సీమ ప్రాజెక్టుతో వెలిగొండకు అన్యాయం జరగదు

-ఈ వంకతో మరోసారి రాయలసీమకు టీడీపీ ద్రోహం

-ప్రాంతాల మధ్య టీడీపీ చిచ్చులు

-వైసీపీ నేత డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

రాయసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ముగ్గురు ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు లేఖలు రాయడం చూస్తుంటే.. ఆ పార్టీ అతితెలివి ప్రదర్శిస్తూ మళ్ళీ రాయలసీమకు అన్యాయం చేసే దిశగా కుట్రకు తెరలేపారని అర్థమవుతోందని వైసీపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు.. 881 అడుగుల నీటిమట్టంలో నీరుంటేనే రాయలసీమ ఎత్తిపోతల పధకానికి నీరు అందుతుందన్న ఏలూరి.. 851 అడుగుల లోతు నుంచే 45 రోజుల పాటు వరద వస్తే నీటిని తీసుకునే వెలిగొండ ప్రాజెక్టుకు రాయలసీమ ప్రాజెక్టు విషయంలో అన్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఈ వంకతో రాయలసీమకు నీరు ఇవ్వకుండా చేయాలనీ  పచ్చ నేతలు కుట్ర పన్నారని ఆరోపించారు. తరతరాలుగా రాయలసీమను ఎడారిలాగే ఉంచాలని కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. 

వెలిగొండ మీద ప్రేమ ఉంటే టీడీపీ హయాంలో ఎందుకు పూర్తి చెయ్యలేదని ప్రశ్నించారు.  2016 లోనే పూర్తి కావలసిన ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసింది టీడీపీ కాదా? ఇవాళ వెలిగొండ మొదటి సొరంగం పనులు పూర్తి చేసింది వైసీపీ ప్రభుత్వం.. అలాగే రెండో సొరంగం పనులు యుద్ధ ప్రాతిపదికన చేయిస్తోంది మా వైసీపీ ప్రభుత్వం అని నొక్కి చెప్పారాయన..  వెలిగొండ మీద చిత్తశుద్ధి ఉంది కాబట్టే పునరావాస బాధితుల కోసం రూ.14 వందల కోట్లు విడుదల చేశాం అని అన్నారు.. త్వరలోనే వెలిగొండకు నీళ్లిస్తాం.. అలాగే రాయసీమ ప్రజల కష్టాలు తీర్చడానికి ఎవరితోనైనా కొట్లాడతాం అని స్పష్టం చేశారు.. సీమ ప్రజల కష్టాలను తీర్చడానికి ప్రయత్నాలు చేయకుండా ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టె విధంగా వ్యవహరించే టీడీపీ లాంటి పార్టీలను తరిమి కొడతామని డాక్టర్ ఏలూరి హెచ్చరించారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: