ఎమ్మెల్సీ పదవి నుంచి...

తోట త్రిమూర్తులు ను భర్తరఫ్ చేయాలి

ఆంధ్ర బహుజన ప్రజావేదిక డిమాండ్


(జానోజాగో వెబ్ న్యూస్-కదిరి ప్రతినిధి)

ఎమ్మెల్సీ పదవి నుంచి తోట త్రిమూర్తులును భర్తరఫ్ చేయాలని ఆంధ్ర బహుజన ప్రజావేదిక డిమాండ్ చేసింది. అనంతపురము జిల్లా కదిరిలో "ఆంధ్ర బహుజన ప్రజావేదిక" ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర నాయకులు,కె.ఆర్ హరిప్రసాద్ బహుజన్ మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రపురం డివిజన్ లో వెంకటాయపాలెం శిరోముండనం కేసులో ఏ1 ముద్దాయి తోట త్రిమూర్తులు అని, అటువంటి ముద్దాయికి గవర్నర్ కోటాలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎం.ఎల్.సి.పదవి ఇవ్వడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే గవర్నర్ కోటా అనేది సమాజానికి ఎనలేని సేవలు చేసిన వారికి, మంచి విద్య కలిగి అపార జ్ఞానం, తెలివితేటలు, ఉన్నత భావాలు ఉన్న వారికి, క్రీడలు, సాహిత్యం తదితర రంగాల్లో ప్రావీణ్యమున్న వారికి రాజ్యాంగం శాసనమండలిలో అవకాశం కల్పించింది. వీరు చట్టసభల్లో ఉండి అర్థవంతంగా చర్చలు జరిపి ప్రజల అభివృద్ధికి మంచి చట్టాలు చేసే స్థానంలో వీరి సేవలు వినియోగించుకొనే క్రమంలో శాసనమండలిలో గవర్నర్ కోటా రూపంలో నామినేటెడ్ అవకాశాన్ని రాజ్యాంగం కల్పించింది.

కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 20ఏండ్లకుపైగా శిరోముండనం కేసులో ముద్దాయిగా ఉన్న తోట త్రిమూర్తులు కి ఎం.ఎల్.సి. పదవి ఇవ్వడమంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేయడమే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ విలువలు, విశ్వసనీయత గురించే చెబుతూ ఉంటారు. మరి ఎందుకు ముద్దాయి తోట త్రిమూర్తులు విషయంలో విలువలు, విశ్వసనీయతకు పాతర వేశారో తెలియదు. తోట త్రిమూర్తులు గతంలో చంద్రబాబునాయుడు దగ్గర ఉన్నప్పుడు మిమ్మల్ని(జగన్) తిట్టాడు, ఇప్పుడు మీ(జగన్) దగ్గర ఉన్నందున చంద్రబాబునాయుడుని తిట్టుతున్నాడు. ఎంపిక చేసేటప్పుడు ఇట్లాంటివి అనేకం గుర్తుండి కూడా చేయడం చూస్తే ఇది రాజకీయంగా దిగజారుడుతనానికి నిదర్శనంగా పేర్కొనవచ్చు. కనీసం ఇప్పటికైనా ముఖ్యమంత్రి ప్రజల్లో వస్తున్న తీవ్రమైన వ్యతిరేకతను గుర్తించి ముద్దాయి తోట త్రిమూర్తులు  ఎం.ఎల్.సి.పదవి నుంచి భర్తరఫ్ చేసి, మంచి విజ్ఞులను, నిష్ణాతులను, సేవాపరులను, ఆదర్శవంతులను ఎంపిక చేసి శాసనమండలికి హుందాతనాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం. అయితే గత టీడీపీ ఇదే విధంగా చేసింది. మేము కూడా ఇదే విధంగా చేస్తామనే అభిప్రాయం ఉంటే, 2019 ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లకు పరిమితం అయిందనే విషయాన్ని మరచి పోరాదని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాం. అని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు అంపావతిని గోవిందు, కదిరి నియోజకవర్గం కన్వీనర్ యాటగిరి ప్రసాద్, , కదిరి టౌన్ కమిటీ కో-కన్వీనర్ సి.ఆంజనేయులు, చంద్ర, నిజామోద్దీన్, నాగిరెడ్డిపల్లి రామచంద్ర, కుల్లాయప్ప, రామచంద్ర, నరసింహులు తదితరులు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 
 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: