జకారియా రాజీ

ప్రముఖ పర్షియన్ వైద్యుడు854-925

Zakariya Razi; Persian popular physicianఅబూ బకర్ ముహమ్మద్ జకారియా రాజీ ఒక ప్రసిద్ధ పర్షియన్ పాలిమత్, వైద్యుడు, రసవాది. అబూ బకర్ ముహమ్మద్ జకారియా రాజీ తత్వశాస్త్రం, ఖగోళశాస్త్రం, మెటాఫిజిక్స్, మెడిసిన్  మొదలగు శాస్త్రాలలో  ముఖ్యమైన గ్రంధాల  రచయిత  మరియు వ్యాకరణవేత్త. అతని పేరు మొహమ్మద్. అతని బిరుదు అబ్బు బకర్. అతని తండ్రి పేరు జకారియా. తూర్పు చరిత్రకారులు అతని పేరును మొహమ్మద్ బిన్ జకారియా రజీగా పలికారు, కానీ పాశ్చాత్య చరిత్రకారుల ప్రకారం అతని లాటిన్ పేరు రహజేస్Rhazesగా రాసిస్ Rasis. రాజీ 854AD లో రేయ్‌ Rey లో జన్మించాడు, ప్రస్తుత ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భాగమైన రేయ్‌లో తన బాల్యం, యవ్వనం గడిచింది. రాజీ అక్టోబర్ 31, 925 AD న రేయ్‌లో మరణించాడు. రాజీ చాలా పెద్ద వయసులో వైద్య శాస్త్రం నేర్చుకున్నాడు. మొదట, రాజీ రసాయన శాస్త్రవేత్తగా పనిచేశాడు; అప్పుడు, అతని కళ్ళు దెబ్బతిన్నవి.  తన కళ్ళను నయం చేయడానికి రాజీ మెడిసిన్  అధ్యయనం చేయడం ప్రారంభించాడు. అతను బాగ్దాద్ ఆసుపత్రిలో మెడికల్ సైన్స్ నేర్చుకున్నాడు మరియు  ప్రముఖ వైద్యుడు అయ్యాడు. బాగ్దాద్ మరియు రేలోని ఆసుపత్రులకు రాజీ చీఫ్ ఫిజిషియన్‌గా పనిచేశాడు. రాజీ 250 కి పైగా మెడికల్ మాన్యుస్క్రిప్ట్‌లను వ్రాసాడు.


మశూచి మరియు మీజిల్స్‌పై వ్యాధుల క్లినికల్ క్యారెక్టరైజేషన్ వివరిస్తూ రాజీ ఒక మార్గదర్శక పుస్తకాన్ని వ్రాసాడు. కరాజ్‌లోని రాజీ ఇనిస్టిట్యూట్ మరియు కెర్మన్షాలోని యూనివర్సిటీకి గొప్ప వైద్యుడు అయిన రాజీ పేరు పెట్టారు. ప్రతి 27 ఆగస్టులో ఇరాన్‌లో రాజీ రోజు లేదా ఫార్మసీ దినోత్సవం జరుపుకుంటారు. జూన్ 2009 లో వియన్నాలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయానికి ఇరాన్ స్కాలర్స్ పెవిలియన్‌ను విరాళంగా ఇచ్చింది మరియు  ఇది వియన్నా ఇంటర్నేషనల్ సెంటర్‌లోని సెంట్రల్ మెమోరియల్ ప్లాజాలో ఉంది. ఈ పెవిలియన్‌లో పర్షియన్ ప్రముఖులైన రాజీ, అవిసెన్నా, అబూ రాయన్ బెరుని మరియు ఒమర్ ఖయ్యామ్ విగ్రహాలు ఉన్నాయి. బెల్జియంలో జన్మించిన అమెరికన్ రసాయన శాస్త్రవేత్త మరియు చరిత్రకారుడు అయిన జార్జ్ సార్టన్, రాజీని ఇస్లాం మరియు మధ్యయుగ యుగాలలో గొప్ప వైద్యుడు అని అభివర్ణించారు. రాజీ తన జీవితపు  చివరి సంవత్సరాల్లో అంధత్వంతో బాధపడ్డాడు. అబూ రేహాన్ బెరుని,  రాజీ 60 సంవత్సరాల వయసులో 925 ADలో రే లో మరణించాడని పేర్కొన్నాడు.


Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: