భారత రత్న క్విట్ ఇండియా ఉద్యమ వీరనారి...

అరుణా ఆసిఫ్ అలీ జయంతి 


(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)

అనంతపురం జిల్లా హిందూపురం. పట్టణం లో ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఉమర్ ఫారూఖ్ ఖాన్ అధ్యక్షత న ఆర్టీసీ కాలనీ లోని కార్యాలయంలో  ఘనంగా అరుణా అసిఫ్ అలీ జయంతి కార్యక్రమాన్ని జరుపుకున్నారు మాతృభూమి కోసం త్యాగాలు చేసిన త్యాగధనులను కీర్తించి వారి ని మార్గదర్శకులుగా చేసుకొని దేశ సుస్థిరత జాతీయ సమైక్యత దేశభక్తి దేశం కోసం త్యాగాలు చేయటం యువత ముస్లిం సామాజిక వర్గం ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు ఉమర్ ఫారూఖ్ ఖాన్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర్యోద్యమ నాయకురాలు. 1942లో గాంధీజీ జైలుకెళ్ళినపుడు క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించిన మహిళ. క్విట్ ఇండియా ఉద్యమకాలంలో బొంబాయిలోని గవాలియా టాంకు మైదానంలో భారత జాతీయపతాకాన్ని ఎగురవేసిన మహిళగా చిరస్మరణీయురాలు. ఢిల్లీ నగరానికి మెట్టమొదటి మేయర్. ఈమెకు మరణానంతరం భారతరత్న అవార్డు లభించింది. వివాహము తర్వాత అరుణ భారత జాతీయ కాంగ్రేసులో క్రియాశీలక సభ్యురాలై ఉప్పు సత్యాగ్రహములో నిర్వహించిన బహిరంగ ప్రదర్శనలలో పాల్గొన్నది. ఈమెను దేశదిమ్మరి అనే అభియోగము మోపి అరెస్టు చేశారు. అందువల్ల రాజకీయ ఖైదీలందరి విడుదలకు తోడ్పడిన గాంధీ-ఇర్వింగ్ ఒప్పందముతో 1931లో ఈమెను విడుదల చేయలేదు. అరుణతో పాటు ఖైదులో ఉన్న ఇతర మహిళా ఖైదీలు అరుణను విడుదల చేసేవరకు జైలును వదిలి వెళ్ళేది లేదని పట్టుబట్టారు. మహాత్మా గాంధీ కలుగజేసుకోవటంతో కానీ వీరు తమ పట్టును సడలించలేదు. ఆ తరువాత ప్రజాఆందోళన వలన ఈమెను విడుదల చేశారు. 1932లో తీహార్ జైళ్ళో రాజకీయ ఖైదీగా ఉండగా అరుణ జైల్లో రాజకీయ ఖైదీల పట్ల చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా నిరాహారదీక్ష నిర్వహించింది. ఈమె ప్రయత్నం ఫలితంగా తీహర్ జైళ్లో రాజకీయ ఖైదీల పరిస్థితి మెరుగైంది కానీ ఈమెను అంబాలా జైలుకు  తరలించి ఒంటరి ఖైదులో ఉంచారు.

 


జైలునుండి విడుదలైన తర్వాత ఈమె రాజకీయాలలో పాల్గొనలేదు.ఈమె అసమాన ధైర్య సాహసాలు అంకిత భావం అనేక అవార్డులు వరించుటకు కారణం అయ్యాయి1964 లో లెనిన్ అంతర్జాతీయ బహుమతి  శాంతి బహుమతి 1987 ఇందిరాగాంధీ జాతీయ పురస్కారం 1991 నెహ్రూ జాతీయ పురస్కారం 1992 లో పద్మవిభూషణ్ 1996 అత్యున్నత భారత రత్న పురస్కారం మరణానంతరం .1998లో గౌరవార్థం మూడు రూపాయల తపాలా బిళ్ళ స్టాంపును విడుదల చేసింది ఈమె జయంతిని కుల మతాలకు అతీతంగా భారతీయులందరూ జరుపు కోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో విశ్రాంత ఈ ఎస్ ఐ వైద్యశాల అధికారి ఉబేదుల్లా హుసేనీ.హ్యూమనిజo అధ్యక్షులు అజ్మతుల్లా. అల్ హింద్ అధ్యక్షులు ముజాహిద్.టిప్పు సుల్తాన్ నౌజవాన్ అధ్యక్షుడు అబ్దుల్ మాలిక్.జుబేర్.ఉమర్.అతీక్ తదితరులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: