క్యాన్సర్‌ నిర్మూలనకు,,,

 సీఎం జగన్ కృషి అనిర్వచనీయం 

*నోరి దత్తాత్రేయుడుని సలహాదారుగా నియమించడం గొప్ప నిర్ణయం  

వైసిపి రాష్ట్ర నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్_ విజయవాడ బ్యూరో)

ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాల్లో క్యాన్సర్‌ చికిత్స కోసం ప్రత్యేకంగా ఆస్పత్రులను ఏర్పాటు చేయడంతో పాటు అందులో ఒకటి అత్యాధునికంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పించడం చరిత్రలో నిలిచిపోయే నిర్ణయమని ప్రముఖ ఫార్మా కంపెనీ అధినేత డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్‌ వైద్య నిపుణుడు, పద్మశ్రీ డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడుని క్యాన్సర్‌ చికిత్సకు సంబంధించి తగిన సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వానికి సలహాదారుగా నియమించడం మంచి విషయమని చెప్పారాయన. ఏపీ ప్రభుత్వం చేపట్టే అన్ని రకాల వైద్య కార్యక్రమాలకు ముఖ్యంగా క్యాన్సర్ సంబంధిత కార్యక్రమాలకు నోరి దత్తాత్రేయుడు లాంటి గొప్ప వ్యక్తి సేవలు అవసరమని..  దశాబ్దాలుగా రోగుల్ని పట్టిపీడిస్తున్న క్యాన్సర్ మహమ్మారిని నిర్మూలించడంలో సీఎం జగన్ చూపిన చొరవ అనిర్వచనీయమన్నారు. క్యాన్సర్‌ రోగులందరికీ చికిత్సలు అందుబాటులోకి తీసుకు రావాలన్నది ముఖ్యమంత్రి లక్ష్యం అన్నారు.

. సీఎం జగన్ ఆలోచనలకు దత్తాత్రేయుడు లాంటి మేధావులు తోడవ్వడంతో మంచి ఫలితాలు చూడబోతామన్నారు ఏలూరి. ఇక తమ కంపెనీ SRC Laboratories ఆధ్వర్యంలో క్యాన్సర్ డ్రగ్స్ పై పరిశోధనలు జరుపుతున్నామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రఖ్యాత శాస్త్రవేత్తలు క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నారని.. త్వరలోనే క్యాన్సర్ మహమ్మారికి శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఏలూరి రామచంద్రారెడ్డి చెప్పారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: