ఫిలిం క్రిటిక్స్ అసోసియేష‌న్ నూత‌న కార్య‌వ‌ర్గానికి,,,

మెగాస్టార్ చిరంజీవి శుభాభినంద‌న‌లు

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి మెగాస్టార్ చిరంజీవి శుభాభినందనలు తెలియ‌జేశారు. అధ్య‌క్షునితోపాటు కార్య‌వ‌ర్గ‌స‌భ్యుల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. చిరంజీవిగారు ముందుగా అధ్య‌క్షుడు ప్ర‌భుకి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. అలాగే మిగిలిన క‌మిటీ స‌భ్యుల‌కు నా శుభాకాంక్ష‌లు తెలియ‌జేయండ‌ని తెలిపారు.

ఇంకా ఆయ‌న మాట్లాడుతూ, అధ్య‌క్షులైన మీరు (ప్ర‌భు) ఇదొక మంచి అవ‌కాశంగా భావించి మీ వాళ్ళంద‌రికీ మంచి చేయ‌డానికీ, వారి సంక్షేమం కోసం మీ సేవ‌లు అందించ‌డానికి ప్ర‌య‌త్నం చేయండి. దానికి ఇదో చ‌క్క‌ని అవ‌కాశం. స‌ద్వినియోగ ప‌ర‌చుకోండి. ప‌ద‌వి అలంకారం కాకుండా బాధ్య‌త‌గా ప‌నిచేయండి. ప‌దిమందికి ఉప‌యోగ‌ప‌డండి. త‌ద్వారా మాన‌సిక ఆనందం ఎంత వుంటుందో ఊహించ‌లేరు. అలాగే నా మిత్రులైన మిగిలిన వారంతా మీ మార్కు సేవ‌లు అందించండి. ఎలాంటి విమ‌ర్శ‌ల‌కు తావులేకుండా అంద‌రికీ త‌ల‌లో నాలుక‌లా వుండాల‌నీ, వుంటార‌ని అనుకుంటున్నాను. మ‌రొక్క‌సారి శుభాభినంద‌న‌లు తెలియ‌జేస్తూ,, మీ చిరంజీవి పేర్కొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

   

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: