క్విట్ ఇండియా స్పూర్తితో,,,
సేవ్ ఇండియా జయప్రదం చేయాలని కోరుతూ
కేంద్ర కార్మికసంఘాలు బైక్ ర్యాలీ
(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)
దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతున్న మోడీ దివాళాకోరు విధానాలకు వ్యతిరేకంగా, 3 వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని, 44 కార్మిక చట్టాలను రద్దుచేసి కార్మికులకు వ్యతిరేకంగాతెచ్చిన 4 లేబర్ చట్టాలను లను రద్దుచేయాలని, ఆదాయపు పన్ను పరిధిలోలేని ప్రతి కుటుంబానికి 7500 రూపాయల చొప్పున 6 నెలలు చెల్లించాలని, పెట్రోల్, డీజీల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చి నిత్యావసరాల ధరలు తగ్గించాలని, వంట గ్యాస్ ధరలు తగ్గించాలని, కేంద్రంలో ఖాళీగా ఉన్న 13 లక్షల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, దేశానికి ఆదాయం సమకూర్చే ప్రభుత్వ రంగ సంస్థల ప్రేవేటికరణ ఆపాలని, భవన నిర్మాణ సంక్షేమబోర్డు పథకాలు పునరుద్ధరించాలని, స్కిం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రెగ్యులర్ చేయాలని కోరుతూ క్విట్ ఇండియా స్పూర్తితో ఆగస్టు 9 వతేదీన చేసే సేవ్ ఇండియా ఉద్యమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మికసంఘాలు, రైతు సంఘాలు ఎం పి జె పిలుపు మేరకు అనేక కోర్టు సెంటర్ నుండి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా నాలుగు మండపాలు చుట్టూ చుట్టూ తిరుగుతూ పూల సుబ్బయ్య కాలనీ వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పెద్దలు అందె. నాసరయ్య సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు డి కే ఎం రఫీ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు డి సోమయ్య, ఎం పీ జే రాష్ట్ర కోశాధికారి ఇ ఎస్ కె అబ్దుల్ రజాక్, ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఎస్.కె కాసిం మాట్లాడుతూ.... బ్రిటిష్ వాడిని దేశం నుండి వెళ్లిపొమ్మని పిలుపు నిచ్చినరోజే నేడు మోడీ కార్మిక, ప్రజా,రైతాంగ ,ఉద్యోగ వ్యతిరేక విధానాలనుండి భారత దేశాన్ని కాపాడాలని సేవ్ ఇండియా నినాదంతో దేశ హితాన్ని కోరేవారందరు కలిసి ఆగస్టు 9వతేది ఉద్యమించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గత 8 నెలలుగా 3 వ్యవసాయ నల్లచట్టలను రద్దు చేయాలని కోరుతూ దేశానికి అన్నంపెట్టే రైతాంగం ఢిల్లీ సరిహద్దుల్లో పోరాడుతుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం ప్రజాస్వామికవాదులపై మరియు సుప్రీంకోర్టు వంటి రాజ్యాంగ సంస్థలపై (పెగాసస్) గూఢచర్యం చేయడంలో బిజీగా ఉందని ఎద్దేవా చేశారు. ఆంధ్రా ప్రజలకు ప్రత్యేకత లేకుండా ఆంధ్రా బ్యాంకును మాయం చేసారని, ఇప్పుడు ఎన్నో త్యాగాలతో సాధించుకున్న నవరత్నహోదా కలిగిన విశాఖఉక్కు పరిశ్రమను దక్షిణ కొరియా కంపెనీ పోస్కోకి బుక్ వ్యాల్యూకి బీజేపీ ప్రభుత్వం అమ్మేస్తుంటే చూస్తూ ఉరుకుందామా అని ప్రశ్నించారు. కరోనా సంక్షోభంలో ఉన్న ప్రజలను ప్రపంచదేశాలు నగదు పంపిణీద్వారా ఆయాదేశాల ప్రజలను ఆదుకుంటుంటే, భారతదేశంలో మాత్రం మీచావు మీరు చావండని వదిలేసి,
సి.పి.ఐ. రాష్టృ కార్యవర్గ సభ్యులు అందె. నాసరయ్య
సంక్షోభ సమయంలో కూడా కార్పొరేట్లకు ప్రజల సంపదను దోచిపెట్టడమే బీజేపీ నాయకుల దేశభక్తి అని విమర్శించారు. లాభ నష్టాలతో సంబంధం లేకుండా ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తుంటే ప్రభుత్వ ఉద్యోగాలకోసం దేశ యువతరం బీజేపీ విధానాలను నిలదీయాలని సూచించారు. రోజు రోజు పెరిగిపోతున్న పెట్రోల్ ధరలు నియంత్రించాలని సామాన్యుడికి అందుబాటులోకి తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు ఉపాధి హామీ పథకాన్ని పట్టణ ప్రాంతాలకు వర్తింపజేయాలని సంవత్సరానికి 200 రోజులు ఉపాధి పని చూపించాలని డిమాండ్ చేశారు మత ప్రాధికార మత ప్రాతిపదికన విభజించే సి ఏ ఏ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలని ఆగస్టు 9 న జరగబోయే నిరసన దేశం కోసం దేశభక్తి గల ప్రజలందరూ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఏనుగుల. సురేష్ కుమార్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి రూబెన్ కాశయ్య జి విక్టర్ ఎలిషా, జె.కిరణ్, జె. నాగయ్య ,ఎంపీజే మార్కాపురం పట్టణ కన్వీనర్ షేక్ గౌస్ భాష, షేక్ హుస్సేన్ భాష, నాయకులు షేక్.సలాం, ఖాశింసా, అమీర్, జావేద్, రషీద్, షఫీ, షేక్షా, ఖలీల్, రఫీ , ఖాశిం పీరా, ఎంఆర్పీఎస్ నాయకులు సండ్రపాటి కాలేబు, బాబు మొదలగు వారు పాల్గొన్నారు.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: