అందర్నీ ఆకట్టుకొన్న...ఆ ,,షో

“టాక్స్ ది రిచ్”

ఫ్యాషన్  షోలో ఆలోచింపజేసే సందేశం


“Tax the Rich” (ధనవంతులపై పన్ను వేయండి)- ఇవాళ ప్రపంచ దేశాలన్నింటిలో మారుమోగుతున్న నినాదం. ఈ నినాదం బూర్జువా వర్గానికి, కార్మికవర్గానికి మధ్య జరుగుతున్న పోరులో భాగంగా పుట్టి, కూలివాడలలో పెరిగింది. ఇప్పుడు కులీన కూటమిలలోకి చేరుతున్నది. ప్రపంచంలో పేద, ధనికదేశాల మధ్య  సంపద అంతరాలు పెరగటమే కాదు, ధనిక దేశాలతో సహా అన్ని పెట్టుబడిదారీ దేశాలలో పేదలు, ధనికులమధ్య ఆదాయ అంతరాలు మనవాళ్ళు ఊహిస్తున్న ‘స్వర్గ-నరకాల’మధ్యవున్న తేడాకన్నా అధికంగా వుంది.ఈ  అంతరం కళ్ళకి కట్టినట్టు కనపడుతునే ఉన్నది.  దోపిడితో సంపదను పోగేసుకుంటున్న పెట్టుబడిదారులపైద్వేషంతో పాటు వారిపై అధికపన్నులు వేసి వచ్చిన ఆదాయంతో పేదల అవసరాలను తీర్చమనే డిమాండ్ ఈ నినాదంలో అంతర్లీనంగా ఉన్నది. 

మొన్న సెప్టెంబర్ 13 న న్యూయార్క్ లో Met Gala పేరుతొ ఫ్యాషన్ షో జరిగింది. దీనిలో ప్రపంచంలోని అన్ని దేశాలనుంచి వచ్చే సెలబ్రిటీలు డిజైనర్లు తయారుచేసిన ఫ్యాషన్ దుస్తులతో పాల్గొంటారు. ప్రతి ఏటా సెప్టెంబర్ రెండో సోమవారం ఈ గాలా జరుగుతుంది. కరోనా మహమ్మారి తారాస్థాయిలో ఉన్నందున పోయిన ఏడాది జరగలేదు. తిరిగి ఈ సంవత్సరం జరిపారు. దాదాపు 400 మంది నటులు, క్రీడాకారులు, రచయితలు, ఇతర రంగాల సెలబ్రిటీలు ఈ ఏడాది జరిగిన మెట్-గాలా లో ప్రేక్షకులుగా విచ్చేసారు. ఇందులో రాపర్ లిల్ నాస్ ఎక్ష్ మూడు బగరు దుస్తులతో, పాటగాడు ఫ్రాంక్ ఓషన్ లేత ఆకుపచ్చ కేశాలతో ‘రోబో బేబి’తో ప్రేక్షకులకు దర్శనమిస్తే , సైమన్ బిలేస్ భారీ బరువుగా వుండే వెండి నలుపు దుస్తులతో కనపడింది. ఈ బరువుతో ఒక్క మెట్టు ఎక్కటానికి ఆమెకు ఆరుగురు సహాయపడవలసి వచ్చింది. రియాలిటీ షో స్టార్ కిమ్ కర్దాషియన్కళ్ళు,ముక్కు,నోరు సహా పైనుంచి కాళ్ళ వెళ్ళదాక నల్లటి డ్రెస్ వేసుకోచింది.


 

అయితే ఇవన్ని ఒక ఎత్తు. న్యూయార్క్ పార్లమెంటేరియన్ AOC వేసుకున్న దుస్తులు ఒక ఎత్తు. AOC గా పొట్టి పేరుతొ పిలిచే ఈమె పూర్తిపేరు Alexandria Ocasio Cartez (అలెగ్జాండ్రియా ఒకాసియా కార్టేజ్). డెమోక్రటిక్ పార్టీకి చెందిన అలెగ్జాండ్రియా వయసు 31. 29 ఏళ్లకే అమెరికా పార్లమెంటుకు ఎన్నికై ఇంతవరకు పార్లమెంటుకు గెలిచిన అతి తక్కువ వయసు వున్న మహిళగా పేరు తెచ్చుకుంది.

ఇంతకీ ఆమె ధరించిన డ్రస్సు ఎటువంటిది? వజ్ర, వైఢూర్య, స్వర్ణ,రజిత  లోహాలతో చేసినదా? కాదు. ఆమె డ్రస్సు కన్నా ఆ డ్రస్సు మీద రాసిన  అక్షరాలు ప్రపంచ మంతటా సంచలనం లేపాయి. తెల్లటి డ్రస్సుపై వెనకభాగాన ఎర్రటి అక్షరాలతో “Tax the Rich” అని వ్రాసివుంది. భూగోళ సెలబ్రిటీల ముందు ప్రదర్శించిన ఈ నినాదం గురించి పత్రికలు, టివీ చానల్స్ లోమార్మోగింది. ఆమెను తిట్టే వాళ్ళు తిట్టారు. పొగిడేవాళ్ళు పొగిడారు.అలెగ్జాండ్రియా రాజకీయవేత్త గాని, సెలబ్రిటీ కాదన్నారు. ఆమె చేసిందంతా హిపోక్రసి, పైపై నటన, ప్రచారంకోసమే అన్నారు .చర్చ ఆమెమీదే కాకుండా, ఆమె నినాదం మీద కూడా సాగింది. AOC మాత్రం ఏమాత్రం తొణకకుండా నాకు కావాల్సిందీ ఇదే చర్చ అన్నది.

అమెరిక కాంగ్రెస్ కు ఎన్నిక కాకమునుపు అలెగ్జాండ్రియా వైట్రేస్ గాను, బార్టెండర్ గాను పనిచేసింది. అంటే కార్మికవర్గం నుంచి వచ్చినట్టేకదా. అందరికి ఆరోగ్యసంరక్షణ, పనిప్రాంతాలలో ప్రజాస్వామ్యం, ట్యూషన్ ఫీజ్ లేని గవర్నమెంట్ కాలేజీలు, జాబ్ గ్యారంటీ లాంటి శ్రామికుల సమస్యల మీద పనిచేసింది. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి. ఆమె డ్రెస్ డిజైన్ చేసింది అరోరా జేమ్స్ అనే నల్ల జాతి మహిళ. పాండమిక్ లో కూడా పెట్టుబడిదారులు భారీలాభాలు సంపాయించుకున్నారు. కార్మికులకు లాక్డౌన్ మూలంగా ఉద్యోగాలు, ఆదాయాలు పోయాయి. ధరలు పెరిగాయి. ఈ ఫ్యాషన్ షో చూడాలంటే టికెట్ తలకి 1995 లోవెయ్యి డాలర్లు ఇప్పుడు 30,000 డాలర్లు. ఆమె స్లోగన్ లో న్యాయం ఉంది కూడా.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

            


 


 

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: