సెప్టెంబర్ 2021

 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

"జనసేన"ను కర్ణాటకలో

విస్తరిస్తున్న డి.ఎస్.రావ్-వి.సముద్ర

 (జానో జాగో వెబ్ న్యూస్_  సినిమా బ్యూరో)

    జనసేనాధినేతగా అప్రతిహతంగా సాగుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు వి.సముద్ర తెలుగులో రూపొందించిన "జైసేన" చిత్రాన్ని కన్నడలో అనువదిస్తున్నారు ప్రముఖ నటుడు-నిర్మాత డి.ఎస్.రావు. 

    శ్రీకాంత్, సునీల్, తారక్ రత్న, శ్రీరామ్, సత్యం రాజేష్, ప్రవీణ్, హరీష్ గౌతమ్, అభినవ్ మణికంఠ, విశ్వకార్తికేయ, నీతూ గౌడ్, ఆరాధ్య, మనోచిత్ర, అజయ్ ఘోష్, చమ్మక్ చంద్ర, డి.ఎస్.రావ్, పృథ్వి ముఖ్యపాత్రలు పోషించిన "జై సేన" చిత్రం మెగా-పవర్ ఫ్యాన్స్ తోపాటు  అందరినీ అమితంగా ఆకట్టుకుంది. 

      ఈ చిత్రాన్ని గణపతి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డి.ఎస్.రావ్ కన్నడ ప్రేక్షకులకు అందిస్తున్నారు. తెలుగులో ఘన విజయం సాధించిన "జై సేన" కన్నడలోనూ మంచి విజయం కైవసం చేసుకోవడం ఖాయమని దర్శకుడు వి.సముద్ర పేర్కొన్నారు.

      ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వాసు, కూర్పు: నందమూరి హరి, నిర్మాత: డి.ఎస్.రావ్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వి.సముద్ర!!

 ఓటు అడగం తెలుసు,,,,

సమస్యలు మాత్రం పట్టవా..

ప్రజాప్రతినిధులు... అధికారుల తీరుపై-సుందరయ్య కాలనీ వాసుల ఆగ్రహం


(జానో జాగో వెబ్ న్యూస్_  సినిమా బ్యూరో)

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ శివారులో గల సుందరయ్య కాలనిలో ప్రజల మౌళిక వసతులు, ముఖ్యంగా దాహార్తిని తీర్చడంలో  ప్రజా ప్రతినిధులు, అధికారులు విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఎలక్షన్ల సమయంలో గుర్తుకు వచ్చే ఓట్ల కోసం తప్ప ప్రజా సమస్యలు తీర్చడంలో విఫలమైందని ముఖ్యంగా వారి తాగునీటి సమస్యలు తీర్చడంలో మాత్రం ప్రజలు గుర్తుకు రావడం లేదు. పేరు ఏమో సుందరయ్య కాలనీ వసతులలో మాత్రం వెనుకబడి పోయారు.

 బి.జె.పి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.వి.క్రిష్ణారావు

ఎటు చూసిన పారిశుద్ధ్యం, సరైన రోడ్లు కాలువలు వీధి దీపాలు లేకుండా వెలవెలబోతోంది ఎలక్షన్లు వస్తే మాత్రం నాయకులు వచ్చి అవి చేస్తాం ఇది చేస్తాం అంటూ నానా హంగామా చేసి వారి అవసరం తీరాక ఎవరు ఇటువైపు తొంగి చూడడం లేదు అంటూ కాలనీవాసులు వాపోయారు. BMS  ప్రకాశం జిల్లా ఇంచార్జ్ P. V. కృష్ణారావుకు కాలనీవాసులు తమ సమస్యలు  ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సరైన వసతులు కల్పించే విధంగా చూడాలని కోరారు, శిధిలావస్థలో ఉన్న నీటి ట్యాంక్ లో నీరు నిల్వ ఉండడం లేదని ఇప్పటికైనా అధికారులు నాయకులు గమనించి త్రాగునీటి సమస్య తీర్చే విధంగా చూడాలని రోడ్లు డ్రైనేజీలు వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు.

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 125 కోట్ల భారీ బడ్జెట్ 

బహు భాషా చిత్రం "మానాడు" 

ట్రైలర్ రిలీజ్ చేస్తున్న 

నేచురల్ స్టార్ నాని!!

(జానో జాగో వెబ్ న్యూస్_  సినిమా బ్యూరో)

     తెలుగులోనూ సుప్రసిద్ధుడైన సూపర్ స్టైలిష్ తమిళ్ స్టార్ శింబు-కల్యాణి ప్రియదర్శన్ జంటగా... క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో.. వి హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత 'సురేష్ కామాచి" 125 కోట్ల భారీ బడ్జెట్ తో హిందీ-తమిళ్-తెలుగు-కన్నడ-మలయాళ భాషల్లో నిర్మిస్తున్న బహుభాషా చిత్రం "మానాడు" ట్రైలర్ నేచురల్ స్టార్ నాని అక్టోబర్ 2, గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో శింబు ముస్లింగా నటిస్తుండడం గమనార్హం.

    సుప్రసిద్ధ దర్శకులు భారతీరాజా, ఎస్.ఏ.చంద్రశేఖర్, ఎస్.జె.సూర్య ఈ చిత్రంలో నటిస్తుండడం విశేషం. తమ చిత్రం 'మానాడు' తెలుగు ట్రైలర్.. నేచురల్ స్టార్ నాని విడుదల చేయనుండడం పట్ల దర్శకనిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు!!

 కొత్త ఓటర్ల నమోదుకు చర్యలు తీసుకోండి - 

కలెక్టర్ ప్రవీణ్ కుమార్  ఆదేశం             

ప్రకాశంం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్
    

(జానో జాగో వెబ్ న్యూస్_మార్కాపురం ప్రతినిధి)

సచివాలయ సిబ్బంది సహకారంతో ఇంటింటికి తిరిగి సర్వే చేసి 18, 21 సంవత్సరాల లోపు వయసులో ఉన్న యువతీ యువత ఓటర్ల జాబితాలో చేర్చడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులను  ఆదేశించారు. బుధవారం జిల్లా సచివాలయం  ప్రకాశం భవన్ లోని జిల్లా కలెక్టర్ చాంబర్లో పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ పై వీఆర్వోలు అన్ని రాజకీయ పార్టీల నాయకులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ గురించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఓటర్ల జాబితాలో నమోదు చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయ పార్టీలతో నిరంతరం పర్యవేక్షణ చేయడం వల్ల ఏ విధమైన సమస్యలు రాకుండా ఉంటాయని కలెక్టర్ తెలిపారు.


అక్టోబర్బర్ 31వ  నాటికి ఫ్రీ రివిజన్ ముగుస్తుందని సంబంధిత విషయాలు కూడా ఏవైనా మార్పులు ఉంటే సరి చూసుకోవాలని కలెక్టర్ తెలిపార. నవంబర్1 డ్రాఫ్టు ఓటర్ల జాబితా ముద్రణ చేస్తారని నవంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరణ జనవరి 5వ తేదీ నాటికి ఓటర్ల తుది జాబితా ముద్రణ జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. 1500 మంది ఓటర్లు మించితే కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.

ప్రస్తుతంుతం 17 పోలీస్ స్టేషన్ మాత్రమే వేరే చోటికి మార్చవలసిన అవసరం ఉందని కలెక్టర్ తెలిపారు . ఈ సమావేశంలో జేఏసీలు జి వి మురళి, కృష్ణ వేణి కందుకూరు సబ్ కలెక్టర్ అపరాజితా సింగ్, డి ఆర్ వో డాక్టర్ తిప్పే నాయక్ భూ సేకరణ ప్రత్యేక కలెక్టర్ సరళ వందనం ఒంగోలు మార్కాపురం ఆర్డీవోలు ప్రభాకర్ రెడ్డి, లక్ష్మీ శివ జ్యోతి ఈ ఆర్ వో లు, ఏ ఈ ఆర్ వో లు రాజకీయ పార్టీల నాయకులు సమావేశం లో పాల్గొన్నారు.

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 2008 డిఎస్సి లో నష్టపోయిన వారికి

 జీతాలు మంజూరుచేయాలి…..

ఎస్ టి యు డిమాండ్్

(జానో జాగో వెబ్ న్యూస్_మార్కాపురం ప్రతినిధి)

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 2008 డిఎస్సిలో నష్టపోయిన వారికి మినిమమ్ టైం స్కేల్ ఇస్తూ వారికి వివిధ పాఠశాలలకు రెండు నెలల క్రితం పోస్టింగ్ ఇచ్చివున్నారు. వారికి ఇంతవరకు జీతభత్యాలు ఎలా చెల్లించాలో విధి విధానాలు తెలియ చేయకపోవడంపట్ల ఎస్ టి యు ఆవేదన వ్యక్తం చేస్తూ, వివిధ సమస్యల పట్ల ప్రకాశం జిల్లా శాఖ, జిల్లావిద్యాధికారి బి. విజయభాస్కర్ గారిని మర్యాద పూర్వకంగా కలసి సమస్యలను నివేదించడం జరిగింది.

ప్రకాశంం జిల్లాా డి ఈ ఓ  బి .విజయ భాస్కర్

గ్రేడ్ II ప్రధానోపాధ్యాయుల సీనియారిటీ రోస్టర్ పాయింట్ తో తయారుచేయాలని, వివిధ క్యాడర్లలో ఖాలీగ వున్న పోస్ట్ లను పదోన్నతుల ద్వారా భర్తిచేయాలని, ప్రధానోపాధ్యాయులకు వివిధ యాప్ ల బారినుండి తప్పించాలని, పిఎఫ్,ఎపిజిఎల్ఐ క్లోజర్స్, లోన్స్ వెంటనే మంజూరు చేయాలని, మెడికల్ బిల్స్ సత్వరమే పరిష్కరించాలని, సిపిఎస్ రద్దు చేయాలని, పెండింగ్ లోవున్న డిఎ లను మంజూరు చేసి పి ఆర్ సి ని ప్రకటించాలని , తరగతి గదులకు భవన వసతులు లేని పాఠశాలలకు భవన వసతులు కల్పించాలని, మున్సిపల్ ఉపాధ్యాయులకు పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఖాలీలుగా వున్న ఉపాధ్యాయ పోస్టులను డిఎస్సి ద్వారా భర్తీ చేయాలని, బదిలీలు చేపట్టాలని, నాడు-నేడు కార్యక్రమాల ద్వారా కోట్ల రూపాయాలతో ముస్తాబైన పాఠశాలలకు వాచ్ మెన్ పోస్ట్ మంజూరు చేసి వాటిని పరిరక్షించాలని,  సర్వీసు రెగ్యులరైజేషన్ మేళాను నిర్వహించాలని, విపి గ్రేడ్, గ్రేడ్ II ప్రధానోపాధ్యాయ పోస్టులను మంజూరు చేయాలని, జిల్లాలో ఖాలీగా ఉన్న ఎమ్.ఇ.ఓ. పోస్టులను భర్తీ చేయాలని, ప్రతి ఎమ్ ఆర్ సి కి  ఉపాధ్యాయుల సర్వీసు విషయాలను పర్యవేక్షించుటకు గుమస్తాను కేటాయించాలని, తదితర సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఎస్ టీ యు ప్రకాశం జిల్లా నాయకులు చల్లా శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి మండ్ల రామాంజనేయులు, రాష్ట్ర కౌన్సిలర్ కె.ఎర్రయ్య, జిల్లా ఉపాధ్యక్షులు కె. ప్రవీణ్ కుమార్ కోరడమైనది.

  ముఖ్యంగా మన పాఠశాలలలో పనిచేయుచున్న ఆయాలకు నెలకు ఆరువేలు చొప్పున మన జిల్లాకు ఐదు కోట్ల రూపాయాలు మంజూరు చేయడం పట్ల ఎస్ టీ యు హర్షం వ్యక్త పరచడమైనది. ఈ డబ్బులను వారివారి వ్యక్తిగత బ్యాంకు ఖాతలలో జమా చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరడమైనది. 

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 *అగ్రరాజ్యం అమెరికా* కి *,,,

లోపలి నుండే ఓ పెద్ద ఎదురు దెబ్బ!* 

 


    వరస ఎదురు దెబ్బలు తింటున్న అమెరికాకు మరో ఎదురు దెబ్బ! ఐతే ఈసారి బయటి నుండి కాదు. అమెరికా పాలక వ్యవస్థ నుండే! ఇటీవల అమెరికా ఇమ్మిగ్రేoట్ పాలసీ నవ్వులపాలైన విషయం తెల్సిందే. దానికి నిరసనగా నిన్న హైతీలోని అమెరికా ప్రత్యేక రాయబారి డేనియల్ పూటే ఏకంగా రాజీనామా చేసాడు. ఇప్పటికే ఇరాక్,  ఆఫ్ఘనిస్తాన్ తదితర చోట్ల అమెరికాకి వరస ఎదురు దెబ్బలు తెలిసిందే. అవి చాలక తగుదునమ్మా అంటూ ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో "ఆకస్" పేరిట ఓ కొత్త సైనిక కూటమిని ఈమధ్యే ఏర్పరిచింది.  యుద్ధ వాతావరణం సృష్టించే ఉన్మాదానికి దిగుతోన్న వేళ, స్వంత దేశంలో తన స్వంత ప్రభుత్వానికి చెందిన ఓ దేశపు ప్రత్యేక రాయబారి రాజీనామా చేయడం ముమ్మాటికీ ఓ రాజకీయ ఎదురు దెబ్బే!

   సెంట్రల్ అమెరికా దేశం హైతీ పేరు వింటే ఒకప్పటి  రాజకీయ పరిణామాలు గుర్తుకు వస్తాయి. అక్కడి అమెరికా సైనిక జోక్యం గుర్తు వస్తుంది. ఏమైనా వర్తమాన ప్రపంచ రాజకీయ చరిత్ర పుటల్లో అమెరికా దుష్టత్వానికి చేదుగుర్తుగా హైతీ కి ఓ పుట నమోదైనది. 

 


     నేడు హైతీ రెండు సంక్షోభాల్ని భరిస్తూ ఉంది. ఒకటి భూకంపం కాగా, రెండోది రాజకీయ సంక్షోభం. అది అసలే పేద దేశం. పైగా పై రెండు కారణాల వల్ల నేడు హైతీ ప్రజలు పేదరికం, ఆకలి, హింస, నిరుద్యోగాలతో తల్లడిల్లుతున్నారు. పొట్ట చేత పట్టుకొని ఏదో ఓ విదేశానికి వెళ్తున్నారు. పనులు దొరుకుతాయనే గంపెడు ఆశతో అమెరికా బాట పట్టారు. వారిని అమానుషంగా మెడపట్టి దేశం నుండి బయటకు గెంటివేసే దుర్మార్గానికి అమెరికా పూనుకుంది. గత ఆదివారం నుండి గెంటివేసే ప్రక్రియను అది చేపట్టింది. ఆఘమేఘాల మీద 12 విమానాల్లో 1400 మంది నిరుపేద హైతీయన్లను హైతీ కి బైడెన్ ప్రభుత్వం తిరిగి పంపించింది. కాబూల్ నుండి విమానాలతో అత్యవసరంగా మరియు సురక్షితంగా బయటకు తరలించే బాధ్యత తన నెత్తి మీద వున్నా, తుది గడువు ముంచుకొచ్చే వరకూ దున్నపోతులా అమెరికా ప్రభుత్వం జాప్యం చేసింది. అదే బైడెన్ సర్కార్ మరోవైపు అస్టదరిద్ర్యులైన హైతీ కన్నీటి వలస కార్మికుల్ని బలవంతపు తరలింపుకై ఎమర్జెన్సీ ఫ్లయిట్స్ ను నడిపించింది. ఈ ద్వంద్వ  వైఖరిని బట్టబయలు చేసే  ఒక ఉదాహరణగా పూటే రాజీనామా నిలుస్తుంది.

      అమెరికా ఇమ్మిగ్రేన్ట్ విధానం వికటిస్తోంది. దానికి నిరసనగా హైతీ లోని అమెరికా ప్రత్యేక రాయబారి గురువారం రాజీనామా చేయడం విశేషం. ఈ సందర్భంగా అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ కి పంపిన రాజీనామా లేఖలో పూటే ఇలా వ్యాఖ్యానం చేశారు. 

    *"వేలాదిమంది హైతీ శరణార్ధుల్ని, వలస జీవుల్ని హైతీకి వెనక్కి పంపించే అమానుషమైన మరియు వ్యతిరేక ఫలితాల్ని కూడా ఇచ్చే మా అమెరికా ప్రభుత్వ నిర్ణయంతో ఏకీభవించ లేకపోతున్నా"* 

     పై రాజీనామా లేఖలో ఆయన చేసిన మరికొన్ని వ్యాఖ్యలను కూడా గుర్తు చేయాలి. అమెరికా చేత బలవంతంగా వెనక్కి పంపబడే వేలాది మందిని ఇముడ్చుకోగలిగే స్థితి ప్రస్తుత హైతీ ఆర్ధిక వ్యవస్థకి లేని విషయాన్ని కూడా ఆయన లేఖలో స్పష్టం చేసాడు. అది అత్యంత పేదరికంలో వున్నదని చెప్పారు. 

      అమెరికా ప్రభుత్వ ప్రాథమ్యాలు క్రమంగా మారుతున్నాయి. అది ఆఫ్ఘనిస్తాన్ ని పూర్తిగా వదిలేసింది. యూరోప్ ని వెనక సీటులోకి నెట్టింది. మధ్యప్రాచ్యం పై ప్రధాన గురిని విడనాడుతోంది. పొద్దెరగని కొత్త బిచ్చగాడి వలె ఇప్పుడు చైనా పైకి ప్రధాన గురిపెట్టింది. ఎప్పటి నుంచో తన  దురాక్రమణ పర్వానికి ఆలంబనగా అట్లాంటిక్ మహా సముద్రంతో పాటు ప్రాంతీయ సముద్రాలైన మధ్యధరా, కాస్పియన్, బాల్కన్, బాల్టిక్, ఎర్ర, నల్ల సముద్రాలు ఉండేవి. వాటిని ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తోంది. లేదంటే రెండవ వరసలోకి తోసేస్తోంది. నేడు పసిఫిక్, హిందూ మహాసముద్రాలతో పాటు, దక్షిణ చైనా, కొరియా, తైవాన్ వంటి ప్రాంతీయ సముద్రాల మీదికి గురిపెడుతోంది.

   ఈమధ్యే "ఆకస్" పేరిట మూల ఆంగ్ల రాజ్యాలతో అది కొత్తసైనిక కూటమిని  ఏర్పరచిడం తెలిసిందే. (బ్రిటన్ వలసలతో ఏర్పడ్డ దేశాలే అమెరికా, ఆస్ట్రేలియాలు! ఆ మూడు దేశాలూ  మూలంలో Anglo sphere లోనివే) అంటే ఆసియాపైకి ఆంగ్లో సైనిక కూటమి నేడు యుద్ధ సన్నాహక దశకు శ్రీకారం చుట్టింది. ఈ దశలో అమెరికా పెరటిదొడ్డి హైతీ విషయం మీద స్వయంగా స్వంత రాయబారి నుండి ఎదురుదెబ్బ తగలడం గమనార్హం!

     ప్రపంచ వ్యాప్తంగా అమెరికా సామ్రాజ్యవాద దుష్ట విధానాల్ని లోకానికి వెల్లడించిన జాన్ పెర్కిన్స్  కోవలోకి డేనియల్ పూటే రాకపోవచ్చు. కానీ నేడు అమెరికా రాజకీయ ప్రతిష్ట, ప్రాభవాలు ఇంటా బయటా క్రమక్రమంగా దెబ్బ తింటున్నాయి. ఈ దశలో పూటే వ్యక్తంచేసిన తాజా రాజకీయ నిరసన అమెరికా స్థానాన్ని మరింత మసక బారించి తీరుతుంది. 

    డేనియల్ పూటే తాజా రాజీనామా పరిణామాన్ని విస్తృతంగా ప్రచారం చేద్దాం. పతన దిశలో అమెరికా సామ్రాజ్యవాద రాజకీయ ప్రయాణాన్ని నిశితంగా పరిశీలిద్దాం. నేడు ఇండో పసిఫిక్ వైపు దాని కొత్త సైనికయానాన్ని వ్యతిరేకించాల్సిన భావి కర్తవ్యానికి పదునుపెట్టే సాధనంగా ఈ ఘటనను మలుచుకుందాం. 


   ✍ రచయిత_*ఇఫ్టూ ప్రసాద్* (పిపి)

 క్యాన్సర్‌ నిర్మూలనకు,,,

 సీఎం జగన్ కృషి అనిర్వచనీయం 

*నోరి దత్తాత్రేయుడుని సలహాదారుగా నియమించడం గొప్ప నిర్ణయం  

వైసిపి రాష్ట్ర నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్_ విజయవాడ బ్యూరో)

ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాల్లో క్యాన్సర్‌ చికిత్స కోసం ప్రత్యేకంగా ఆస్పత్రులను ఏర్పాటు చేయడంతో పాటు అందులో ఒకటి అత్యాధునికంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పించడం చరిత్రలో నిలిచిపోయే నిర్ణయమని ప్రముఖ ఫార్మా కంపెనీ అధినేత డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్‌ వైద్య నిపుణుడు, పద్మశ్రీ డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడుని క్యాన్సర్‌ చికిత్సకు సంబంధించి తగిన సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వానికి సలహాదారుగా నియమించడం మంచి విషయమని చెప్పారాయన. ఏపీ ప్రభుత్వం చేపట్టే అన్ని రకాల వైద్య కార్యక్రమాలకు ముఖ్యంగా క్యాన్సర్ సంబంధిత కార్యక్రమాలకు నోరి దత్తాత్రేయుడు లాంటి గొప్ప వ్యక్తి సేవలు అవసరమని..  దశాబ్దాలుగా రోగుల్ని పట్టిపీడిస్తున్న క్యాన్సర్ మహమ్మారిని నిర్మూలించడంలో సీఎం జగన్ చూపిన చొరవ అనిర్వచనీయమన్నారు. క్యాన్సర్‌ రోగులందరికీ చికిత్సలు అందుబాటులోకి తీసుకు రావాలన్నది ముఖ్యమంత్రి లక్ష్యం అన్నారు.

. సీఎం జగన్ ఆలోచనలకు దత్తాత్రేయుడు లాంటి మేధావులు తోడవ్వడంతో మంచి ఫలితాలు చూడబోతామన్నారు ఏలూరి. ఇక తమ కంపెనీ SRC Laboratories ఆధ్వర్యంలో క్యాన్సర్ డ్రగ్స్ పై పరిశోధనలు జరుపుతున్నామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రఖ్యాత శాస్త్రవేత్తలు క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నారని.. త్వరలోనే క్యాన్సర్ మహమ్మారికి శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఏలూరి రామచంద్రారెడ్డి చెప్పారు.

 ఘనంగా దర్శకుడు పూరి జగన్నాథ్,,

 జన్మదిన వేడుకలు..

 

కేక్ కట్ చేస్తున్న పూరి జగన్నాథ్ అభిమానులు

(జానో జాగో వెబ్ న్యూస్_ గడివేముల ప్రతినిధి)

కర్నూలు జిల్లా లా గడివేముల మండలంలో పూరిజగన్నాథ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. చలన చిత్ర పరిశ్రమలో "ఇడియట్" సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్ తీసిన సినిమా  చిత్ర రంగంలోనే నూతన అధ్యాయాన్ని సృష్టించిందని పూరి జగన్నాథ్ అభిమానులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అభిమానులు కేక్ కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పూరి జగన్నాథ్ అభిమానులు హర్షద్ భాష, పుల్లయ్య, ఇబ్రహీం, పూరి జగన్నాథ్ అభిమానులు పాల్గొన్నారు.

 ఈవీఎంలలోని అవకతవకలు సరి చేయకుండా,,,

ఎన్నికల షెడ్యూల్ ఇవ్వడమా

ఎన్నికల కమిషన్ కు కాంగ్రెస్ నేత జి నిరంజన్ లేఖ

(జానో జాగో వెబ్ న్యూస్_ హైదరాబాద్ బ్యూరో)

గత సెప్టెంబరు 8 నుండి చేపట్టిన ఈవిఎం మరియు వివిప్యాట్ ల ఫస్ట్ లెవెల్ ఛెక్ అఫ్ లో జరిగిన అవకతవకలను సరిది ద్దకుండా ఎన్నికల షెడ్యూలు విడుదల అభ్యంతరకరమని చీఫ్ ఎలక్షన్ కమిషనర్, రాష్ట్ర ఎన్నికల అధికారికి టి.పి.సి.సి సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ లేఖ రాశారు. ఆ లేఖలోని సారాంశం ఇలా ఉంది...ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను పాటించకుండా హుజూరాబాద్ ఎన్నికలకు వినియోగించే మిషన్ ల ఎఫ్ ఎల్ సి లో జరిగిన అవకతవకలను సెప్టెంబరు 8, 11 వ తేదీలలో సవివరముగా వివరిస్తూ ఎన్నికల కమిషన్ కు , సి.ఇ ఓ కు టి.పి.సి.సి తరపున నివేదించినా దిద్దుబాటు చర్యలు తీసుకోకుండా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడము దేనికి సంకేతమో తెలుపాలి.

వెంటనే ఫ్రెష్ ఎఫ్ ఎల్ సి ఎన్నికల కమిషన్ అధికారుల సమక్షంలో నిబందనలకు అనుగుణంగా జరిపి ఎన్నికలు నిర్వయించాలి.

ఎన్నికలలో ఓటర్లను ప్రభావితం చేయడానికి వేల కోట్ల రూపాయల స్కీంలు అమలు చేయడములో టి ఆర్ ఎస్ ప్రభుత్వ కీలుబొమ్మలా వ్యవహరించిన జిల్లా కలెక్టర్ ను వెంటనే బదిలీ చేయాలి. 

జిల్లా ఎన్నికల అధికారిగా వత్తిళ్లు లేకుండా నిష్పక్షపాతంగా ప్రస్తుత జిల్లా కలెక్టర్ తన భాధ్యతలను 

నిర్వయించలేరు... అని ఆయన పేర్కొన్నారు.

 ఉప్పుతో కరోనాకు చెక్

గొంతునొప్పి తగ్గటానికి ఉప్పునీటిని పుక్కిట పట్టటం తెలిసిందే. కొవిడ్‌-19 మొదలయ్యాక ఇదింకాస్త ఎక్కువైంది కూడా. కాకతాళీయమో ఏమో గానీ ఉప్పునీరు కొవిడ్‌ కారక సార్స్‌-కొవీ-2 వృద్ధిని అడ్డుకుంటున్నట్టూ బ్రెజిల్‌ అధ్యయనం పేర్కొంటోంది. ఇన్‌ఫెక్షన్‌ సోకిన ఊపిరితిత్తుల కణాల్లో ఉప్పు నీటి ప్రభావాన్ని పరీక్షించగా.. వైరస్‌ వృద్ధిని 88% వరకు తగ్గటం విశేషం. వైరస్‌ వృద్ధి తగ్గితే జబ్బు తీవ్రతా తగ్గుతుంది. అందుకే ఉప్పు నీటి చికిత్సపై ప్రయోగ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఇవి విజయవంతమైతే కొవిడ్‌ నివారణకు, చికిత్సల రూపకల్పనకు బాటలు పడ్డట్టే.

 వంశపారంపర్యంగా...

అర్చకుల నియామకానికి ఆమోదం

25 శాతం వేతనం పెంపు

దేవాదాయ శాఖపై సీఎం జగన్ సమీక్ష

అర్చకుల సమస్యలపై చర్చ

వివరాలు వెల్లడించిన మంత్రి వెల్లంపల్లి


(జానో జాగో వెబ్ న్యూస్_ విజయవాడ బ్యూరో)

ఏపీలో దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల అర్చకులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అర్చకులకు 25 శాతం జీతం పెంచుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. దేవాదాయశాఖపై సీఎం సమగ్ర రీతిలో సమీక్ష నిర్వహించారు.

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

 అర్చకుల సమస్యలపై దృష్టి సారించారు. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఓ ప్రకటనలో వెల్లడించారు. వంశపారంపర్యంగా అర్చకుల నియామకం చేపడుతున్నట్టు తెలిపారు.

ఏపీ సర్కారు గత వేసవిలోనూ అర్చకుల జీతాన్ని పెంచిన సంగతి తెలిసిందే. కేటగిరి-1 దేవస్థానాల్లో పనిచేసే అర్చకుల వేతనాన్ని రూ.10 వేల నుంచి రూ.15,625కి పెంచారు. కేటగిరీ-2 దేవస్థానాల్లో పనిచేసే అర్చకుల వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు. ఇప్పుడు మరోసారి వారి వేతనాన్ని పెంచుతూ రాష్ట్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 భగత్‌సింగ్‌ త్యాగం వృథా కానీయం  

అందె నాసరయ్య

(జానో జాగో వెబ్ న్యూస్_  మార్కాపురం ప్రతినిధి)

భగత్ సింగ్ 114 వ జయంతి సందర్భంగా స్థానిక పూల సుబ్బయ్య భవనంలో సిపిఎం పార్టీ మరియు సిపిఐ పార్టీ,  అందె నాసరయ్య ఆధ్వర్యంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా అందె నాసరయ్య మాట్లాడుతూ విప్లవానికి మారు పేరు భగత్‌సింగ్ అని, ‌ పోరాటాలకు నిలువెత్తు నిదర్శనమని స్వాతంత్య్ర పోరాటంలో యువ రక్తంతో దేశం కోసం తృణప్రాయంగా ప్రాణాలర్పించిన త్యాగశీలి,  నేటి యువతకు ఆదర్శప్రాయుడని ఇటువంటి విప్లవనేత జయంతిని పురస్కరించుకుని పాలకుల వినాశకర విధానాలపై గళం విప్పేందుకు యువత నడుంబిగించాలని పిలుపునిచ్చారు.

1907 సెప్టెంబర్‌ 27న పంజాబ్‌ రాష్ట్రం రాయల్‌పూర్‌ జిల్లా బంగా ప్రాంతంలో భగత్‌సింగ్‌ జన్మించారు సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన భగత్ సింగ్ ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ అనే నినాదంతో స్వాతంత్య్ర పోరాటానికే వన్నెతెచ్చారని తన 13వ ఏటనే గాంధీ సహాయ నిరాకరణోద్యమానికి ప్రభావితుడయ్యారు

1929లో బ్రిటీష్‌ అసెంబ్లీలో పొగబాంబు విసిరిన సంఘటనలో భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖదేశ్‌లు బ్రిటీష్‌ పాలకులనే గడగడలాడించారు. ఈ పోరాటంలో విప్లవం వర్థిల్లాలి, శ్రామికవర్గం వర్థిల్లాలి, సామ్రాజ్యవాదం నశించాలి, సోషలిజం వర్థిల్లాలనే ఉత్తేజింపజేసే నినాదాలను కూడా రూపొందించారు.

23 ఏళ్ల వయస్సుకే 1931 మార్చి 23న ఉరికంబమెక్కి దేశానికే ఆదర్శప్రాయుడయ్యాడు. ఆయన మరణం వృథా కాలేదు. అనంతరం ఎందరో యువకిశోరాలు స్వాతంత్య్ర పోరాటంలోకి వచ్చి ఉద్యమించారు

భగత్‌సింగ్‌ వంటి మహోన్నత ఆదర్శప్రాయుడి స్ఫూర్తితో ప్రస్తుత మతోన్మాద పాలకుల చర్యలను, ప్రపంచబ్యాంకు విధానాలు నెత్తినెక్కించుకున్న నేతల తలరాతలను మార్చాల్సింది కూడా భగత్‌సింగ్‌ వారసులుగా నేటి యువతరమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

వర్షాలతో అప్రమత్తంగా ఉండండి
*అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దు
వైసిపి రాష్ట్ర నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్_  హైదరాబాద్ బ్యూరో)
అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి సూచించారు. రాబోయే రోజులలో అతి భారీ వర్షాలు కురుస్తాయని సమాచారం అందుతున్న నేపథ్యంలో అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని.. అలాగే కొండప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లడం చేయాలన్నారు. మరోవైపు రైతులు, రైతు కూలీలు రెండు మూడు రోజులు వ్యవసాయ పనులకు దూరంగా ఉండటం మంచిదన్నారు.
ఏలూరి. భారీ వర్షాల తోపాటు పిడుగులు కూడా పడే ప్రమాదం ఉంది కాబట్టి పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని. ఇలాంటి సమయాల్లో సురక్షితమైన భవనాల్లో ఆశ్రయంపొందాలని కోరారు. కాగా గులాబ్‌ తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో కుండపోత వర్షం కురిసిందన్న ఏలూరి.. ప్రభుత్వం అప్రమత్తం కావడంతో నష్టం జరగలేదని తెలిపారు. ఈ సందర్బంగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో సహాయసహకారాలు అందించిన అధికారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

   రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా,,,

టిడిపి ఆధ్వర్యంలో నిరసన ...బంద్


 (జానో జాగో వెబ్ న్యూస్_తర్లుపాడు ప్రతినిధి) 

 ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ తర్లుపాడు టిడిపి మండల అధ్యక్షుడు చిన్నపరెడ్డి, తెలుగు యువత అధ్యక్షుడు మేకల నారాయణ టిడిపి నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. అలాగే మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు బంద్ కు మద్దతు తెలుపుతూ షాపులు బంద్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి పుచ్చ నూతల 


గోపీనాథ్యూత్ూత్ నాయకులు ఖాదర్ బాషా, ఈర్ల శీను 10 వార్డు మెంబర్ గోసు నరసింహ,గోస్ వంశీకృష్ణ నరసింహ రాజు, సాయి కృష్ణ, నరేంద్ర, పొదిలి కృష్ణదాసు, టిడిపి నాయకులు మరియు టిడిపి కార్యకర్తలు  పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  తాడి వారి పల్లి ఇన్చార్జి ఎస్ఐ హుదూద్ తమ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.


 


 గడివేముల లో బంద్ ప్రశాంతం...

స్వచ్ఛందంగా బంద్ పాటించిన వ్యాపారులు

గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన గడివేముల ఎస్ఐ


(జానో జాగో వెబ్ న్యూస్_ గడివేముల ప్రతినిధి)

సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 500 రైతుసంఘాలు భారత్ బంద్ పిలుపు నిచ్చిన సందర్భంగా గడివేముల మండలంలో  సిపిఎం, సి ఐ టి యు, ఆధ్వర్యంలో బందు నిర్వహించారు. ఈ సందర్భంగా గడివేముల మండలం సిపిఎం నాయకుడు  ఎల్ల సుబ్బయ్య మాట్లాడుతూ రైతులు గత 9 నెలల నుండి ఢిల్లీ సరిహద్దుల్లో రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని దీక్షలు నిరసనలు చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉందని తెలిపారు. అదానీ అంబానీ, కార్పొరేట్ సంస్థల ఆదాయం పెంచడానికి వారి పన్నులు తగ్గించి, వారికి రుణమాఫీ కూడా చేయడం జరిగిందని, అదే పేద ప్రజల పై డీజలు, పెట్రోలు, వంటగ్యాస్, నిత్యవసర సరుకుల పై అధిక ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచింది అని తెలిపారు. ఇప్పటికైనా నా ప్రభుత్వం కళ్లు తెరచి రైతు వ్యతిరేక కార్మిక చట్టాలను రద్దు చేయాలని అని, ధరలను సామాన్యుడికి

బంద్ సందర్భంగా రహదారులపైైైై నిలిచిపోయిన వాహనాలు

 అందుబాటులోకి తీసుకురావాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిరసనలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సి ఐ టి యు నాయకులు గోకారి సా, ఆటో యూనియన్ నాయకులు ఖలీల్, ధనుంజయుడు, మాచర్ల, సామేలు, హమాలీ కార్మికులు చిన్నన్న, సిపిఎం , సి ఐ టి యు కార్మికులు, పాల్గొన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని షాపు యజమానులు స్వచ్ఛందంగా మూసివేసి రైతులకు మద్దతుగా నిలిచారు.


 బందులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ ఐ ఎం. శ్రీధర్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారుు

స్వచ్ఛందంగా దుకాణాలుుు బంద్ చేసి అందుకు మద్దతు తెలిపిన వ్యాపారులు
 వెనక బడిన కులాల కోసం

తెలంగాణ సంచార ముస్లిం తెగల సంక్షేమ సంఘం ఏర్పాటు

(జానోజాగో వెబ్ న్యూస్-కరీంనగర్ ప్రతినిధి)

వెనక బడిన కులాల కోసం తెలంగాణ సంచార ముస్లిం తెగల సంక్షేమ సంఘం ఏర్పాటు  అయింది. కరీంనగర్ లో జరిగిన  ఈ సంఘం సమావేశంలో తెలంగాణ సంచార ముస్లిం తెగల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా సైదా ఖాన్, రాష్ట్ర సెక్రటరీ ఎండీ నసీర్, కరీంనగర్ జిల్లా కమిటీ అధ్యక్షుడు దావూద్ ఉపాధ్యక్షుడు ఎండీ అక్బర్ లు ఏక గ్రివంగా ఎన్నికయ్యారు. సంఘం గౌరవ అధ్యక్షుడు &ముఖ్య సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ ఎన్నికయ్యారు. తెలంగాణ సంచార ముస్లిం రాష్ట్ర ఉపాధ్యక్షుడు& సెక్రటరీ ని ఆ సంఘం ప్రతినిధులుు ఈ సందర్భంగా సన్మనించారు. 


 


 దమ్మాయిగూడ లో బంద్ సక్సెస్

రాస్తారోకోతో నిలిచిపోయిన వాహనాలు


(జానోజాగో వెబ్ న్యూస్-దమ్మాయిగూడ  ప్రతినిధి)

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టిన భారత్ బందులో భాగంగా సోమవారం దమ్మాయిగూడ బంద్ విజయవంతమైంది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రధాన రహదారిపై తిరుగుతూ తెరిచి ఉన్న వ్యాపార వాణిజ్య సంస్థలను మూసి వేయించారు. బందు సందర్భంగా స్వచ్ఛందంగా విద్యాసంస్థలు బ్యాంకులు బంద్ పాటించాయి.

 
 శాంతియుతంగా చేస్తున్న భారత్ బందును,,,

అడ్డుకోవడం పిరికిపంద చర్య అఖిల పక్షాలు

(జానోజాగో వెబ్ న్యూస్-హుజూర్ నగర్  ప్రతినిధి)

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో రైతు సంఘాల నాయకులతో కలసి శాంతియుతంగా భారత్ బందు కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే అడ్డుకుని అక్రమ అరెస్టులు చేయడం పిరికిపంద చర్య అని అఖిల పక్షాలు విమర్శించాయి. సోమవారం, హుజూర్నగర్ అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో  భారత్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

 


సోమవారం నిర్వహిస్తున్న భారత్ బంద్ కు అఖిలపక్ష కార్యకర్తలు, నాయకులు, బంద్ నిర్వహించారు. శాంతియుత వాతావరణంలో రైతు సంఘాల నాయకులు వైయస్సార్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం, టీజేయస్, సిపిఐ ఎంఎల్, న్యూడెమోక్రసీ పార్టీల నాయకులతో జరుపుతున్న భారత్ బందును జరపకుండా పోలీసులు అడ్డుకుని నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం దేశాన్ని దేశ సంపదను విదేశీ స్వదేశీ కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెడుతుందని
ప్రభుత్వత్వ రంగ సంస్థలను పూర్తిగా ప్రైవేటు పరం చేస్తున్న మోడీ ప్రభుత్వాలపై పెట్రోల్ డీజిల్ మరియు గ్యాస్ ధరలు తగ్గించాలని నిరుద్యోగులు అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని వ్యవసాయం చట్టాలను రద్దు చేయాలని ప్రభుత్వ సంస్థలు అమ్మకాల నిలిపివేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో రైతు సంఘాల నాయకులతో కలసి శాంతియుతంగా భారత్ బందు కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే అడ్డుకోవడం సరికాదని ఇలా ప్రశ్నించే ప్రతి ఒక్కరిని అక్రమ అరెస్టులు చేయడం పిరికిపంద చర్య అన్నారు.

 


 రైతు వ్యతిరేక నల్ల చట్టాలను,,,

తక్షణమే రద్దు చేయాలి

మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి


(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తక్షణమే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్నిమాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. భారత్ బంద్ లో భాగంగా మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో సోమవారంనాడు జరిగిన భారత్ బంద్ లో పాల్గొన్నారు.

 

ఇందులో భాగంగా తెలుగుదేశం, సిపిఐ,  సిపిఎం పార్టీల అఖిలపక్షం ఆధ్వర్యంలో పట్టణంలోని కోర్టు సెంటర్ నుండి బైక్ లతో ర్యాలీ గా బయలుదేరి పట్టణంలోని అన్ని బజార్లలో బైక్ ర్యాలీ నిర్వహించి తెరచి ఉంచిన బ్యాంకులను, ప్రైవేటు షాపులను భారత్ బంద్ కు మద్దతు అభ్యర్థించి వాటిని మూసివేయించారు.  ఈ సందర్భంగా మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ 1)  కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా ఆమోదించిన నల్ల చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత సంవత్సర కాలంగా రైతు వ్యతిరేక నల్ల  చట్టాలను రద్దు చేయాలని దీక్ష చేస్తున్న జాతీయ రైతు సంఘాలకు తెలుగుదేశం పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. 2) కేంద్ర ప్రభుత్వం వద్ద కొత్త అప్పు కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పొలాలకు నీరు అందించే బోర్లకు మీటర్లు బిగించి రైతులకు ఉరితాళ్లు బిగించాలని చూస్తున్నారని తామెంతమాత్రం దీన్ని సహించబోమని రైతులకు మీ కుట్రలు కుతంత్రాలు తెలియజేస్తామని ప్రకటించారు.         3) ఈ వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు రైతులకు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ప్రజలకు కల్లబొల్లి కబుర్లు చెప్పి ఇప్పుడు పూర్తిగా చేతులెత్తేశారు అని   త్వరలోనే దీనిపై రైతన్నల తో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.

 ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పెద్దలు అందె నాసరయ్య, రఫీ, సిపిఎం నాయకులు  గాలి వెంకటరామిరెడ్డి, సోమయ్య,  తెలుగుదేశం నాయకులు   మార్కాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ వక్కలగడ్డ మల్లికార్జున, జిల్లా అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం, మార్కాపురం మండల పార్టీ అధ్యక్షులు జవ్వాజి  రామాంజి రెడ్డి, మార్కాపురం ఎంసీ మాజీ చైర్మన్ కాకర్ల శ్రీనివాసులు, తెలుగుదేశం పట్టణ ప్రధాన కార్యదర్శి కొప్పుల శ్రీనివాసులు, కౌన్సిలర్స్ ఎరువ వెంకట నారాయణ రెడ్డి, నాలి కొండయ్య, మాజీ కౌన్సిలర్ మర్రి కొండలు, చిలకపాటి వెంకట చెన్నయ్య, తెలుగుదేశం నాయకులు జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ సభ్యులు డాక్టర్ మౌలాలి, తెలుగుదేశం నాయకులు పటాన్ ఇబ్రహీం, జంకె రమణారెడ్డి, పట్టణ తెలుగుదేశం, సిపిఐ సిపిఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
మార్కాపురం మాజీ ఎం.ఎల్.ఎ. కందుల నారాయణ రెడ్డి


 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 


                బావిరెడ్డి సుధాకర్ రెడ్డికి

ఘనంగా తుది వీడ్కోలు
సంతాపం తెలుపుతున్న పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి 

(జానో జాగో వెబ్ న్యూస్_ గడివేముల ప్రతినిధి)

మోడల్ స్కూల్ పిల్లల తల్లిదండ్రుల అధ్యక్ష పదవిని స్వీకరించిన బావిరెడ్డి సుధాకర్ రెడ్డి గుండెపోటుతో హఠాత్ మరణం చెందాడు అనే వార్తతో గడివేముల వై ఎస్ ఆర్ సి పి శ్రేణుల్లో శోకసంద్రంలో మునిగి పోయారు. సుధాకర్ రెడ్డి భౌతికకాయానికి పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి  పూలమాల వేసి సంతాపం ప్రకటించారు. సుధాకర్ రెడ్డి కుటుంబానికి అన్ని వేళల అండగా ఉండి సహాయ సహకారాలు అందిస్తానని అధైర్య పడవద్దని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.

సుధాకర్ రెడ్డిిిి భౌతికకాయాన్ని చూడటానికి వచ్చిన వైసీపీ అభిమానులు

గడివేములముల మండల జెడ్ పి టి సి ఆర్ బి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఒక మంచి కార్యకర్తను, ఒక మంచి మిత్రుని, చురుకైన నాయకుని కోల్పోయామని ఆ కుటుంబానికి ఎటువంటి కష్టం కలగకుండా చూసుకుంటామని అధైర్య పడవద్దని కుటుంబ సభ్యులకు మేమున్నామని భరోసా ఇచ్చారు. సుధాకర్ రెడ్డి భౌతిక కాయాన్ని చూడడానికి మండలంలోని వైయస్సార్ సిపి నాయకులు బూజు నూరు రఘు మాధవరెడ్డి, బొల్లవరం చంద్రమౌళీశ్వర రెడ్డి, కొర్ర పోలూరు సుబ్బారెడ్డి, గడివేముల నాగేశ్వర్ రెడ్డి, గడివేముల బి. కృష్ణారెడ్డి , వైయస్ఆర్ సీపీ నాయకులు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని తుది వీడ్కోలు పలికారు.

 సుధాకర్ రెడ్డి భౌతికకాయానికి పూలమాల వేస్తున్న పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి

 తర్లుపాడు టిడిపి  మండల పార్టీ అధ్యక్షుడిగా ,,,

రెండవ సారి ఉడుముల చిన్నపరెడ్డి,,

ఏకగ్రీవ ఎన్నిక

(జానో జాగో వెబ్ న్యూస్_ మార్కాపురం ప్రతినిధి)

తర్లుపాడు తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడిగా రెండవ సారి ఉడుముల చిన్నపరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం నాడు తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలలో భాగంగా తర్లుపాడు మండలం తెలుగుదేశం పార్టీ మండల కమిటీను  తెలుగుదేశం                 గ్రామ కమిటీలు, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు మండల కమిటీ ని  ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యకర్తల సమావేశం మార్కాపురం పట్టణం లోని జవహర్ నగర్ లో గల మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి స్వగృహం వద్ద జరిగినది.             

 

మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మాజీ ఎం.ఎల్.ఎ. కందుల నారాయణ రెడ్డి

ఈ సమావేశమునకు ముఖ్యఅతిథిగా మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు విచ్చేసి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం గత రెండు సంవత్సరాల నుంచి ఇసుక మరియు సిమెంట్ ధరలు విపరీతంగా పెంచి లక్షల  భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడవేసి వారి కుటుంబాల ఉసురు తీస్తున్నారని ఆరోపించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ కు నికర జలాలు కేటాయించి మొదట టన్నెల్  ద్వారా నీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.


ఇప్పుడుుడు రాష్ట్రంలో ఏ గ్రామంలో కదలించిన సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం  పని అయిపోయిందని అంటున్నారు అని మనం మన తెలుగుదేశం పార్టీ తరుపున ఉద్యమాలు చేస్తే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మద్దతు తెలపాలని అనుకుంటున్నారని తక్షణమే ఇప్పుడు ఎన్నుకో బోయే తర్లుపాడు తెలుగుదేశం మండల కమిటీ గ్రామ కమిటీల తో తెలుగుదేశం నాయకులతో కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ఈ వై సి పి పార్టీ దుర్మార్గపు దృష్ట పాలనకు భవిష్యత్తులో చరమగీతం పాడాలంటే ప్రతి తెలుగుదేశం కార్యకర్త స్వచ్ఛందంగా బయటకు వచ్చి  ఈ రాష్ట్ర ప్రభుత్వంపై తిరగ బడాలని పిలుపునిచ్చారు.             


 ఈ సమావేశంలో తర్లుపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా రెండవ సారి వరుసగా ఉడుముల చిన్నపరెడ్డి ఏకగ్రీవంగాఎంపిక చేయబడ్డారు. మండల ప్రధాన కార్యదర్శి గా కందుల చిట్టిబాబు, ఉపాధ్యక్షులుగా నంబుల లక్ష్మయ్య  ఎంపిక చేయబడ్డారు. మండల యూత్ కమిటీ అధ్యక్షులు గా మేకల వెంకట్ నారాయణ, మండల రైతు కమిటీ అధ్యక్షులుగా కూచిపూడి సోమయ్య, మండల బీసీ సెల్ అధ్యక్షులు గా గుర్రపుశాల నరసింహారావు, ఎస్సీ సెల్ అధ్యక్షులు గా ముండ్ల పాటి వెలిగొండయ్య  ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

 ఈ సమావేశంలో మార్కాపూర్ మున్సిపాలిటీ మాజీ  చైర్మన్ వక్కలగడ్డ మల్లికార్జున, పార్లమెంటరీ పార్టీ తెలుగుదేశం ఉపాధ్యక్షులు కంచర్ల కాశయ్య, మాజీ ఎంపీపీ పులివెముల యేసుదాసు, మండల సమన్వయ కమిటీ సభ్యులు వేసేపోగు జాన్, మంద వెంకటరెడ్డి, నరసింహ రావు, కాలoగి  శ్రీనివాసులు, సాదం వీరయ్య , పుచ్చనూతల గోపీనాథ్ చౌదరి, తెలుగుదేశం నాయకులు ఈర్ల వెంకటయ్య, గోసు వెంకటేశ్వర్లు, చలమయ్య , మేకల అచ్చిరెడ్డి, నంబుల కాశయ్య , మాబు వలి, చెన్నారెడ్డి పల్లి మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి,, ఈదర శ్రీనివాస రెడ్డి గారు, చలమారెడ్డి, నంబుల తిరుపతయ్య , తెలుగుదేశం నాయకులు గ్రామ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు, తెలుగుదేశం కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి