వై.ఎస్.ఆత్మ క్షోభించేలా చేశారు

విజయమ్మ, షర్మిళ వ్యాఖ్యాలపై జి.నిరంజన్ 

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వై.ఎస్.విజయమ్మ, షర్మిళ మాట్లాడి దివంగత నేత వై.ఎస్.ఆత్మ క్షోభించేలా చేశారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ ఉపాధ్యక్షులు జి.నిరంజన్ పేర్కొన్నారు. ఒకవేళ వైఎస్సార్ బతికివుంటే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడటానికి విజయమ్మకు, షర్మిలకు అనుమతి నిచ్ఛేవారు కాదన్నారు. జి.నిరంజన్ మాట్లాడుతూ...వారు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడి వై యస్ ఆర్ ఆత్మను క్షోభింప చేశారు. వై యస్ ఆర్ తన జీవిత కాలములో కాంగ్రెస్ పార్టీ నాయకత్వము పట్ల నిబద్దతగల కాంగ్రెస్ నాయకుడిగా వ్యవహరించారు. వైయస్ఆర్ నడిచిన బాటను వీడి విజయమ్మ మాట్లాడటము భాధాకరము. వై యస్ ఆర్ మాట మీద నిలబడే వారని చెపుతున్న విజయమ్మ తాను మాత్రము జోడు గుర్రాల మీద స్వారీ చేయాలనుకోవడం ఆమె చిత్త శుద్దిని శంకింప చేస్తుంది.

వారు కాంగ్రెస్ పై చేస్తున్న ఆరోపణలు సరియైనవి కావు. కాంగ్రెస్, సోనియాగాంధి వలన ఆ కుటుంభం పొందిన లాభాన్ని మరిచి విజయమ్మ మాట్లాడటము దుర దృష్టకరం. ఒక వైపు రాజశేఖరరెడ్డి ఎదుగుదలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రొత్సహాన్ని మరుస్తూ మరొక వైపు మీ కోసము ఆయన చెసిన పనులను మరిచి పొవద్దు అని ప్రజలను కోరడము హాస్యాస్పదం. కాంగ్రెస్ పార్టీ సుధీర్ఘ చరిత్రను మరిచి విజయమ్మ, షర్మిల మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వలన ఆ కుటుంబం ఎంత లాభపడింది, కాంగ్రెస్ ఎంత లాభపడింది, ఒక మారు బేరీజు వేసుకుని ఆత్మ విమర్శ చేసుకోవాలి. వై యస్ ఆర్ మరణాంతరము కూడా కాంగ్రెస్ పార్టీ ఆ కుంటుంబానికి ఇచ్చిన గౌరవములో ఎటువంటి లోటు లేదు. ఓర్పు లేకుండా ఆ కుటుంబమే కాంగ్రెస్ పార్టీని దూరము చేసుకుంది. 1978 , 1989 లో రెండు మార్లు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు, ఎన్నికల సమయములో డాక్టర్ మర్రి చెన్నా రెడ్డి గారు పి.సి.సి అధ్యక్షుడిగా ఉండి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ 2004, 2009 లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడిన రెండు సార్లు, ఎన్నికల సమయములో వై యస్ ఆర్ పి.సి.సి అధ్యక్షుడు కాకున్నా సోనియా గాంధి, కాంగ్రెస్ పార్టీ ఆయనను ముఖ్యమంత్రిగా నియమింపజేసిందన్న విషయము మరువకూడదు. తెలంగాణా ప్రజల చిరకాల కోరిక ప్రత్యేక రాష్ట్రము. అది శ్రీమతి సోనియా గాంధీ వలన నే సాధ్యమైనదని ప్రజలకు తెలుసు. ఏ కుట్రలో భాగముగా ఈ కొత్త పార్టీ ఆవిర్బించిందో ప్రజలకు తెలుసు. ఈ కుట్రలో విజయమ్మ కూడా పాత్ర పోషించడం రాజశేఖరరెడ్డి గారికి అపఖ్యాతి తేవడమే అవుతుంది. అని ఆయన పేర్కొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: