జానో జాగో వెబ్ న్యూస్ వార్తకు స్పందన..

బాధిత కుటుంబాన్ని ఆదుకున్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి..

రోడ్డున పడ్డ కుటుంబం...జానో జాగో వెబ్ న్యూస్ కథనంపై.. స్పందించిన హృదయాలు

(జానో జాగో వెబ్ న్యూస్- గడివేముల ప్రతినిధి)

వాస్తవాలను ప్రజల ముంగిట తీసుకెళ్లే జానో జాగో వెబ్ న్యూస్ కథనాలు స్పందించే హృదయాలను కదిలిస్తున్నాయి. ఇటీవల గడివేముల లోని బీసీ కాలనీలోని ఓ ఇల్లు షార్ట్సర్క్యూట్తో తగలడంతో ఓ కుటుంబం సర్వం కోల్పోయి రోడ్డున పడింది. ఈ కథనాన్ని స్పందించిన హృదయాలకు (జానో జాగో వెబ్ న్యూస్ చేరవేసింది. '''''రోడ్డున పడ్డ కుటుంబం... మంటల్లో ఇంటితో సహా సర్వం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేసిన కుటుంబం'''' అనే వార్తపై నందికొట్కూరు వైసిపి ఇన్చార్జి, ఆంధ్ర ప్రదేశ్ క్రీడా సంస్థ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి స్పందించారు.  విద్యుత్ షార్ట్ కట్ ఆగస్టు 9వ తేదీన అర్ధరాత్రి కర్నూలు జిల్లా గడివేముల మండలం లోని బీసీ కాలనీ లోని ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఇంటి యజమాని సుధాకర్ (43) ఆయన భార్య ఇంట్లో  నిద్రిస్తున్న తమ పిల్లలను తీసుకొని బయటికి పరుగులు తీశారు. ఇరుగుపొరుగు వారిని  కేకలు వేస్తూ    పిలిచే లోపే ఇల్లు తగలబడి సర్వం కోల్పోయారు.

ఈ కథనాన్ని.. బాధిత కుటుంబ ఆవేదనను..జానో జాగో వెబ్ న్యూస్ కండ్లకు కట్టినట్టు ప్రచురించింది. ఈ వార్తపై స్పందించిన వైసిపి నందికొట్కూరు ఇన్చార్జి. ఆంధ్రప్రదేశ్ క్రీడా సంస్థ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పదివేల రూపాయలను.. రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ కన్వీనర్ బి.శ్రీ రాములుకి పదివేల రూపాయలను ఆర్థిక సాయం అందించారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇచ్చిన పదివేల రూపాయలను సోమవారంనాడు విద్యుత్ సర్ కట్  ఇల్లు తగలబడి పోయిన  కర్నూలు జిల్లా గడివేముల మండలం లోని బీసీ కాలనీలో ఉండే సుధాకర్ దంపతులకు బీ శ్రీరాములు అందజేశారు. ఈ కార్యక్రమంలో లో బి శ్రీరాములు మాట్లాడుతూ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి ఏదైనా అన్యాయం జరిగితే వారికి తోడుగా ఉంటారని బైరెడ్డి సిద్ధార్థ యువసేన అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో  బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి యువసేన నాయకులు ఎం సురేష్ యాదవ్, ప్రవీణ్ ,నవీన్ , బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు.

రోడ్డున పడ్డ కుటుంబం ఇల్లు తగలబడి సర్వం కోల్పోయామని ఆవేదన కథనం ప్రచురించబడ్డ లీక్ కింద ఇవ్వబడింది

https://www.jaanojaago.com/2021/08/blog-post_45.html


,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: