రెడ్ల అభ్యున్నతికి కృషి చేయండి

రెడ్డి కార్పొరేషన్  చైర్మన్ తో డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి భేటీ

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

ఆంధ్రప్రదేశ్ రెడ్డి కార్పొరేషన్  చైర్మన్ సత్యనారాయణరెడ్డితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి భేటీ అయ్యారు.. ఈ సందర్బంగా రెడ్ల సాధకబాధలు తెలిసిన సత్యనారాయణరెడ్డి.. కార్పొరేషన్ కు మొదటి చైర్మన్ గా నియమితులు కావడం సంతోషకరమని కొనియాడారు. అనంతరం రెడ్ల యొక్క సమస్యలను సత్యనారాయణరెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఎంతో కాలంగా రెడ్లు ఆర్ధికంగా అణచివేతకు గురవుతున్నారని అటువంటి వారికి  రెడ్డి కార్పొరేషన్ ద్వారా ఆర్ధిక భరోసా కల్పించాలని కోరారు. అలాగే పేద రైతులను గుర్తించి వారికి కావాల్సిన పనిముట్లను సబ్సిడీలో ఇచ్చి తద్వారా రెడ్డి రైతాంగాన్ని కాపాడుకోవాలని సూచించారు.


 

ముఖ్యంగా రెడ్లు అధికంగా ఉండే పశ్చిమ ప్రకాశం ప్రాంతాన్ని యూనిట్ గా తీసుకొని వలస వెళ్లే రెడ్లకు ఉపాధి కల్పించాలని ఏలూరి.. మరి మరీ సత్యనారాయణరెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఎవరికైనా ఆపద వస్తే సహాయం చేయడానికి ముందుకు వచ్చే రెడ్డి.. ఈనాడు కష్టాల్లో ఉన్నాడని సత్యనారాయణరెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన శుభవేళ.. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉందన్న ఏలూరి.. రాష్ట్రంలో ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి అభ్యున్నతికి పాటుపడటం గొప్ప నిర్ణయమని కీర్తించారు. సత్యనారాయణరెడ్డిని కలిసిన వారిలో ఏలూరి తోపాటు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: