ఏలూరి లక్ష్మీదేవి చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభం
ఘనంగా లక్ష్మిదేవి వర్ధంతి
ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి,మాజీ ఎమ్మెల్యే జంకే తో పాటు పలువురు ప్రముఖులు హాజరు
(జానోజాగో వెబ్ న్యూస్-ప్రకాశం ప్రతినిధి)
కుటుంబ ప్రతిష్టను పెంపొందిస్తూ మరోవైపు గ్రామాభివృద్ధికి తుదిశ్వాస వరకు పాటుపడిన స్వర్గీయ ఏలూరి లక్ష్మీదేవి దాన్యజీవని మార్కాపురం శాసన సభ్యులు కెపి నాగార్జునరెడ్డి అన్నారు. దివంగత మహాన్విత స్వర్గీయ ఏలూరి లక్ష్మీదేవి ప్రధమ వర్ధంతి కార్యక్రమం శనివారం గోబ్బురు గ్రామంలోని ఆమె స్వగృహంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి లక్ష్మిదేవి కుమారుడు, రాష్ట్ర వైసీపీ నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి మాట్లాడుతూ వెనుకబడిన పశ్చిమ ప్రకాశంలో ఏలూరి లక్ష్మీదేవి చారిటబుల్ ట్రస్ట్ ను ఆమె భర్త గాలి వీరారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ బ్రోచర్ ను ఆవిష్కరించారు. పేదలకు విద్య, వైద్యం అందించాలనే లక్ష్యంతో ట్రస్ట్ ముందుకు వెళ్లాలని నిర్ణయించడం హర్షణీయమని అన్నారు.
ట్రస్ట్ చేపట్టబోయే కార్యక్రమాలకు మా సహకారం ఎప్పుడు ఉంటుందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ముందుగా స్వర్గీయ లక్ష్మీదేవి చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కుందురు క్రిష్ణ మోహన్ రెడ్డి, మార్కాపురం మున్సిపల్ చైర్మన్ ఛిర్లంచెర్ల బాల మురళీకృష్ణ, రాష్ట్ర వైసీపీ సెక్రటరీ, ఏ1 గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ యమ్ షంషీర్ అలీభేగ్, కిట్స్ ఇంజినీరింగ్ కాలేజీ కరస్పాండెంట్ అన్నా క్రిష్ణ చైతన్య, మార్కాపురం మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎస్ కె ఇస్మాయిల్, కౌన్సిలర్ డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ, మార్కాపురం నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి అందే నాసరయ్య,మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ డీవి కృష్ణారెడ్డి, జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి శాసనాల వీర బ్రహ్మం, రాక్ వెల్ పబ్లిక్ స్కూల్ చైర్మన్ వెన్నా పోలిరెడ్డి,బత్తుల ఫౌండేషన్ చైర్మన్ బత్తుల నాగార్జున రెడ్డి, జిల్లా వైసీపీ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి డి గాంధీరెడ్డి, వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శి కంది ప్రమిలా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: