ఆగస్టు 9 క్విట్ ఇండియా దినోత్సవాన్ని పురష్కరించుకొని

దేశ వ్యాప్తంగా సేవ్ ఇండియా పేరుతో ఆందోళనలు

సీఐటీయూ పిలుపు


(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

   ప్రకాశం జిల్లా స్థానిక తర్లుపాడు లోని బ్రహ్మంగారి గుడిలో సిఐటియు రైతు సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విధానాల నుండి భారతదేశాన్ని  రక్షించాలంటూ ఆగస్టు  9 క్విట్ ఇండియా దినోత్సవాన్ని రైతాంగ, కార్మిక వ్యతిరేక చట్టాలరద్దుకై,సేవ్ఇండియా దేశవ్యాప్త ఆందోళన  భాగంగా ప్రకాశం జిల్లా సి ఐ టి యు పచ్చిమ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు డీ కె ఎం రఫీ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రారంభిస్తున్న విధానాలు రైతాంగానికి, వ్యవసాయ కార్మికులకు, కార్మికులకు తీవ్ర నష్టం  చేకూర్చే విధంగా ఉన్నాయని విమర్శించారు. మోడీ తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు, నూతన విద్యుత్ బిల్లులు  దేశ ప్రజానీకానికి తీవ్ర నష్టం చేకూర్చే విధంగా ఉందని విమర్శించారు. గత ఏడు నెలలుగా ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి కనీసం స్పందించకుండా కేంద్ర ప్రభుత్వం   మొండిగా వ్యవహరించడం సరైన విధానం కాదని విమర్శించారు.

కార్మిక హక్కులను హరించే లేబర్ కోడ్ లను ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ  ప్రైవేటీకరణ ఆపాలని లేకపోతే ఆగస్టు  9 నా జిల్లా మండల కేంద్రాల్లో జరిగే నిరసన కార్యక్రమాల్లో రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు వై పాపిరెడ్డి, కే శ్రీనివాస్ రెడ్డి, టీ కాశిరెడ్డి, కె నాగయ్య, కోటయ్య, ఎం శ్రీనివాస్ రెడ్డి, సిఐటియు నాయకులు ఎమ్ బాలమ్మ, వై పుల్లమ్మ, సుశీల, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: