టీడీపీ నేతలు ఢిల్లీ యాత్ర చేసినా...

మోకాళ్ళ యాత్ర చేసినా,,

వెలిగొండ నిర్మాణం ఆగదు

వైసీపీ నేత డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

ప్రకాశం జిల్లాలో టీడీపీ నేతల పరిస్థితి నానాటికి దిగజారిపోతుందని వైకాపా రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి విమర్శించారు. పూర్తవుతున్న వెలిగొండపై క్రెడిట్ కోసం పాకులాడటం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని అన్నారు. వెలిగొండ మీద చెయ్యాల్సిన దుష్ప్రచారం అంతా చేసి ఆ పార్టీ నేతలు ఇప్పుడు కేంద్ర మంత్రిని కలవడం విడ్డూరంగా ఉందని ఆరోపించారు. టీడీపీ నేతలు వెలిగొండను ఆపడానికి ఢిల్లీ యాత్ర చేసిన  మోకాళ్ళ యాత్ర చేసినా ప్రాజెక్టును పూర్తి చేసి తీరతాం అన్నారు. అంతేకాదు ఇక్కడ కూడా చంద్రబాబు రెండు కళ్ళ  సిద్ధాంతాన్ని అవలంభించారని మండిపడ్డారు.. చంద్రబాబుకు వెలిగొండ మీద చిత్తశుద్ధి ఉంటే ఆయన కూడా కేంద్ర మంత్రిని ఎందుకు కలవలేదని ప్రశ్నించారు. గతంలో వెలిగొండ ప్రాజెక్టుకు ఎన్నో అడ్డంకులు సృష్టించిన చంద్రబాబు నేడు దుష్ప్రచారానికి తెరలేపడం సిగ్గుచేటు అని విమర్శించారు. krmb పరిధిలోకి వెలిగొండ ప్రాజెక్టును చేర్చకపోవడంపై టీడీపీ దుష్ట రాజకేయం చేస్తుందని.. వారి వైఖరి వల్లే తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదులు చేస్తుందని ఆరోపించారు.
ప్రకాశం బ్యారేజి వద్దకు వెళ్లి ఆ ప్రాంత వాసులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించడం.. వెలిగొండ వద్దకు వెళ్లి ప్రకాశం జిల్లా ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించడం చంద్రబాబుకే చెల్లిందన్నారు.. ఆయనగారి వైఖరి వలన అప్పట్లో అన్ని ప్రాంతాల ప్రజలకు నష్టం జరిగిందని ఆరోపించారు. వెలిగొండ విషయంలో కూడా కృష్ణా జిల్లా నేతలతో ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ.. ఇటు పశ్చిమ ప్రకాశం జిల్లా నేతలతో అనుకూలంగా ఉన్నామని మాట్లాడించడం చంద్రబాబు దివాలాకోరు తనానికి నిదర్శనం అని దుయ్యబట్టారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వెలిగొండ ప్రాజెక్టు విషయంలో టీడీపీ నేతలను ఏకాభిప్రాయానికి తీసుకురావాలని ఏలూరి రామచంద్రారెడ్డి సూచించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: