కాపు నేస్తం పథకం కోసం,,,

అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోండి


(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

  ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణములోని మునిసిపల్ కార్యాలయము నందు “ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నవరత్నాలలో భాగంగా “ వైఎస్ఆర్ కాపు నేస్తం “ (కాపు,బలిజ, తెలగ మరియు ఒంటరి మహిళలు ) పధకానికి సంబంధించి రెండవ విడుతగా మహిళల ఖాతాలలో   15,000 వేలరూపాయాలు జమా కానున్న సందర్భంగా గురువారంనాడు మునిసిపల్ కమీషనర్ నయీమ్ అహమ్మద్ , మునిసిపల్ ఛైర్మన్ బాల మురళీకృష్ణ, వైస్ ఛైర్మన్ షేక్ ఇస్మాయిల్ పర్యావేక్షణలో కాపు మహిళలతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడంతో పాటు దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగావారుమాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,27,244 మంది పేద చెల్లెమ్మలకు రూ. 490.86 కోట్ల ఆర్ధిక సాయం అందిస్తున్నట్లు, పాత అప్పుల కింద బ్యాంకులు జమ చేసుకోకుండా అన్‌ ఇన్‌కమ్‌బర్డ్‌ ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్లు, మ్యానిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల పేద అక్కచెల్లెమ్మల ఆర్ధికాభివృద్ది, జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా వరసగా రెండో ఏడాది వైఎస్సార్‌ కాపు నేస్తం ప్రభుత్వ పథకాల్లో ఎక్కడా వివక్ష, అవినీతికి తావులేకుండా అర్హత ఉంటే చాలు...పథకం వర్తించేలా అమలుచేస్తున్న ప్రభుత్వం. కులం, మతం, రాజకీయాలు, పార్టీలు చూడమంటూ సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రతీ సమావేశంలోనూ చెబుతున్నారు, అదే ఆచరిస్తున్నారు. 

 

వైఎస్సార్‌ కాపు నేస్తం ద్వారా 45 నుంచి 60 ఏళ్ళ లోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలకు ఏటా రూ. 15 వేల చొప్పున 5 ఏళ్ళలో మొత్తం రూ. 75,000 ఆర్దిక సాయం అందిస్తున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వైఎస్సార్‌ కాపు నేస్తం ద్వారా గత ఏడాది 3,27,349 మంది లబ్దిదారుల ఖాతాల్లో రూ. 491.02 కోట్లు జమ, నేడు 3,27,244 మంది పేద కాపు అక్కచెల్లెమ్మలకు అందిస్తున్న రూ. 490.86 కోట్లతో కలిసి మొత్తం రూ. 981.88 కోట్ల లబ్ది, గతంలో దరఖాస్తు చేసినప్పటికీ అనేక కారణాలవలన తిరస్కరింపబడిన అభ్యర్ధులు తగిన కారణాలను తెలియపరుస్తూ,


అర్హులైన ప్రతి ఒక్కరూ అవసరమైన అన్ని దృవీకరణ పత్రాలతో వాలంటీర్ల మోబైల్ యాప్  ద్వారా ఈ పధకంలో నమోదు చేయించుకొనే అవకాశం త్వరలోనే కల్పిస్తుందని, ఆ అవకాశాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకొని లబ్దిపొందాలని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాపు నేస్తం పధకానికి  సంబంధించిన మహిళలు, వైఎస్ఆర్ సిపి నాయకులు బండారు శ్రీనివాసులు, అంగం సుధీర్, కొట్టే శ్రీను  మరియు పురపాలక సిబ్బంది, కార్యకర్తలు పాల్గొన్నారు.
మునిసిపల్ ఛైర్మన్ బాల మురళీకృష్ణ


వైస్ ఛైర్మన్ షేక్ ఇస్మాయిల్ 


✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

   

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: