అధికార మదంతో కేటీఅర్ వ్యాఖ్యలు
టి.పి.సి.సి సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్
(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)
కాంగ్రెస్ పార్టీ పై కె.టి.ఆర్ చేసిన వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని టి.పి.సి.సి సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ పేర్కొన్నారు. ఆయన అధికార మదంతో ఆయన కన్ను మిన్ను లేకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. శనివారంనాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీకి కేటీఆర్ క్షమాపణలు చెప్పాలి. 136 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు ఫ్రాంచైస్ గా మారి ఆయన బినామిలు, తొత్తులతో పార్టీని నడిపించటానికి దిక్కు తోచలేని పరిస్తితులలో ఏమీ లేదు. చరిత్ర తెలియని కె.టి.ఆర్ తాను ఆశిస్తున్న సి.ఎం పదవి దక్క కుండా పోతుందేమోననే దుగ్డతో మతి తప్పి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ భారత దేశానికి తానే దిక్కై సుధీర్ఘ పోరాటం చేసి స్వాతంత్య్రము సాధించిన పార్టీ అని మరువకూడదు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తముగా ప్రజా బలమున్న పార్టీ. ప్రజాస్వామ్యాన్ని పరి రక్షించగల్గే పార్టీ. బడుగు బలహీన మైనారిటీ వర్గాలకు అభ్యున్నతికి పాటుపడే పార్టీ .
అన్ని మతాలను కులాలను సమానముగా ఆదరించి, గౌరవించే పార్టీ. దేశ సమైక్యత , సమగ్రతలే ప్రధాన ధ్యేయంగా గల పార్టీ.136 సంవత్సరాల చరిత్రగల్గి సుశిక్షితులైన నాయకులు, కార్యకర్తలు గల కాంగ్రెస్ పార్టీకి ఒకరి నామినీని దిగుమతి చేసుకుని భాద్యతలివ్వాల్సిన ఖర్మ పట్ట లేదు. కాంగ్రెస్ పార్టీ సిద్దాంతలపై విశ్వాసం ఉంచి పార్టీలో చేరి పని చేసే వారికి కూడా అవకాశాలు కల్పించబడుతాయి. కె.సి.ఆర్, చంద్రబాబులకు రాజకీయ జన్మనిచ్చినది కాంగ్రెస్ పార్టీయేనని మరువకూడదు. వి.హనుమంత రావు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు , కెసిఆర్ లు తనతో పాటు ఉపాధ్యక్షులు గా ఉన్న సంగతి కె.టి.ఆర్ కు తెల్సా? 1983 లో తప్పుడు పాస్ పోర్ట్ ల ఆరోపణలున్నందున అప్పటి అఖిల భారత యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గులాంనబీ ఆజాద్ కె.సి.ఆర్ ను పదవి నుండి తొలగిస్తే ఆ ఉత్తర్వులు ప్రెస్ కు ఒక రోజు వరకు ఇవ్వకుండా వి.ఎచ్ ను బ్రతిమాలుకుని, యూత్ కాంగ్రెస్ నుండి రాజీనామా చేసినట్ట్లు నటించి ఎన్.టి.ఆర్ ను కల్సి, అప్పుడే ఏర్పడ్డ టి.డి.పి. లో చేరిన మాట వాస్తవం కాదా? తన గురువైన మదన్ మోహన్ కు కెసిఆర్ పంగనామాలు పెట్టింది వాస్తవము కాదా? తెలంగాణా ఇచ్చిన సోనియమ్మ ను దేవత అని చెప్పి ఆ తదుపరి మోసము చేసినది కెసిఆర్ కాదా? తిన్న ఇంటి వాసాలు లెక్క పేట్టే నైజం కె.సి.అర్ కుటుంబానిది కాదా? చంద్రబాబు యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడై, ఆ తదుపరి టి.అంజయ్య క్యాబినెట్ లో మంత్రి అయినందుననే ఎన్ టి ఆర్ తన కూతురినిచ్చి పెళ్లి చేసింది వాస్తవము కాదా? 1983 ఎన్నికలలో కాంగ్రెస్ నుండి టి.డి పి పై పోటీ చేసిన చంద్రబాబు , ఎన్నికల తదుపరి మామ పంచన చేరి ఆ తదుపరి మామనే మోసము చేసినది వాస్టవము కాదా? ఉమ్మడి రాష్ట్రములో ఆ తదుపరి తెలంగాణా రాష్ట్రములో దిగజారుడు రాజకీయాలకు చంద్రబాబు, కె.సి.ఆర్ లు ఇద్దరూ కారణము కాదా ? తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే ప్రయత్నాలు చేసిన చంద్రబాబును, రాష్ట్రము ఏర్పడిన తర్వాత రాష్ట్రాన్ని దోచుకుంటున్న కెసిఆర్ ను తెలంగాణా ప్రజలు ఎన్నటికీ క్షమించరు. తమకు రాజకీయ జీవితము ప్రసాదించిన కాంగ్రెస్ ను నిలువెత్తు గోతి తీసి బొంద పెట్టాలన్న కెసిఆర్, చంద్రబాబు లలో ఒకరైన చంద్రబాబును ఇటు తెలంగాణా లో అటు ఆంధ్ర రాష్ట్రములో గోతి లో పడేసి పూడ్చుతున్నారు, ఇక రాబోయే కాలంలో తెలంగాణా లో కె.సి.ఆర్ కు ఆ గతి పట్ట బోతున్నారు. అని ఆయన విమర్శించారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: