వాటర్‌ గ్రిడ్ పథకం ద్వారా వెలిగొండ నుంచి తాగునీరు

సీఎం జగన్ నిర్ణయంతో ఫ్లోరైడ్ సమస్య అంతం

యుద్ధప్రాతిపదికన వెలిగొండ పనులు

వైసీపీ నేత డాక్టర్ ఏలూరి రామ చంద్రారెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

ప్రకాశం జిల్లాకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కృషి చేస్తోందని వైకాపా రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి చెప్పారు. వాటర్ గ్రిడ్ పథకం ద్వారా తాగునీరు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని అన్నారు. పశ్చిమ ప్రకాశం జిల్లాకే మణిహారంగా మారిన వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే రూ.1800 కోట్లతో జిల్లాలోని మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి వంటి కరువు ప్రాంతాలకు వాటర్‌ గ్రిడ్ పథకం ద్వారా తాగునీరు అందుతుందని ఏలూరి వెల్లడించారు. ఇప్పటికే రూ. 45 కోట్లతో వెలిగొండ ప్రాజెక్టు వద్ద చేపట్టిన ఇంటెక్ వెల్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని.. దీని ద్వారా ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రతి మనిషికి రోజుకు వంద లీటర్ల చొప్పున తాగునీరు అందుతుందని తెలిపారు. 

వాటర్ గ్రిడ్ పనులు ఈ ఏడాది చివరికల్లా పూర్తవుతాయని అంచనా వేసిన ఏలూరి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా పశ్చిమ ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య అంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక వెలిగొండ ప్రాజెక్టును ఎప్పుడో పూర్తి కావాల్సి ఉందన్న ఆయన.. వైఎస్ఆర్ మరణానంతరం ఎవరూ ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదని.. తద్వారా ఎందరో రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.. జననేత జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టుకు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయిస్తున్నందుకు రైతు బిడ్డగా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతగా ఎంతో సంతోషిస్తున్నాని డాక్టర్ రామచంద్రారెడ్డి అన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: