జమాఆతె ఉలుమాయె హింద్ ఆధ్వర్యంలో,,,

నలుగురు పేద వధువులకు బీరువాలు వితరణ


(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

జమాఆతె ఉలుమాయె హింద్ నంద్యాల శాఖ ఆధ్వర్యంలో నలుగురు పేద వధువులకు వివాహ కానుకగా బీరువాలు , పవిత్ర ఖురాన్ గ్రంధాలు బహుకరించారు. సంస్థ అధ్యక్షులు మౌలానా ఖలీల్ అహమ్మద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నంద్యాల మార్కెట్ యార్డు ఛైర్మన్ ముహమ్మద్ ఇసాఖ్ బాషా, ముస్లిం జేఏసి కన్వీనర్ మరియు జమాతే ఇస్లామి అధ్యక్షులు అబ్దుల్ సమద్ ముఖ్య అతిధులుగా పాల్గొని బీరువాలు వితరణ చేసారు. కార్మక్రమంలో మౌలాన రహంతుల్లాహ్, మౌలానా మహబూబ్ బాషా, ఖాజి గులాం హుస్సేన్, మాజి కౌన్సిలర్ జాకీర్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు.

 

ఈ సంధర్భంగా ఖలీల్ మౌలానా పేదలకు కొంతవరకైనా ఆదుకోవాలని తమవంతుగా  ఈ సేవలు చేస్తున్నట్లు తెలిపారు.  ఇసాఖ్ బాషా, అబ్దుల్ సమద్, రహంతుల్లాహ్ మాట్లాడుతూ మౌలాన సేవలను అభినందించారు. నంద్యాల ముస్లిం సమాజం తరుపున మౌలానా ఖలీల్ కృషిని ప్రశంసించారు. కష్టకాలంలో ఖలీల్ గారి సహాయం పెద్ద ఉపశపనం అని అభినందించారు. ముస్లింలు కట్నకానుకలు త్యజించి ఇస్లాం ఉత్తమ పద్దతిలో నిరాండంబరంగా పెండ్లిళ్ళు సులభతరం చేయాలని హితవు పలికారు. అనంతరం ముఖ్య అతిధులు ఇసాఖ్ బాషా,అబ్దుల్ సమద్ ను శాలువతో సన్మానించారు.


,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: