కనుమరుగు కానున్న కొండలు 

రూపురేఖలు మారనున్న చెరువులు

రియల్ ఎస్టేట్, ఇటుక బట్టి వ్యాపారుల అక్రమ గ్రావెల్ తవ్వకాలు

నీటిపారుదల,మైనింగ్ శాఖ అధికారుల కుమ్మక్కు

వెంటనే చర్యలు తీసుకోండి...ఆర్డీఓకు సిపిఎం నాయకుల వినతి


(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని వేములకోట చెరువు, నాయుడు పల్లె చెరువు, తిప్పాయపాలెం చెరువు , మహమ్మద్స్ కుంట మరియు పెద్ద నాగులవరం గ్రామం లోని పెద్ద కొండ, పెద్దారవీడు మండలం లోని పెద్దారవీడు చెరువు,దేవరాజు గట్టు అత్తా కోడళ్ళ చెరువు, గొబ్బూరు చెరువు, చెట్ల మెట్ల  చెరువు, తోకపల్లె లోని వీరన్న స్వామి కొండ, దేవరాజు గట్టు లోని చిన్న బొడు,పెద్దదోర్నాల మండలం లోని కటకాని పల్లె చెరువు ,బొమ్మలాపురం చెరువు, మొదలగు చెరువులు మరియు కొండలు రానున్న కాలంలో కనుమరుగుకానుందా? చెరువుల రూపురేఖలు మారనున్నాయా? అనే అనుమానం కలగక మానదు. మార్కాపురం ,పెద్దారవీడు, పెద్దదోర్నాల మండలంలోని చెరువుల్లో నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్, నీటిపారుదల శాఖ అధికారులతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ,ఇటుక బట్టి వ్యాపారులు కుమ్మక్కై ఈ వ్యవహారంతో రాత్రి భారీ భారీ యంత్రాలతో లక్షల క్యూబిక్ మీటర్ల అక్రమంగా తవ్వుతూ చెరువుల కొండల ప్రమాదకర పరిస్థితులు ఏర్పడనున్నాయి.

సి.పి.ఎం. నాయకులు డి. సోమయ్య, యేనుగుల సురేష్ కుమార్.
వెంటనే రియల్ ఎస్టేట్ వ్యాపారులు పైన,ఇటుక బట్టి వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని, సదరు అక్రమ వ్యాపాలతో లాలూచీపడి అటు వైపు కన్నెత్తి కూడా చూడడంలేదని, మైనింగ్ మరియు నీటిపారుదల శాఖ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారంనాడు సిపిఎం నాయకులు మరియు సిపిఎం ప్రతినిధి బృందం మార్కాపురం ఆర్డీఓ లక్ష్మీ శివ జ్యోతిని కలిసి అర్జీ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా డి సోమయ్య మాట్లాడుతూ ఇరిగేషన్, మైనింగ్ అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నారని చెరువులు, కొండలను నీటిపారుదల శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారని, రానున్న కాలంలో ఇదే పద్ధతిలో అక్రమంగా తవ్వకాలు జరిగినట్లయితే ప్రకృతి ప్రకోపానికి ప్రజలు గురికావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసినారు తీసుకోవాలని అన్నారు.అర్జీ అందజేసిన వారిలో సిపిఎం నాయకులు పందిట్టి  రూబెన్,ఏనుగుల సురేష్ కుమార్, యద్దనపూడి యేసెబు, రాజబాబు, మురికిపూడి బాల శేషయ్య తదితరులు అర్జీ అందజేసిన వారిలో ఉన్నారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: