పుట్టిన‌రోజు సంద‌ర్భంగా,,,

`రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్‌` కుటుంబాన్ని

ప‌రిచ‌యం చేసిన సుహాస్‌


(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

`క‌ల‌ర్‌ఫోటో` చిత్రంతో హీరోగా తొలి స‌క్సెస్ అందుకున్న సుహాస్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా మారిపోయారు. ఈ చిత్రాల్లో `రైట‌ర్ ప‌ద్మభూష‌ణ్` ఒక‌టి. ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ఫైన‌ల్ స్టేజ్‌లో ఉంది. ఓ సాంగ్ మిన‌హా ఎంటైర్ షూటింగ్ పూర్త‌య్యింది.  కొత్త ఏడాది సంద‌ర్భంగా ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన మేక‌ర్స్ ఇప్పుడు సుహాస్ పుట్టిన‌రోజు సంర‌ద్భంగా `రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్‌` ఫ్యామిలీ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.  సుహాస్ తండ్రి పాత్ర‌లో ప్ర‌ముఖ న‌టుడు ఆశిష్ విద్యార్థి, త‌ల్లి పాత్ర‌లో ప్ర‌ముఖ న‌టి రోహిణి నటిస్తున్నారు. ఈ బ‌ర్త్ డే స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే ఇందులో అంద‌రూ సెల‌బ్రేష‌న్స్ మూడ్‌లో క‌నిపిస్తున్నారు.  ష్మ‌ణుఖ ప్ర‌శాంత్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రంలో సుహాస్ అనేక ఇబ్బందులు ప‌డే రైట‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. మ‌నోహర్ గోవింద స్వామి స‌మ‌ర్ప‌ణ‌లో చాయ్ బిస్క‌ట్ ఫిల్మ్స్‌, ల‌హ‌రి ఫిల్మ్స్ ప‌తాకాల‌పై అనురాగ్‌, శ‌ర‌త్‌, చంద్రు మ‌నోహర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  శేఖ‌ర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వెంక‌ట్ ఆర్‌.శాఖ‌మూరి సినిమాటోగ్రాఫ‌ర్‌. అక్టోబ‌ర్‌లో సినిమా విడుద‌ల‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. 


న‌టీన‌టులు:  

సుహాస్‌, ఆశిష్ విద్యార్థి, రోహిణి త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  షణ్ముఖ ప్ర‌శాంత్‌

నిర్మాత‌లు: అనురాగ్‌, శ‌ర‌త్‌, చంద్రు మ‌నోహ‌ర్‌

స‌మ‌ర్ప‌ణ‌: మ‌నోహ‌ర్ గోవింద‌స్వామి

బ్యాన‌ర్స్‌:  చాయ్ బిస్క‌ట్ ఫిల్మ్స్‌, ల‌హ‌రి ఫిల్మ్స్‌

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  సూర్య చౌద‌రి

సంగీతం:  శేఖర్ చంద్ర‌

సినిమాటోగ్ర‌పీ:  వెంక‌ట్ ఆర్‌.శాఖ‌మూరి

ఎడిట‌ర్‌:  రామకృష్ణ అర్ర‌మ్‌

ఆర్ట్‌: ఎల్ల‌య్య‌.ఎస్‌

పి.ఆర్‌.ఓ:  వంశీ శేఖ‌ర్‌

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: