టీడీపీ హయాంలో రైతుల అర్తనాదాలు ఏమయ్యాయి

నాడు కరెంటు బిల్లులు కట్టలేదని నీలదీస్తే టీడీపీ ఏం చేసింది

ప్రశ్నించిన రైతును గుర్రాలతో తొక్కలేదా

వైసీపీ నేత ఏలూరి రామచంద్రారెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

టీడీపీ హయాంలో రైతుల అర్తనాదాలు ఏమయ్యాయని, వాటి గురించి ఆ పార్టీ నేతలు తెలుసుకొంటే మంచిదని వైసీసీ రాష్ట్ర నాయకులు ఏలూరి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. నాడు కరెంటు బిల్లులను టీడీపీ సర్కార్ పెంచితే ప్రశ్నించిన రైతులను ఆ ప్రభుత్వం చేసిందేమిటో అందరికీ తెలుసన్నారు. నాడు గుర్రాలతో రైతులను తొక్కించి నానా హింసలు పెట్టారని ఏలూరి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. ఇంకా ఆయన మాట్లాడుతూ....తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతుల ఆర్తనాదాలు ఏమయ్యాయి?
కరెంటు బిల్లులు కట్టలేదని స్టాటర్లు లాక్కొని వెళితే ఇదేంటని ప్రశ్నిస్తే రైతులను గుర్రాలతో తొక్కించారు.. కళ్ళనిండా కన్నీళ్లతో.. ఒంటినిండా రక్తపు మరకలతో ఇంటికెళ్లి భార్య పుస్తెలతాడు అమ్మి కరెంటు బిల్లులు కడితే పంట చేతికి రాక అప్పులు కట్టలేక వలసవెళ్లిన పశ్చిమ ప్రకాశం జిల్లా రైతన్నల దీనస్థితి గురించి ఏనాడైనా చంద్రబాబు ఆలోచించారా? వెలిగొండ పూర్తి చెయ్యండి మహాప్రభో అని మొరపెట్టుకున్న రైతులను ఉక్కుపాదంతో అణచివేసినప్పుడు ఆర్తనాదాలు గుర్తుకురాలేదా? జిల్లాను పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా తొక్కేసిన చంద్రబాబుకు ఊడిగం చేసే బానిస బతుకులకు ఒకటే హెచ్చరిక.. ఇకనైనా మారండి..  వాస్తవాలు తెలుసుకోండి. అని ఆయన భావోద్వేగంగా మాట్లాడారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: