మొక్కలు నాటడం వల్ల....

వాతావరణంలో సమతుల్యత

ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి

మార్కాపురంలో ఘనంగా,,,“జగనన్న పచ్చతోరణం – వన మహోత్సవం“

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా “జగనన్న పచ్చతోరణం – వన మహోత్సవం“ పేరిట మొక్కలు నాటే కార్యక్రమములో భాగంగా  గురువారంనాడు మార్కాపురం పట్టణంలో జగనన్న పచ్చతోరణం వనమహోత్సవం సందర్బంగా ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని తర్లుపాడు రోడ్డులోగల రోడ్డు మథ్యలోవున్న డివైడర్ లోని ఖాలి స్ధలంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది.


ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే స్వయంగా మొక్కలను నాటారు. ఈ కార్యక్రమములో పాల్గొన్న మునిసిపల్ కమీషనర్ నయీమ్ అహమ్మద్, వైస్ ఛైర్మన్ షేక్ ఇస్మాయిల్  మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎం.ఎల్.ఎ. కుందూరు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ ఈ మొక్కల వలన వాతవరణంలో సమతుల్యతతోపాటు పర్యావరణ పరిరక్షణ ఏర్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో మునిసిపల్ వైస్ చైర్మన్ షేక్. ఇస్మాయిల్, మునిసిపల్ కమిషనర్ సిఎంఎనయీమ్ అహ్మ్మద్ సానిటరీ ఇన్స్పెక్టర్ షేక్. నాయబ్ రసూల్ మరియు సానిటరీ సెక్రటరీలు, వాలంటీర్లు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.


✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: