భూ ఆన్ లైన్ ల అక్రమాలపై,,,

విచారణ చేపట్టిన కలెక్టర్

ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ భూ ఆన్ లైన్ అక్రమాలపై విచారణ చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన అక్రమాలపై దర్యాప్తుకు ఆదేశించారు. అందుకు అనుగుణంగా దర్యాప్తు జరిపేందుకు ఏడు మంది అధికారులను నియమించారు. ఇక గిద్దలూరు నియోజకవర్గంలో కూడా భూ ఆన్ లైన్ అక్రమాలపై విచారణ జరిపేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. 2018 జులై 1 నుండి 2021 జులై ఆఖరి లోపు భూ ఆన్ లైన్ అక్రమాలు భారీగా జరిగినట్లు గుర్తించారు. వాటిపై విచారణ జరిపేందుకు ప్రత్యేకంగా అధికారులు నియమించబడ్డారు. 2018 జూలై 1 నుంచి భూ ఆన్ లైన్  అక్రమాల ద్వారా భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరూ మీ మండలాలకు కేటాయించబడిన అధికారులకు పూర్తి సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేయవచ్చు. గిద్దలూరు నియోజకవర్గంలో భూ ఆన్ లైన్ అక్రమాలకు విచారణ జరిపేందుకు నియమించబడ్డ అధికారులు వీరే... 

(1) గిద్దలూరు ౼ బి. నారద ముని*

(2) కొమరోలు ౼కె. కృష్ణవేణి*

 (3) బేస్తవారిపేట ౼ జి. వసంత బాబు*

 (4) రాచర్ల ౼ పి. గ్లోరియా*

(5) కంభం ౼ బి. నారద ముని*

(6) అర్ధవీడు ౼ జి. వసంత బాబు*

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: