డిస్నీ+  హాట్ స్టార్ మొద‌టి సారి తెలుగు వెబ్ సిరీస్,,,

‘అన్హర్డ్’    ప్రకటించిన ఎల్ల‌న్నార్ ఫిల్మ్

రాధికా లావు నిర్మాణ సారథ్యంలో, ఆదిత్యా కేవీ దర్శకత్వంలో,,,,

రూపుదిద్దుకొని 2021 సెప్టెంబర్ 17న విడుదల కానున్న సిరీస్

బారత స్వాతంత్ర్య పోరాటం పై సగటు మనిషి దృక్పథాన్ని వెల్లడిస్తుంది(జానోజాగో వెబ్ న్యూస్-బిజినెస్ బ్యూరో)

సగటు మనిషి విశ్వాస వ్యవస్థ ఒకదేశపు గతిని మార్చగలదా? అన్‌హర్డ్ తెలుగు హాట్ స్టార్ స్పెష‌ల్ సిరీస్‌లోకి  ప్రవేశించింది డిస్నీ+హాట్స్టార్. అన్‌హర్డ్  యొక్క ప్రత్యేక కథన రీతి భారత దేశ చరిత్రలో ముఖ్యమైన కాలానికి సంబంధించిన విభిన్న తాత్వికతలను వెల్లడిస్తుంది. ఈసిరీస్ ఐదు ముఖ్యపాత్రల జీవితాలను అనుసరిస్తుంది. భారత్ ఒక దేశంగా ఆవిర్భవించేందుకు చేస్తున్నపోరాటంలో అవన్నీతమను తాము అన్వేషించుకుంటాయి, తాము పోషించే పాత్రలను కూడా. బ్రిటిష్వారి నుంచి మాత్రమే కాదు, నిజాం నుంచి కూడా స్వాతంత్ర్యం కోరుకోవడం చుట్టూ మరియు హైదరాబాద్ విలీనం నగర సాధారణ ప్రజానీకానికి అత్యంత ప్రాధాన్యమైందిగా మారడంపై జరిగిన ఈవిధమైన అసాధారణ సంభాషణలకు హైదరాబాద్రాజ్యం వేదికగా నిలిచింది. ఇది తిరుగులేని వినోద వీక్షణ అనుభూతిని అందిస్తుంది. ఎక్స్‌క్లూజివ్ డిస్ని+ హాట్ స్టార్  వెబ్ సీరీస్ సెప్టెంబర్ 17 నుంచి ప్రసారంకానుంది. 

ఈ కథ రాధికాలావు సారథ్యంలోని ఎల్ల‌న్నార్‌ మొదటి ప్రత్యేకమైన కాల సంబంధిత డ్రామా వెంచర్గా రూపుదిద్దుకుంది. ‘అన్హర్డ్’ ఈవిలక్షణమైన స్టోరీ టెల్లింగ్  మ‌రియు ఆదిత్యా కేవీ దర్శకత్వం ప్రపంచానికి దానికి తెలియని కథలను తెలియజేస్తుంది. అసాధారణ సంభాషణలు వారిని పోరాట వాదులుగా మార్చాయి, స్వాతంత్ర్యం కోసం వారు తమ ప్రాణాలనే త్యాగంచేసేలా చేశాయి. చౌరిచౌరా ఉదంతం, సహాయ నిరాకరణ ఉద్యమం, స్వాతంత్ర్యం అనంతరం పాకిస్థాన్లో చేరేందుకు నిజాంచేసిన విఫల ప్రయత్నంలాంటి వాటినేపథ్యంలో స్వతంత్ర భారతావని రూపు దిద్దుకోవడం వంటివన్నీ ఇందులో చర్చకు వచ్చాయి. 

తమ విశ్వాసాలకు కట్టుబడిన సగటు ప్రజల, స్త్రీ, పురుషుల మక్కువలను మరోసారి కళ్లకు కట్టినట్లు చూపించిన ఈసిరీస్లో శ్రీనివాస్ అవసరాల, బాలాదిత్య, చాందిని చౌదరి, ప్రియదర్శి, అజయ్లాంటి ప్రతిభావంతులు నటించారు.

అన్‌హర్డ్ ఎందుకు ఎంచుకున్నారన్న ప్రశ్నకు నిర్మాత రాధికలావు బదులిస్తూ, ‘‘సినిమా మాధ్యమం ద్వారా శక్తివంతమైన కథలను చెప్పడాన్నిఎల్ల‌న్నార్ విశ్వ‌సిస్తుంది. వివాదాలతో కూడుకున్న నేటి ప్రపంచంలో సరళమైన సంభాషణ గతంగా మిగిలింది. స్వేచ్ఛ, త్యాగం, సామాజిక వర్గం, దేశం లాంటి అంశాలలో తుపాతుల్లోకి వెళ్లేందుకు చేసిన ప్రయత్నమే ‘అన్హర్డ్’. మాపాత్రలు ఎంతగా పటిష్ఠమైన విశ్వాసాలు, భావజాలాలు కలిగి ఉన్నప్పటికీ, విభిన్న దృక్పథాలను అర్థం చేసుకొని, ప్రశంసిస్తాయి, అలాంటివి ఈరోజుల్లో కనిపించవు’’ అని అన్నారు. 

ఈసిరీస్కు దర్శకత్వం వహించిన ఆదిత్యకేవీ ఈసందర్భంగా మాట్లాడుతూ, ‘‘తమ అభిమతం ద్వారా దేశం కోసం పోరాడిన వారి ఆలోచనలను అన్హర్డ్ద్వారా అందించాలని మేం భావించాం. ఒక కన్వర్జేషనల్సిరీస్గా అన్హర్డ్ ఒక సంక్లిష్టతను ఒక సరళ దృశ్య రూపంలో అందించింది’’ అనిఅన్నారు.

కథాంశం: 

అన్హర్డ్ అనేది ఆరుభాగాల సిరీస్. వీటిలో ప్రతి ఒక్కటి కూడా భారతదేశ చరిత్రలోని ముఖ్యఘట్టాలకు సంబంధించిన భిన్నదృక్పథాలను వెల్లడించేలా రూపుదిద్దుకుంది. ఇందులోని పాత్రలకు వేటికీ భవిష్యత్భారతం ఎలా ఉంటుందో తెలియదు, అయినా కూడా అవి తమ విశ్వాస వ్యవస్థలను కాపాడుకునేందుకు ప్రయత్నించాయి. తమ విశ్వాసాలపై నమ్మకం ఉజ్వల భవితను అందిస్తుందని అవి విశ్వసించాయి.

~ఇప్పటి వరకూ చెప్పబడని, ఎవరికీ తెలియని కథలను స్వాతంత్ర్యం నేపథ్యంలో చూడండి మరియు హైదరాబాద్ రాజ్యం సెప్టెంబర్ 17న ఎలా జీవం పోసుకున్నదో చూడండి...డిస్నీ+హాట్స్టార్‌ మాత్రమే. 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

   
 

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: