మోడీ బీసీ ప్రధాని ఎలా అవుతారు

బీసీ జనాభాను లెక్కించ కూడదన్నది దుర్మార్గం

ఆంధ్ర బహుజన ప్రజావేదిక


(జానోజాగో వెబ్ న్యూస్-కదిరి ప్రతినిధి)

దేశంలో జనాభా లెక్కలు చేపట్టాలని, కానీ బీసీ జనాభా లెక్కలు చేపట్టకూడదని కేంద్రం నిర్ణయం తీసుకోవడం శోచనీయమని ఆంధ్ర బహుజన ప్రజావేదిక పేర్కొంది. బీసీలను విస్మరించే ప్రధాని నరేంద్ర మోడీ బీసీ ఎలా అవుతారని ప్రశ్నించింది. బీసీల జనాభా లెక్కించకూడదన్న నిర్ణయం దుర్మార్గమని పేర్కొంది. అనంతపురం జిల్లా కదిరిలో గురువారంనాడు "ఆంధ్ర బహుజన ప్రజావేదిక" ఆధ్వర్యంలో నిర్వహించిన "ప్రెస్ మీట్" నందు రాష్ట్ర నాయకుడు కె.ఆర్ హరిప్రసాద్ బహుజన్ మాట్లాడుతూ దేశంలో బీసీ కులాల జనాభా ఎంత ఉన్నదో లెక్కించాలని స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి బీసీ కులాల వారు డిమాండ్ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం అదేపనిగా ఈ అంశాన్ని పక్కన పెట్టి, బీసీల అభివృద్ధిని అడ్డుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడున్న గౌరవ ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారు 2014 ఎన్నికలకు ముందు, ఆ తర్వాత తనకు సమస్యలు వచ్చినప్పుడల్లా నేను బీసీ వర్గానికి చెందిన వాడినని చెప్పుకోవడం వలన 2021 జనగణన సమయంలో బీసీల జనాభా కులాల వారిగా గణన చేయడం జరుగుతుందని బీసీ కులాల వారు ఆశపడడం జరిగింది.

కాని వారి ఆశలను వమ్ము చేస్తూ "జనాభా లెక్కల్లో ఎస్సీలు,ఎస్టీలు తప్ప ఇతర కులాల జనాభాను లెక్కించారాదని కేంద్ర బిజెపి ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ గారి ద్వారా లోక్ సభకు తెలియ చెప్పడం దుర్మార్గం". దీనిని తీవ్రంగా ఖండిస్తూ, మీ నిర్ణయాన్ని మార్చుకొని బీసీ జనాభాను కులాల వారిగా లెక్కించాలని డిమాండ్ చేస్తున్నాం.


              బ్రిటిష్ వారి పాలనలో 1931 వరకు బీసీ జనాభా గణన జరిగింది.1941లో రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా జనాభా గణన జరగలేదు.1951 జనాభా గణన నాటికి బ్రిటిష్ వారి పాలనలోని తెల్లదొరల పాలన పోయి, మన దేశంలోని కుల, మత, దోపిడి, కబ్జా, దౌర్జన్య దారుల పార్టీల నల్లదొరల పాలన వచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు బీసీ జనాభా గణన చేయకుండా కుట్ర పన్నుతూ బీసీలను పచ్చిగా మోసం, దగా చేయడం జరుగుతావుంది. ఎందుకంటే బీసీ జనాభా గణన చేస్తే బీసీల జనాభా ఎంత ఉందో తెలుస్తుంది. ఆమేరకు బీసీలు రాజ్యాధికారంలో వాటాతోపాటు, హక్కులు, అధికారాలు, రాయితీలు, రిజర్వేషన్లు తదితర సదుపాయాలన్నింటిని తమ జనాభా దామాషా ప్రకారం డిమాండ్ చేస్తారనే కుట్ర పూరిత నిర్ణయం తీసుకోవడం జరిగింది.

         "వచ్చే జనగణనలో కులాల వివరాలను సేకరించాలని మహారాష్ట్ర, ఒడిశా ప్రభుత్వాలు కోరితే రాజ్యాంగ నిబంధనల్ని అనుసరించి, లోక్ సభ, అసెంబ్లీలో ఎస్సీలు, ఎస్టీలకు కేటాయించిన సీట్లు వారి జనాభా కనుగుణంగా ఉండాలనే ఎస్సీ, ఎస్టీల జనగణనకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని" అంటున్నారు. దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని రాజకీయ పార్టీలు మహారాష్ట్ర, ఒడిశా ప్రభుత్వాల మాదిరిగా డిమాండ్ చేసి ఉంటే కచ్చితంగా బీసీ జనగణన జరిగి ఉండేది. ఈ మేరకు వైసీపీ ప్రభుత్వం, మా పార్టీ బీసీల పార్టీ అంటూ చెప్పుకొంటున్న టీడీపీ ఎందుకు కేంద్రాన్ని కొరలేదని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.

2010లో సుప్రీంకోర్టు జనాభా లెక్కలు అధికారికంగా ఏ వర్గం వారికి ఉన్నా, వారి జనాభా దామాషా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లు కల్పించ వచ్చును అని తీర్పు చెప్పింది. మరి కేంద్ర బిజెపి ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జనగణన చేయాలి కదా? ఆ పని మాత్రం చేయదు. కాని దేశంలో అగ్రకులాల వారి జనాభా ఎంత ఉన్నదో తెలియకపోయినా ఆర్థికంగా వెనుకబడిన పేద అగ్రకులాల వారి పేరుతో అగ్రకులాల వారికి 10శాతం విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించింది. ఇందుకు ఎలాంటి కమిటీ వేయకుండా, సమగ్రమైన చర్చ జరపకుండా 103వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటులో ఒక రోజులోనే లోక్ సభలో బిల్లును ప్రవేశపెట్టడం, ఆమోదింపచేయడం. రెండవ రోజు రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టడం, ఆమోదింపచేయడం, ఆ వెంటనే రాష్ట్రపతి గారితో సంతకం పెట్టించి చట్టబద్ధత కల్పించి గెజిట్ లో పెట్టించడం జరిగింది. ఇవి అన్ని గమనిస్తే గౌరవ ప్రధాని మోడీ గారు బీసీల ఓట్ల కోసమే నేను బీసీనని చెప్పుకుంటున్నారు తప్ప బీసీలకు చేసింది శూన్యం. బీసీల నుంచి వచ్చిన వ్యక్తిగా చెప్పుకొంటున్న గౌరవ మోడీ గారు బీసీల అభివృద్ధిని అడ్డుకోవడం దుర్మార్గం. బీసీల మీద కక్ష్య ఉంటే సహృదయంతో వదులుకొని బీసీ కులాల జనగణన చేసి వారి అభివృద్ధికి సహకరించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు అంపావతిని గోవిందు, కదిరి నియోజకవర్గం కన్వీనర్ యాటగిరి ప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్.లక్ష్మన్న, కె.ఆర్.హరిప్రసాద్, కదిరి టౌన్ కమిటీ కో-కన్వీనర్లు డేరంగుల భాస్కర్, చారుపల్లి ఆంజనేయులు, కదిరి టౌన్ కమిటీ మాజీ కన్వీనర్ వెంకటేశ్వరగౌడ్, నిజామోద్దీన్, కుటాగుళ్ల రామన్న, నరసింహులు, చౌడప్ప, కుల్లాయప్ప, మొటుకుపల్లి రమణ తదితరులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: