కరెంటు సబ్ చార్జీలు ఉపసంహరించుకోవాలి 

రెండో రోజు రిలే దీక్షలు ప్రారంభించిన, మాజీ ఎమ్మెల్యే ఎం.ఏ. గఫూర్ 

మూడేళ్లలోనే ప్రజల నడ్డి విరిచారు-జానోజాగో సంఘం నేత సయ్యద్ మహబూబ్ బాషా


(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో శుక్రవారం లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఆఫీస్ ఎదురుగా రెండో రోజు  రిలే దీక్షలు చేయడం జరిగింది. ఈ దీక్షలో  ఆవాజ్ జిల్లా కన్వీనర్ మస్తాన్ వలి, జానోజాగో(ముస్లింల అభివృద్ది వేదిక) జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా, పిడిఎస్ యూ జిల్లా సహాయ కార్యదర్శి రఫీ, ప్రగతిశీల యువజన సంఘం జిల్లా నాయకులు నవీన్ కుమార్, ఆవాజ్ పట్టణ యూత్ అధ్యక్షుడు సద్దాం, తిరుమలేష్, కమల్ తదితరులు పాల్గొన్నారు. ఈ దీక్షలకు  ఆవాజ్ పట్టణ అధ్యక్షులు బాబుల్లా అధ్యక్షత వహించారు. ఈ దీక్షలను మాజీ ఎమ్మెల్యే, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఏ. గఫూర్  ప్రారంభించారు.

 


ఈ దీక్షలకు ముఖ్యఅతిథిగా లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర కార్యదర్శి మౌలానా ముస్తాక్ అహ్మద్ వచ్చి మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జానోజాగో సంఘంం జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారాలపై భారం మోపుతున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం కరెంట్ సబ్ ఛార్జీల పేరిట ప్రజల నడివిరుస్తోందని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ప్రజాభిష్టంమేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుచుకోవాలని ఆయన సూచించారు. తాను 30ఏళ్లు సీఎంగా జనరంజక పాలన సాగిస్తానన్న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల పాలనలోనే ప్రజల నడివిరచేశారని చలోక్తులు విసిరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఏ. గఫూర్,లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర మౌలానా ముస్తాక్ అహ్మద్  మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వం ట్రూఅప్  ఛార్జీల పేరుతో ప్రజల పైన అదనపు భారం వేయడం తగదని వెంటనే  ట్రూఅప్ చార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెంచిన విద్యుత్ చార్జీలను రద్దు చేయాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వంట గ్యాస్ పెట్రోలు డీజిల్ రేట్ లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి, ఇంటి ,చెత్త ,కుళాయి, మురుగుకాలువ పన్ను ,రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి డిమాండ్ చేశారు. విద్యుత్ వ్యవసాయ బిల్లును రద్దు చేయాలి వారు డిమాండ్ చేశారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు. ఈ దీక్షలకు మద్దతు ఇచ్చిన వారు సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్, మోత్కుపల్లి టిడిపి సర్పంచ్ భూమా గోపాల్ రెడ్డి ,సిపిఎం పట్టణ కార్యదర్శి తోట మద్దులు, సిఐటియు జిల్లా కార్యదర్శి నాగరాజు, పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  


 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: