10వ వార్షిక వేడుకల్లో భాగంగా,,,

సరికొత్త కైగర్‌ RXT(O) & క్విడ్‌ MY21ను

ఆవిష్కరించిన రెనో

(జానోజాగో వెబ్ న్యూస్-బిజినెస్ బ్యూరో) 

భారతదేశంలో కార్యకలాపాలు ప్రారంభించి 10 సంవత్సరాలైన  సందర్భంగా వేడుకలు జరుపుకుంటున్న రెనో ఇండియా ఇందులో భాగం సరికొత్త రెనో కైగర్‌ వేరియంట్‌లో RXT (O), KWID MY21 ను విశాఖపట్నంలో ఆవిష్కరించింది.  రెనో కైగర్‌ RXT (O) ఎంటీ, ఎఎంటీ రెండు ట్రాన్స్‌మిషన్స్‌లో 1.0లీ ఎనర్జీ ఇంజిన్‌తో లభ్యమవుతోంది. RXZ వేరియంట్‌లో కస్టమర్లు మెచ్చినవి, ప్రీమియం ఫీచర్లైన  ట్రై-ఆక్టా ఎల్‌ఈడీ ప్యూర్‌ విజన్‌ హెడ్‌ల్యాంప్స్‌, 40.64 సెం.మీ డైమండ్‌ కట్‌ అలాయ్‌ వీల్స్ వంటివి RXT (O) వేరియంట్‌లో సరసమైన ధరలకు లభిస్తాయి. సరికొత్త కైగర్‌ RXT (O) ఐకానిక్‌ త్రీ-ఎల్‌ఈడీ ఫ్రంట్‌ లుక్‌, 40.64 సెం.మీ డైమండ్‌ కట్‌ అలాయ్‌వీల్స్‌తో కట్టిపడేసే రేడియంట్ రెడ్‌ డ్యూయల్‌ టోన్‌ కలర్‌ కారు డిజైన్‌ను మరింత ఆకర్షణీయంగా నిలుపుతాయి. కేబిన్‌లో చక్కని నాణ్యమైన గాలి ఉండేందుకు వీలుగా RXT (O)లో ప్రత్యేకంగా పిఎం2.5 అడ్వాన్స్డ్‌ అట్మాస్పెరిక్‌ ఫిల్టర్‌ ఏర్పాటు చేయబడంది. RXT (O) వేరియంట్‌లో మొత్తంగా స్మార్ట్‌ కేబిన్‌ అనుభూతిని పెంచి ప్రయాణికులు తమ స్మార్ట్‌ఫోన్లతో కనెక్ట్‌ అయ్యేందుకు 20.32 సెం.మీ డిస్‌ప్లే లింక్‌ ఫ్లోటింగ్‌ టచ్‌స్క్రీన్‌లో వైర్‌లెస్‌ స్మార్ట్‌ఫోన్‌ రిప్లికేషన్‌ ఫంక్షన్‌ ఏర్పాటు చేయబడింది.


ఆకర్షణీయమైన, సృజనాత్మకమైన, సరసమైన ధరలోని వాహనమైన రెనో క్విడ్‌ రెనో ఇండియా వేగాన్ని మార్చేసింది. అద్భుతమైన ప్రొడక్ట్‌ ఇన్నోవేషన్‌తో క్విడ్‌ సాధించిన విజయపరంపరను కొనసాగిస్తూ సరికొత్త క్విడ్‌ MY21 తన విలువకు మరింత బలాన్ని చేకూర్చుకొని ఈ ప్రొడక్టు, బ్రాండ్‌పై కొనుగోలుదారుల నమ్మకాన్ని మరింత పెంచేలా నిలుస్తుంది.

మ్యానువల్‌, ఎఎంటీ రెండు ఆప్షన్లు, 0.8లీ, 1.0లీ SCe పవర్‌ ట్రెయిన్స్‌ను కలిగిన రెనో క్విడ్‌ MY21 రేంజ్‌ అందిస్తుంది. భారతదేశంలో వర్తించే అన్ని భద్రతా నియమాలకు అనుగుణంగా ఉండే రెనో క్విడ్‌లో ఇప్పుడు అన్ని వేరియంట్స్‌లో స్టాండర్డ్‌ ఫీచర్‌గా డ్యూయల్‌ ఫ్రంట్‌ ఎయిర్‌బ్యాగ్స్‌  ఏర్పాటు చేయబడ్డాయి. ఈ నిబంధనల అమలుకు ఇంకా గడువు ఉన్నా ఇది ముందే అందుబాటులోకి వచ్చేసింది. కారు అందాన్ని మరింత పెంచేందుకు రెనో క్విడ్‌ MY21 క్లైంబర్‌ ఎడిషన్‌లో ఇప్పుడు  బ్ల్యాక్‌ రూఫ్‌తో  వైట్‌ కలర్‌డ్యూయల్‌ టోన్‌ ఎక్స్‌టీరియర్‌ కూడా అందుబాటులో ఉంది. దీంతో పాటు ఎలక్ట్రిక్‌ ఓఆర్‌వీఎం, డే అండ్‌ నైట్‌ ఐఆర్‌వీఎం వంటి కొత్త ఫీచర్లు కనువిందు చేస్తాయి. అంతే కాదు రకరకాల యాక్టివ్‌, ప్యాసివ్‌ భద్రతా ఫీచర్లలో భాగంగా ఇప్పుడు భద్రతను మరింత పెంచుతూ దీనిలో ఫ్రంట్‌ డ్రైవర్‌ సైట్‌ పైరోటెక్‌ & ప్రీటెన్షనర్‌ ఫీచర్‌ జోడించబడింది.

రూ.7.37 లక్షలు (ఎక్స్‌ షోరూమ్‌ విశాఖపట్నం)తో రెనో కైగర్‌ RXT(O) వేరియంట్‌ ఆవిష్కరించడమైనది.  సరికొత్త క్విడ్‌ MY 21 రేంజ్‌ ప్రారంభ ధర రూ.4.06 లక్షల (ఎక్స్‌ షోరూమ్‌ విశాఖపట్నం)..

వేడుకల్లో భాగంగా సెప్టెంబర్‌ 2021లో ఖాతాదారులకు తన ప్రొడక్టు రేంజ్‌లో ఎంపిక చేసిన వేరియంట్స్‌పై గరిష్ఠంగా రూ.80,000 వరకు ప్రయోజనాలు అందించే ప్రత్యేక ఆఫర్లను రెనో ప్రకటించింది. ఈ సమయంలో కొత్త రెనో వాహనం కొనుగోలు చేసినప్పుడు ఈ ఆఫర్లు పొందవచ్చు. అంతేకాదు 10వ వార్షిక వేడుకల సందర్భంగా రెగ్యులర్‌ కొనుగోలు ఆఫర్లకు పైన గరిష్ఠంగా రూ.110,000 అందించే 10 ప్రత్యేక లాయల్టీ రివార్డులను రెనో ప్రవేశపెట్టింది. 

నగదు, లాయల్టీ బోనస్‌ రూపంలో ఆఫర్లు ప్రకటించడంతో పాటు రెనో క్విడ్‌, ట్రైబర్‌, కైగర్‌ కొనుగోలుపై ఇప్పుడు కొనండి, 2022లో చెల్లించండి పథకాన్ని ప్రకటించింది. అంటే కొనుగోలుదారులు ఇప్పుడు కొత్త రెనో వెహికిల్‌ కొనుగోలు చేసిన దాని ఈఎంఐలు చెల్లింపును 6 నెలల తర్వాత ప్రారంభించుకోవచ్చు.

భారత్‌లో దశాబ్ద కాల అనుబంధంలో ప్రపంచశ్రేణి తయారీ కేంద్రం, ప్రపంచస్థాయి టెక్నాలజీ సెంటర్‌, లాజిస్టిక్స్‌, డిజైన్‌ సెంటర్‌ సహ గణనీయమైన ప్రగతిని రెనో సాధించింది. 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

   


  

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: