సిబ్బంది కొరతలేని ప్రభుత్వ ఆసుపత్రులు

*సీఎం ఆదేశాలతో వైద్య ఆరోగ్యశాఖలో భారీ రిక్రూట్‌ మెంట్‌*

*సుమారు 14,200 పోస్టుల భర్తీ, సీఎం గ్రీన్‌ సిగ్నల్‌

*ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి వైద్యకళాశాల, బోధనాసుపత్రుల వరకూ భర్తీ

*అక్టోబరు నుంచి ప్రక్రియ ప్రారంభం... నవంబర్‌ 15 నాటికి ముగింపు*

కార్యాచరణకు సీఎం వైయస్.జగన్‌ ఆమోదం

(జానో జాగో వెబ్ న్యూస్_విజయవాడ బ్యూరో)     

సిబ్బంది కొరత లేని ఆసుపత్రిలో ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టాలని వైద్యాధికారులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వైద్య ఆరోగ్య శాఖ పై శుక్రవారం నాడు సీఎం సమక్షంలో సమీక్షా సమావేశం జరిగింది. సిబ్బంది కొరతలేకుండా నియామకాలపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకూ వివిధ స్థాయిల్లో ప్రస్తుతం ఉన్న సిబ్బంది, కావాల్సిన సిబ్బందిపై వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి*

*జాతీయ స్థాయిలో ప్రమాణాలు, ప్రస్తుతం ఉన్న అవసరాలు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే....:ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యులు, సిబ్బంది కొరత ఉండకూడదని స్పష్టంచేసిన సీఎం

కోట్లాది రూపాయలు ఖర్చుచేసి ఆస్పత్రులను నిర్మిస్తున్నాం, తీరా అక్కడ చూస్తే.. సిబ్బంది లేక రోగులకు సేవలు అందని పరిస్థితి: సీఎం

సంవత్సరాల తరబడి ఇలాంటి సమస్యలే మనం నిత్యం చూస్తున్నాం: ఇకపై దీనికి చెక్‌ పెట్టాల్సిన అవసరం ఉంది: వైద్యంకోసం భారీగా ఖర్చులు చేయాల్సిన పరిస్థితి పోవాలి: ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందాలి:

ఈ లక్ష్యం దిశగా అడుగులు వేయాలి: అధికారులకు సీఎం నిర్దేశం, కావాల్సిన సిబ్బంది వెంటనే నియమించాలని ఆదేశించిన ముఖ్యమంత్రి , ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌తోపాటు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు సరిపడా సిబ్బందితో సమర్థవంతంగా నడపాలి,  ఒక డాక్టరు సెలవులో వెళ్తే.. ఆ స్థానంలో మరో డాక్టరు విధులు నిర్వహించేలా ... దీనికి తగిన సంఖ్యలో వైద్యులను నియమించండి:

డాక్టరు సెలవు పెడితే.. రోగులకు వైద్యం అందని పరిస్థితికాని, తోటి డాక్టర్లపై భారం పడే పరిస్థితి కాని ఉండకూడదని స్పష్టంచేసిన సీఎం

*వైద్య ఆరోగ్య శాఖలో భారీ రిక్రూట్‌మెంట్‌*

పీహెచ్‌సీల నుంచి బోధనాసుపత్రుల వరకూ దాదాపు 14,200కుపైగా పోస్టులను భర్తీకి అధికారుల ప్రతిపాదన, సీఎం గ్రీన్‌సిగ్నల్‌

అక్టోబరు 1 నుంచి ప్రక్రియ మొదలుపెట్టి నవంబరు 15 నాటికి పూర్తిచేసేలా కార్యాచరణ

పోస్టుల భర్తీ ప్రక్రియకు సీఎం ఆమోదం

*కోవిడ్‌ 19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై సీఎంకు వివరాలందించిన అధికారులు*

ఏపీలో యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులు 13,749 

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారు 2787

కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో చికిత్స పొందుతున్నావారు 562

రికవరీ రేటు 98.60 శాతం

పాజిటివిటీ రేటు 2.12 శాతం

3 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాలు 10,  3 నుంచి 5 శాతం లోపు పాజిటివిటీ ఉన్న జిల్లా 2

ఐదు శాతం కంటే ఎక్కువ పాజిటివిటీ ఉన్న జిల్లా 1

రాష్ట్ర వ్యాప్తంగా జీరో కేసులు నమోదైన సచివాలయాలు 10,921

నెట్‌ వర్క్‌ ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్న బెడ్స్‌ 91.33 శాతం

ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్న బెడ్స్‌ 72.64 శాతం

*థర్డ్‌ వేవ్‌ పై సన్నద్ధత*

అందుబాటులో ఉన్న డీటైప్‌ సిలెండర్లు  27,311

మొత్తం అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ 20,964

ఇంకా రావాల్సినవి 2493

128 ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ఫైప్‌లైన్‌ వర్క్‌ పూర్తి

ఆక్సిజన్‌ జనరేషన్‌ (పీఎస్‌ఏ) ప్లాంట్లు 143 చోట్ల ఏర్పాటు 

అక్టోబరు 10 నాటికి అందుబాటులోకి రానున్న మొత్తం ప్లాంట్లు 

*వ్యాక్సినేషన్‌*

ఇప్పటివరకు వ్యాక్సినేషన్‌  చేయించుకున్నవారి సంఖ్య  2,61,56,928

సింగిల్‌ డోసు వ్యాక్సినేషన్‌ పూర్తయినవారు 1,34,96,579

రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తిచేసుకున్నవారు 1,26,60,349

వ్యాక్సినేషన్‌ కోసం ఉపయోగించిన మొత్తం డోసులు  3,88,17,277

*కోవిడ్‌ నిబంధనలు, వ్యాక్సినేషన్‌పై అధికారులకు సీఎం ఆదేశం*

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాల్లో వ్యాకినేషన్‌ కార్యక్రమంపై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించండి : సీఎం

ఈ మూడు జిల్లాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కోసం ప్రత్యేక అధికారులను నియమించండి

కోవిడ్‌ ప్రోటోకాల్‌కు సంబంధించి గైడ్‌లైన్స్‌ పై అధికారులకు సీఎం ఆదేశం 

రాత్రిపూట కర్ఫ్యూ యధావిధిగా అమలు చేయాలన్న సీఎం, పాజిటివిటీ రేటు ఎక్కుగా ఉన్న జిల్లాల్లో అంక్షలు కొనసాగుతాయి, కోవిడ్‌ నిబంధనలును కచ్చితంగా, కఠినంగా అమలు చేయాలి,వ్యాక్సినేషన్‌ ప్రక్రియే కోవిడ్‌ సమస్యకు పరిష్కారమన్న సీఎం, దీన్ని వేగవంతం చేయాలని ఆదేశం,కొత్తగా నిర్మిస్తున్న బోధనాసుపత్రుల పనుల ప్రగతిపై ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలి : అధికారులను ఆదేశించిన సీఎం

ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి(వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని),ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సలహాదారు గోవిందహరి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎం టీ కృష్ణబాబు, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, 104 కాల్‌ సెంటర్‌ ఇంఛార్జి ఏ బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్‌ చంద్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి మురళీధర్‌ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ (డ్రగ్స్‌) రవిశంకర్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: