండించే రైతులే తిండికి అలమటించే పరిస్థితులు నెలకొన్నాయని  ఆ పరిస్థితుల్ని రూపు మాపి తెలుగుదేశం హయాంలో అమలుపరిచిన ఈ ప్రభుత్వ హయాంలో రద్దు చేసిన ప్రతి పథకాన్ని కొనసాగించాలి డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరచి రైతు వ్యతిరేక విధానాలను మానుకోవాలని రైతుల సంక్షేమానికి పాటుపడాలని హితవు పలికారు. లేదంటే రైతుకోసం తెలుగుదేశం పోరాటం మరింత ఉదృతం చేస్తామని తెలియజేశారు.

 ఈ కార్యక్రమంలో మార్కాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ మొక్కల గడ్డ మల్లికార్జున, ఒంగోలు పార్లమెంటరీ పార్టీ తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, జిల్లా అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం, మార్కాపురం మండల పార్టీ అధ్యక్షులు జవ్వాజి రామానుజుల రెడ్డి. తర్లుపాడు మండల పార్టీ అధ్యక్షులు ఉడుముల చిన్నపరెడ్డి, కొనకనమిట్ల మండల పార్టీ అధ్యక్షులు కనకం నరసింహారావు, పొదిలి మండల పార్టీ అధ్యక్షులు మీగడ ఓబుల్ రెడ్డి, పొదిలి పట్టణ అధ్యక్షులు ముల్లా ఖుద్దూస్, మార్కాపురం మాజీ ఏఎంసీ చైర్మన్ కాకర్ల శ్రీనివాసులు, పొదిలి మాజీ ఏఎంసీ చైర్మన్ చప్పిడి రామలింగయ్య, ఒంగోలు పార్లమెంటరీ పార్టీ తెలుగుదేశం ఉపాధ్యక్షులు కంచర్ల కాశయ్య, ఒంగోలు పార్లమెంటరీ పార్టీ తెలుగుదేశం కార్యనిర్వాహక కార్యదర్శి పొల్ల  నరసింహారావు, ఒంగోలు పార్లమెంటరీ పార్టీ తెలుగుదేశం కార్యదర్శి ఎర్రం రెడ్డి వెంకటేశ్వర రెడ్డి, ఒంగోలు పార్లమెంటరీ పార్టీ తెలుగుదేశం మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ రసూల్, జిల్లా టిఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి షేక్ గౌస్ బాష, మార్కాపురం కౌన్సిలర్స్ ఏరువా వెంకట నారాయణ రెడ్డి,  నాలి కొండయ్య, పిన్నిక మల్లికార్జున, రాష్ట్ర వాషర్ ఫెడరేషన్ మాజీ డైరెక్టర్ కనిగిరి బాల వెంకట రమణ, జిల్లా వక్ఫ్ బోర్డ్ మాజీ డైరెక్టర్ డాక్టర్ మౌలాలి, పట్టణ ప్రధాన కార్యదర్శి కొప్పుల శ్రీనివాసులు, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు, మార్కాపురం మాజీ కౌన్సిలర్స్, మైనారిటీ నాయకులు, మార్కాపురం పట్టణ, మార్కాపూర్, తర్లుపాడు, కొనకనమిట్ల, పొదిలి మండలంలోని గ్రామ పంచాయితీ సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ  ఎంపీటీసీలు, తెలుగుదేశం గ్రామ కమిటీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున హాజరై కార్యక్రమంను పెద్ద ఎత్తున విజయవంతం చేశారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: