విద్యుత్ షాట్ సర్క్యూట్...

జిందాల్ ఫ్యాక్టరీకి తప్పిన పెద్ద ముప్పు

అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది

(జానోజాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

కర్నూలు జిల్లా గడివేముల మండలంలో పెద్ద ప్రమాదం తప్పింది. గడివేముల మండలం లోని జిందాల్ ఫ్యాక్టరీ ని విద్యత్ షాట్ సర్క్యూట్ వల్ల జరిగిన అగ్ని ప్రమాదంతో పొగలు కమ్మేశాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో  పొగ జిందాల్ ఫ్యాక్టరీని కమ్మేసింది. స్లాగ్వ వదిలే ప్రదేశం లో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు లేచి జిందాల్ ఫ్యాక్టరీ నీ పొగ కమ్మేసింది వెంటనే అప్రమత్తమైన జేఎస్ డబ్యూ  ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు . ఈ ఘటనలో ఎటువంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం జరగకపోవడంతో సిబ్బంది అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.


 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: