పెట్రోల్, డీజీల్ పై వ్యాట్ రద్దు చేసిందెక్కడా

పాదయాత్రలో ఇచ్చిన హామీ ఏమైంది

మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి

పెట్రోల్, డీజీల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా టీడీపీ నిరసన


(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)  

రాష్ట్ర తెలుగుదేశంపార్టీ ఆదేశానుశారం శనివారంనాడు మార్కాపురం నియోజకవర్గ కేంద్రమైన మార్కాపురంలో మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పెరిగిన పెట్రోలు, డీజిల్, వంటగాస్, నిత్వావసర మార్కాపురంవస్తువుల ధరలపై నిరసన కార్యక్రమం జరిగింది. పెరిగిన వంట గాస్, పెట్రోల్, డీజిల్ ధరలు నిత్యవసర వస్తువులు సామాన్యుని నడ్డి విరిచేలా ఉన్నాయంటూ దోర్నాల బస్టాండ్ ఎన్.టి.ఆర్ విగ్రహం నుంచి పాదయాత్రగా ఆర్డిఓ ఆఫీస్,  మార్కాపురం చేరుకుని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ….ప్రతిపక్ష నేతగా జగన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో పెట్రోల్ డీజిల్ ధరలపై గొంతు చించుకుని ప్రసంగించారు. అధికారంలోకి వస్తే.. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ పూర్తిగా రద్దు చేస్తామన్నారు కాని ఇపుడు వాటిని రెండింతలు పెంచారు. గతంలో పెట్రోల్ పై వ్యాట్ 31.50% నుండి 35.20 శాతానికి పెంచారు, సెస్ రూ.2.76 నుండి రూ.4కి పెంచారు. రోడ్ సెస్ పేరుతో రూపాయి వసూల్ చేస్తున్నారు. (35.20%Vat+Rs.4+Rs.1), డీజిల్ పై వ్యాట్ 22.25% నుండి 27 శాతానికి పెంచారు. సెస్ రూ.3.07 నుండి రూ.4, రోడ్ సెస్ పేరుతో రూపాయి వసూల్ చేస్తున్నారు. (27%Vat+Rs.4+Rs.1) అంటూ విమర్శించారు.భారత దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు అధికంగా గల రాష్ట్రాల్లో ఏపీ (పెట్రోల్ రూ.108.71, డీజిల్ రూ.100.25)తో అగ్ర స్థానంలో నిలిచిందన్నారు.నాడు బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో పెట్రోల్ రేట్లపై జగన్మోహన్ రెడ్డి నానా రాద్దాంతం చేశారు.

కందుల నారాయణ రెడ్డి 


 

దేశంలో కెల్లా మన రాష్ట్రంలోనే ధరలు ఎక్కువగా ఉన్నాయని, ఈ విషయం అధికార పార్టీ నాయకులు గుర్తించాలంటూ గొంతు చించుకుని మరీ అరిచారు. ప్రతిపక్ష నేతగా జగన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో పెట్రోల్ డీజిల్ ధరలపై గొంతు చించుకుని ప్రసంగించారు. అధికారంలోకి వస్తే.. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ పూర్తిగా రద్దు చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రెండు సార్లు ధరలు అడ్డగోలుగా పెంచారు. చివరికి కరోనా కష్టాల్లో ప్రజలు ఉంటే.. డెవలప్ మెంట్ సెస్, రోడ్ సెస్ పేరుతో చీకటి జీవోలిచ్చి అడ్డగోలుగా ధరలు పెంచారు. ప్రస్తుతం పెరిగిన ధరలతో దేశంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్న రాష్ట్రంగా ఆంద్రప్రదేశ్ సరికొత్త రికార్డును నెలకొల్పి.. ఏడాదికి రూ.600-1000 కోట్ల అధనపు ఆదాయం వసూల్ చేస్తోంది. దక్షిణాది రాష్ట్రాలతో పాటు, ముంబై, ఢిల్లీల కంటే ఏపీలోనే పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయి. కరోనాతో ఆదాయం లేక ప్రజలు అవస్థలు పడుతుంటే.. ప్రభుత్వ ఖజానా నింపుకోవడం కోసం పెట్రోల్ డీజిల్ ధరలపై వ్యాట్, ట్యాక్స్, సెస్ పెంచి భారం వేయడం సిగ్గుచేటు అని పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు వెంటనే అదుపులోకి తేవాలని పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మార్కాపురం ఆర్ డి ఓ గారికి వినతి పత్రం సమర్పించారు.

 


ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ గారు జిల్లా అధికార ప్రతినిధి ఈ శాసనాల వీరబ్రహ్మం గారు జిల్లా పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షుడు శ్రీ కంచర్ల కాశయ్య గారు, మార్కాపురం మండల పార్టీ అధ్యక్షుడు జవాజి రామానుజుల రెడ్డి గారు జిల్లా మాజీ వర్క్స్ బోర్డు సభ్యులు డాక్టర్ మౌలాలి గారు, రాష్ట్ర మాజీ వాషర్ మెన్ ఫెడరేషన్ సభ్యులు శ్రీ కనిగిరి బాల వెంకటరమణ గారు కౌన్సిలర్లు మాల కొండయ్య గారు పేరు వెంకట్ నారాయణ రెడ్డి గారు పిన్నిక మల్లికార్జున గారు, మాజీ ఎంపీటీసీ సభ్యులు పి. గోపీనాథ్ గారు, మైనారిటీ నాయకులు గఫార్, పఠాన్ ఇబ్రహీమ్, గులాబ్ బాష, చక్క పెట్టెల జిలాని మరియు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని కార్యక్రమంను విజయవంతం చేశారు.


✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: