అపహరణకు గురైన 5 రోజుల పాప కేసు

డి.ఎస్.పి. కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో

పది గంటల లోపు చేధించి.. తల్లి ఒడికి చేర్చి

నిందితుల అరెస్ట్, పోలీసులను అభినందించిన ప్రజాసంఘాలు  


ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికాగర్గ్ (ఐ.పి.ఎస్.)

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

అపహరణకు గురైన 5 రోజుల పాప కేసును డి.ఎస్.పి. కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి పది గంటల లోపు చేధించి.. తల్లి ఒడికి చేర్చారు. నిందితుల అరెస్ట్ చేయగా, పోలీసులను ఈ సందర్భంగా ప్రజాసంఘాలు అభినందించాయి. ఈ కేసు ఛేధించడంలో సి ఐ. బి. టి. నాయక్ , పట్టణ ఎస్సై కె.నాగమల్లేశ్వరరావు , గ్రామీణ  ఎస్సై కోటయ్య, పోలీస్ సిబ్బంది పాలుపంచుకొన్నారు. వివరాలలోకి...ఫిర్యాదుదారు ఏరువ శ్రీరాములు గుంటూరు జిల్లా, కారంపూడి మండలం, బట్టువారిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి అయినట్లు  అతనికి 3 సంవత్సరాల క్రితం మార్కాపూరం మండలం, మాల్యవంతునిపాడు గ్రామానికి చెందిన ఏరువ కోమలితో వివాహం జరిగింది. కోమలి ప్రసవం కోసం తేది 23.08.2021 న మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరినట్లు, తేది 24.08.2021 ఉదయం 07.00 గంటలకు పిర్యాది భార్య ఆడ శిశువును ప్రసవించినట్లు, పాపకు  కామెర్ల వ్యాధి వచ్చినందున, తేది 27.08.2021 న రాత్రి వారు పాపను చికిత్స కోసం ఆసుపత్రిలోని  ఫోటోథెరపీ గదిలో ఉంచగా, తేది 28.08.2021 మధ్యాహ్నం ఒక గుర్తు తెలియని మహిళ బుర్ఖా ధరించి శిశువును కిడ్నాప్ చేసింది.
చుట్టుప్రక్కల విచారించిన పిదప, ఫిర్యాదుదారు మార్కాపూర్ రూరల్ పిఎస్‌లో కేసు పెట్టడo జరిగినది. వెంటనే మార్కాపూర్ రూరల్ SI గారు కేసు నమోదు చేసి, కేసు వివరాల గురించి ఉన్నతాధికారులకు సమాచారం అందించిన్నారు. ఈ విషయం పై వెంటనే స్పందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి. మలిక  గర్గ్ ఐపిఎస్  గారు ఒంగోలు లోని PCR ద్వారా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేసి, అపహరించిన పాప జాడను గుర్తించడానికి, జిల్లా పరిదిలోని ముఖ్యమైన జంక్షన్‌లలో, పాప ఆచూకి కొరకు వాహనాల తనిఖీ నిర్వహించమని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి,  జిల్లాలోని CI లు మరియు SI లు బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, సరిహద్దు జిల్లా చెక్ పోస్ట్ మరియు ఇతర ముఖ్యమైన జంక్షన్లలో వాహన శోధన ప్రారంభించారు. SP గారు జిల్లాలోని అన్ని సీసీ కెమెరా ఫుటేజీలను సేకరించి, ఎప్పటికప్పుడు,  సీసీ కెమెరా ఫుటేజీల సమాచారాన్ని, అధికారులకు పంపుతూ, నిర్విరామంగా ముద్దాయి ఆధారాల కోసం తనిఖీలు నిర్వహిస్తుండగా, పోలీస్ వారికి రాబడిన విశ్వసనీయ సమాచారం మేరకు, తేది 28/29.08.2021 మధ్య, రాత్రి దాదాపు 03.00 గంటలకు మార్కాపూర్ రూరల్ SI మరియు అతని సిబ్బంది కంభం రోడ్డులోని, మధు చిల్డ్రన్ హాస్పిటల్‌ని సందర్శించి, నిందితులు  పాపను మార్కాపురం  ప్రభుత్వ  ఆసుపత్రి పోటో థెరపి రూములో నుండి కిడ్నాప్ చేసినట్లు అంగీకరించింది. మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో  పాపను కిడ్నాప్ చేసి, తన దూరపు బంధువు ద్వారా రూ. 50,000/- కు అమ్మకానికి  ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుపగా,  ముద్దాయిలను అరెస్టు చేయబడినది. మరియు వారి దగ్గర నుండి, రూ. 50,000/-, డబ్బులు  మరియు బాండ్ పేపర్స్ ను స్వాదీనం చేసుకోబడినవి.  కిడ్నాప్ కు గురి కాబడిన 5 రోజుల పాపను 10 గంటలలో రక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ప్రకాశం జిల్లా పోలీసు సూపరింటెండెంట్, శ్రీమతి. మలిఖా గార్గ్, IPS గారు, వేగంగా స్పందించి మరియు సంఘటన జరిగిన 10 గంటలలోపు ఈ కేసును చేదించిన పోలీసు సిబ్బందిని ప్రశంసించారు, వారికి రివార్డులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం డిఎస్పీ యం. కిషోర్ కుమార్. మార్కాపురం సిఐ బీ.టీ. నాయక్, మార్కాపురం సర్కిల్  ఎస్సైలు జి. కోటయ్య, కె. నాగమల్లేశ్వరరావు, వై.నాగరాజు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


  

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: