జులై 2021

వైసీపీ నేతల అరాచకాలు పెట్రేగిపోతున్నాయ్

మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి


(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

వైసీపీ నేతల అరాచకాలు పెట్రేగిపోతున్నాయని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి విమర్శించారు. శనివారంనాడు ప్రకాశంజిల్లా మార్కాపురం నియోజకవర్గం కొనకనమిట్ల మండలం లోని కొనకనమిట్ల గ్రామంలో జరిగిన మండల టిడిపి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగినది .ఈ సమావేశం నకు  ముఖ్య అతిథులుగా మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి విచ్చేసి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ కొనకనమిట్ల మండలం లో వైసిపి నాయకులు అరాచకాలు ఎక్కువయ్యాయని, ఈ మండల వైసిపి నాయకులు సొసైటీ ద్వారా రైతులకు చెల్లించవలసిన నగదును కూడా అక్రమంగా తమ సొంత అకౌంట్లకు పది కోట్ల రూపాయలు తరలించారని మరియు  మొక్కలు నాటే ఈ కార్యక్రమంలో మరో పది కోట్ల రూపాయలు సొంత ఖాతా లకు తరలించారని తెలిపారు. ఈ మండలంలో వైసిపి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని తద్వారా అమాయకుల నోట్లో మట్టి కొడుతున్నారని తెలిపారు. త్వరలోనే ఈ మండలంలో గ్రామస్థాయిలో బూత్ కమిటీలను  ఏర్పాటు చేసి పార్టీని పటిష్ట చేద్దామని తెలియజేశారు. భవిష్యత్తులో పార్టీ కార్యకర్తలు అందరూ ఐకమత్యంతో పనిచేసి పార్టీని పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు.


ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటరీ పార్టీ తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కనకం నరసింహారావు , ఒంగోలు పార్లమెంటరీ పార్టీ తెలుగుదేశం కార్యనిర్వాహక కార్యదర్శి పొల్లా  నరసింహారావు, మండల ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, నాయకులు తాండ వెంకటేశ్వర్లు,  మార్కాపూర్ పట్టణ యూత్ అధ్యక్షులు గొల్ల మారి కాశి రెడ్డి, మైనారిటి నాయకులు గులాబ్, మండల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు వందలాదిగా పాల్గొన్నారు. ఆ తర్వాత కార్యకర్తలు ర్యాలీగా తహసిల్దార్ కార్యాలయం నకు వెళ్లారు. ఆ తరువాత ప్రజా సమస్యలపై గౌరవ మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఎంపీడీవో, ఎస్ ఐ ని కలసి ప్రజాసమస్యలు తెలియజేశారు.
  

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి  విద్యా వ్యవస్ధలో పెను విప్లవం...

జగనన్న విద్యా దీవెన పథకం 

విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రెండో విడత సొమ్ము జమ

దాదాపు 10.97 లక్షల మంది విద్యార్థులకు రూ.693.81 కోట్ల విడుదల

విద్యా దీవెనతో ఇప్పటివరకు రూ.5,573 కోట్లు

అమ్మఒడి, విద్యాకానుక, మనబడి నాడు-నేడు,,ఇలా

మొత్తం రూ.26,677 కోట్లు ఖర్చు

మాజీ మంత్రి శిద్దా  రాఘవరావు వెల్లడి


(జానోజాగో వెబ్ న్యూస్-ఒంగోలు ప్రతినిధి)

విద్యా వ్యవస్ధలో పెను విప్లవం..జగనన్న విద్యా దీవెన పథకమని మాజీ మంత్రి శిద్దా  రాఘవరావు వెల్లడించారు. దాదాపు 10.97 లక్షల మంది విద్యార్థులకు రూ.693.81 కోట్ల విడుదలచేసి రెండో విడతగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమా చేయడం జరిగిందని ఆయన తెలిపారు. విద్యా దీవెనతో ఇప్పటివరకు రూ.5,573 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసిందన్నారు. అమ్మఒడి, విద్యాకానుక, మనబడి నాడు-నేడు ఈ పథకాల కింద దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ ప్రభుత్వం మొత్తం రూ.26,677 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఇంకా శిద్దా  రాఘవరావు మాట్లాడుతూ... నిరుపేద విద్యార్ధులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో దేశంలో ఎక్కడాలేని విధంగా అర్హత ఉన్న ప్రతీ విద్యార్ధికి సకాలంలో ఏ బకాయిలు లేకుండా పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్. ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికమే ఆ పిల్లల తల్లులకే చెల్లించి వారే కాలేజీలకు ఫీజులు కట్టేలా చేసి పేదల ఇంట విద్యా జ్యోతులు వెలిగిస్తున్న ప్రభుత్వం వైఎస్ జగన్ ప్రభుత్వం. ఈ ఏడాది రెండో విడతగా దాదాపు 10.97 లక్షల మంది విద్యార్ధులకు రూ. 693.81 కోట్లను సీఎం  వైఎస్ జగన్ జమ చేశారు.. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్ధులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని ప్రతీ త్రైమాసికానికి (మూడు నెలలు) ఒకసారి విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తుంది.

  వైఎస్ జగన్ ప్రభుత్వం. జగనన్న విద్యా దీవెన – నాలుగు విడతలు, మొదటి విడత – ఏప్రిల్ 19, రెండవ విడత – జులై 29, మూడవ విడత – డిసెంబర్, నాలుగవ విడత – ఫిబ్రవరి 2022. లబ్దిదారులు – 1,62,75,373, లబ్ది (రూ. కోట్లలో) – 26,677.82. విద్యారంగంపై ఇప్పటివరకు చేసిన ఖర్చు ఈ రూ. 26,677.82 కోట్లే కాకుండా నాడు – నేడు పథకం క్రింద ప్రీప్రైమరీ స్కూళ్ళుగా మారబోతున్న అంగన్వాడీలలో పిల్లలు, తల్లుల పోషకాహారం కోసం వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా ఏటా మరో రూ. 1,800 కోట్ల వ్యయం కూడా చేస్తుంది  వైఎస్ జగన్ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో జరిగిన విధంగా ఫీజులకు అరకొర మొత్తాలు విదిలించి చేతులు దులుపుకోవడం, అదీ సరైన సమయంలో ఇవ్వకపోవడం వంటి చర్యలకు స్వస్తి చెబుతూ, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 1,774.60 కోట్ల బకాయిలతో సహా మొత్తం రూ. 4,207.85 కోట్లు జమ. ఈ ఏడాది ఏ బకాయిలకు తావులేకుండా పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ను పెంచి ఏప్రిల్లో మొదటి విడతగా రూ. 671.45 కోట్లు, నేడు రెండో విడతగా దాదాపు రూ. 693.81 కోట్లతో కలిపి ఇప్పటివరకు నేరుగా అందించిన మొత్తం రూ. 5,573.21 కోట్లు.. జగనన్న వసతి దీవెన పథకం ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్ధులకు రూ. 10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్ధులకు రూ. 15 వేలు, డిగ్రీ ఆపై కోర్సులు అభ్యసించే వారికి రూ. 20 వేల చొప్పున వసతి, భోజన ఖర్చుల కొరకు, కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికి, వారి తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం. జగనన్న వసతి దీవెన – మొదటి విడత – ఏప్రిల్ 28, రెండో విడత – డిసెంబర్ లో. అని ఆయన పేర్కొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

 రెండోవ వైస్ ఛైర్మన్ గా..

 కుమ్మరి అంజలిదేవి ఎన్నిక

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ పురపాలక సంఘ కార్యాలయంలో శుక్రవారంనాడు వైస్ ఛైర్ పర్సన్ ఎన్నిక సందర్భంగా స్పెషల్ కలెక్టర్ సరళ వందనం  ఆధ్వర్యములో, మార్కాపుపం నియోజక వర్గం ఎం.ఎల్.ఎ. కుందూరు నాగార్జున రెడ్డి, పురపాలక కమీషనర్ నయీమ్ అహమ్మద్, ఛైర్మన్ బాల మురళీకృష్ణ, వైస్ ఛైర్మన్    షేక్. ఇస్మాయిల్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికలలో 12వ వార్డు కౌన్సిలర్ కుమ్మరి అంజలిదేవి w/o కుమ్మరి శ్రీనుని రెండవ వైస్ ఛైర్మన్ గా పురపాలక సంఘం  కౌన్సిలర్ల సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది.

 


ఈ సందర్భంగా అంజలిదేవి మాట్లాడుతూ పురపాలక సంఘ సిబ్బందితో పాటు తమకు సహకరించి నన్ను ఈ స్ధాయికి కారణమైన 12వ వార్డు ప్రజలందరికి కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమములో  కుమ్మరి హరి, షేక్. వదూద్,షేక్ రఫీ,గఫూర్, రచనమ్మ, నూర్జహాన్ , మహబూబ్బి మహిళలతో పాటు వార్డు ప్రజలు మరియు పురపాలక సిబ్బంది, పలువురు శుభాకాంక్షలు తెలిపారు. 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

 కచ్చితంగా ఘన విజయం 

సాధించే చిత్రం క్షీరసాగర మథనం

-స్టార్ ప్రొడ్యూసర్ శరత్ మరార్


(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

    హైలీ టాలెంటెడ్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అనిల్ పంగులూరి దర్శకత్వంలో రూపొందిన 'క్షీర సాగర మథనం' కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని అన్నారు ప్రముఖ నిర్మాత శరత్ మరార్. ఈ చిత్రాన్ని తాను చూశానని... దర్శకుడిగా అనిల్ పంగులూరికి ఉజ్వల భవిష్యత్ ఉందని మరార్ అభిప్రాయపడ్డారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 6... థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న "క్షీర సాగర మథనం" చిత్రం ట్రైలర్ శరత్ మరార్ విడుదల చేశారు.

     మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల తాలూకు భావోద్వేగాలను తెరకెక్కిస్తూ రూపొందిన ఈ చిత్రంలో మానస్ నాగులపల్లి, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా నటించారు. అక్షత సోనావని హీరోయిన్ కాగా ప్రదీప్ రుద్ర  ప్రతినాయకుడు. శ్రీ వెంకటేశ పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. 

    చిత్ర దర్శకుడు అనిల్ పంగులూరి మాట్లాడుతూ.. మా చిత్రానికి మోరల్ గా ఎంతో సపోర్ట్ చేస్తున్న శరత్ మరార్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఆయన చేతుల మీదుగా మా "క్షీర సాగర మథనం" ట్రైలర్ రిలీజ్  కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆగస్టు 6న థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.

     చరిష్మా శ్రీకర్, గౌతమ్ శెట్టి, ప్రియాంత్, మహేష్, అదిరే అభి, శశిధర్, ఇందు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ వినూత్న కథాచిత్రానికి ప్రచార రూపకల్పన: డిజైన్ ఐ.డి, పోరాటాలు: వింగ్ చున్ అంజి, పాటలు: శ్రీమణి-వశిష్ఠ శర్మ-వి.ఎన్.వి.రమేష్ కుమార్, సంగీతం: అజయ్ అరసాడ, ఛాయాగ్రహణం: సంతోష శానమోని, కూర్పు: వంశీ అట్లూరి, సహ-దర్శకుడు: కిషోర్ కృష్ణ, పీఆర్వో: ధీరజ అప్పాజీ, సహనిర్మాత: మురళీకృష్ణ దబ్బుగుడి, నిర్మాణం: ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్, రచన-దర్శకత్వం: అనిల్ పంగులూరి!!

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

 వైసీపీకి, డిఎంకె కి మధ్య ఉన్న తేడాను తెలుసుకొని

బహుజన రాజ్యాధికారాన్ని సాధించుకొందాం

ఆంధ్ర బహుజన ప్రజావేదిక

(జానోజాగో వెబ్ న్యూస్-పుట్టపర్తి ప్రతినిధి)

వైసీపీకి, డిఎంకె కి మధ్య ఉన్న తేడాను తెలుసుకొని బహుజన రాజ్యాధికారాన్ని సాధించుకొందామని ఆంధ్ర బహుజన ప్రజావేదిక పిలుపునిచ్చింది. అనంతపురం జిల్లా, పుట్టపర్తి నియోజకవర్గం, నల్లమాడ మండల కేంద్రం నందు స్థానిక బహుజన నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన "ప్రెస్ మీట్" నందు రాష్ట్ర నాయకుడు కె.అర్ హరిప్రసాద్ బహుజన్ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో పాలన చేస్తున్న వైసీపీకి, తమిళనాడులో ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన డిఎంకె కి మధ్య ఉన్న తేడాలను సభ్యసమాజం, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలైన బహుజనులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే తమిళనాడులో గౌరవ స్టాలిన్ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన డిఎంకె  34 మందితో రాష్ట్ర మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేస్తే అందులో బీసీలకు-22, ముస్లింలకు-2, ఓసీలకు-6, ఎస్సీలకు-3, ఎస్టీలకు-1 చొప్పున చోటు కల్పించడం జరిగింది. ఇది దాదాపు ఎవరి జనాభా దామాషా ప్రకారం వారికి ఇవ్వడం జరిగిందని చెప్పవచ్చు. ఇది ఎట్లా సాధ్యమైందంటే డిఎంకె పార్టీ బహుజనులకు సంబంధించినది అయినందువలననే. ఆంధ్రప్రదేశ్ లో గౌరవ వైఎస్.జగన్ మోహన్ రెడ్డి గారి  నాయకత్వాన ఏర్పడిన వైసీపీ మంత్రివర్గంలో, గత టీడీపీ మంత్రివర్గం కంటే ఒకటో, రెండో ఎక్కువ మంత్రి పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలైన బహుజనులకు ఇచ్చి, 60శాతం మంత్రి పదవులు బహుజనులకు ఇచ్చినాం. మేము(వైసీపీ) ఇచ్చినంత దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వలేదని గ్లోబెల్ ప్రచారం తన సొంత మీడియా ద్వారా చేసుకోవడం జరిగింది. కాని పదవులు ఇచ్చిన మేరకు స్వతంత్రంగా ఆ పదవికి ఉన్న అధికారాన్ని కూడా వినియోగించుకొనివ్వకుండా రెడ్లు మొత్తం అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం జరుగుతావుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి రాజు, రాష్ట్రాన్ని మూడు సామంతు రాజ్యాలుగా ఏర్పాటు చేసి, ఈ మూడు సామంతు రాజ్యాలకు తమ రెడ్డి కులానికి చెందిన విజయసాయిరెడ్డి గార్ని, సజ్జల రామక్రిష్ణారెడ్డి గార్ని, వై.వి.సుబ్బారెడ్డి గారు లను సామంతు రాజులుగా నియమించుకొని మొత్తం అధికారాన్ని తమ గుప్పెట్లో పెట్టుకొని పరిపాలన చేయడం జరుగుతావుంది. దీని ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపి, మంత్రి, తదితర పదవులకు ఉన్న అధికారాలన్నింటిని సామంతురాజులు లాక్కొని, వారు(సామంతురాజులు) ఇచ్చే డైరెక్షన్ మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపి, మంత్రి, తదితర పదవులున్నవారు నడుచుకోవడం జరుగుతావుంది. ఇది పచ్చి నిజం. నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చట్టం తెచ్చిన మేరకు అమలు చేయలేదు. కేవలం మార్కెట్ యార్డు కమిటీ, దేవాలయాల కమిటీల్లో కొంత మేరకు అమలు చేసినా, చట్టం తెచ్చిన మేరకు రాష్ట్రంలో ఉన్న నామినేటెడ్ కీలకమైన పదవులు, రాష్ట్ర సంపద, గౌరవం లభించే పదవుల్లో బహుజనులకు పూర్తిగా అమలు చేయలేదు.

రాష్ట్రంలో 4శాతం జనాభా ఉన్న రెడ్లకు దాదాపు 850 పైగా కీలకమైనవి, రాష్ట్ర సంపద, గౌరవం లభించే నామినేటెడ్ పదవులను ఇచ్చుకోవడంతోపాటు, విశ్వవిద్యాలయాల సెర్చ్ కమిటీల్లో రెడ్లే, వాళ్లను ఎంపిక చేసే వాళ్లు రెడ్లే, హైకోర్టులో జీపీలను, న్యాయవాదుల్ని నియమిస్తే అంతా రెడ్లే. వీటి అన్నింటినీ సమాజానికి తక్కువ చేసి చూపే ప్రయత్నంలో భాగమే రాష్ట్రంలో 56శాతం జనాభా ఉన్న 139 బీసీ కులాలకు 56 కులాల కార్పొరేషన్లను సృష్టించి 728 చైర్మన్, డైరెక్టర్ల పదవులను ఎవరి కుల పరిధిలో వారికి ఇవ్వడం జరిగింది. 109 జీ.ఓ.ప్రకారం 56 బీసీ కులాల కార్పొరేషన్లలో కొంత మంది చైర్మన్లకు ₹ 56వేలు, డైరెక్టర్లకు ₹ 12వేలు, మరి కొంత మంది చైర్మన్లకు ₹ 65వేలు, డైరెక్టర్లకు ₹ 14వేలు అన్ని అలవెన్సులు కలుపుకొని వేతనాలు ఇవ్వడం జరుగుతుందని తన సొంత మీడియా ద్వారా పెద్ద ప్రచారం చేసి చెప్పడం జరిగింది. కాని ఇదే రాష్ట్రంలో దాదాపు 850 పైగా నామినేటెడ్ పదవులకు నియమితమైన రెడ్లకు మాత్రం దాదాపు అన్ని అలవెన్సులు కలుపుకొని ₹ 3లక్షలు డ్రా చేస్తున్నారని ఒక అంచనా ఉంది. కాని వీరికి సంబంధించిన వేతనాలను గురించి మాత్రం ఏ మీడియా ప్రచారం చేయలేదు. వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి గారు ఫోన్ లో వెంగలమ్మచెరువు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుతూ వైసీపీ మన రెడ్ల పార్టీ, ఈ పార్టీకి నువ్వు లోకల్, నేను లోకల్. ప్రస్తుత  మంత్రి శంకరనారాయణ గారు బాడుగకు వచ్చినాడు, మనందరితో బాగుంటే ఉంటాడు, వైసీపీ 52 మంది రెడ్లకు టికెట్లు ఇస్తే 51 మంది రెడ్లము గెలిచాము. ఇందుకు అన్ని వర్గాల వారు ఓట్లు వేసినారు అంటూనే వైసీపీ మా రెడ్ల పార్టీ అని ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి గారు బహిరంగంగా చెప్పడం మనందరికీ తెలిసిందే. అగ్రకుల రాజకీయ పార్టీలు టిక్కెట్లు ఇచ్చేటప్పుడు మొదట బీసీలకు ఇన్ని సీట్లు ఇచ్చినామంటారు. ఆ తర్వాత మీ కులానికి ఇన్ని సీట్లు ఇచ్చినామంటారు. ఆ విధంగానే రాష్ట్రమంతటా ప్రచారం చేసి ఈ వర్గాలతో ఓట్లు వేయించుకొంటారు. గెలిచిన తర్వాత ఆ ఎంపీ లేదా ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో కాకుండా ఇతర నియోజకవర్గాల్లో ఉన్న తమ కులపొలకు ఏవైనా సమస్యలపై సహాయం చేయడానికి ముందుకు వస్తే, నీవు నీ నియోజకవర్గంలో చూసుకోవాలని అంటారు. అదే రెడ్డి, కమ్మ ప్రజాప్రతినిధులు ఏ నియోజకవర్గంలోనైనా వారి కులపోలకు అన్ని పనులు చేసి పెట్టడం జరుగుతావుంది, ఇది వారు మాట్లాడిన వీడియోలే స్పష్టం చేస్తున్నాయి. తమకు అధికారం ఉందనే అహంకారంతో అనంతపురం జిల్లా కలెక్టరు గారిని, నెల్లూరు జిల్లా ఎస్పీ గారిని రెడ్డి ఎమ్మెల్యేలు బహిరంగంగానే దుర్భాషలాడడం జరిగింది. ఇక రాష్ట్రంలో సామాన్యమైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలైన బహుజనుల స్థితిగతులు ఎంత ఘోరంగా ఉన్నాయో అనేది ఈ ఇరవై ఆరు నెలల పాలనా కాలంలో జరిగిన అనేక సంఘటనలే తెలుపుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వం కూడా మా పార్టీ బీసీల కోసమే పుట్టింది. కనుక మా పార్టీ బీసీల పార్టీ, మా ప్రభుత్వం బీసీల ప్రభుత్వం అంటూనే రాష్ట్రంలో ఉన్న నామినేటెడ్ పదవుల్లో అన్ని కీలకమైన పదవులను, రాష్ట్ర సంపదను దోచే పదవులను కేవలం తన కమ్మ కూలనికే ఇచ్చుకోవడం జరిగింది. దీనివలననే 2019 ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లకు పరిమితమైందని గట్టిగా చెప్పవచ్చు. వీటి అన్నింటి నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలైన బహుజనులు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఎవరి కుల పార్టీ అధికారంలో ఉంటే వారు, వారి కులపొలకే అన్ని చేసుకోగలుగుతున్నారు. బహుజనుల నాయకుడు గౌరవ స్టాలిన్ గారి నాయకత్వాన డిఎంకె పార్టీ తమిళనాడులో అధికారంలోకి వచ్చినందున అన్ని కులాలవారికి దాదాపు వారి జనాభా దామాషా ప్రకారం మంత్రి పదవులు లభించాయి. కనుక ఆంధ్రప్రదేశ్ లో బహుజన రాజ్యాధికార సాధన కోసం "ఆంధ్ర బహుజన ప్రజావేదిక" ఆధ్వర్యంలో కృషి చేయడం జరుగుతావుంది. కావున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యావన్మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అభ్యుదయ భావాలున్న వారందరూ మాతో కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తూ పిలుపునిస్తున్నాం. ఈ కార్యక్రమంలో కొత్తచెరువు మాజీ జడ్.పి.టి.సి.గఫార్,పుట్టపర్తి నియోజకవర్గం కన్వీనర్ కప్పల రవి, కదిరి నియోజకవర్గం కన్వీనర్ యాటగిరి ప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.ఆర్.హరిప్రసాద్ బహుజన్ , పుట్టపర్తి నియోజకవర్గం కో-కన్వీనర్ వి.రవియాదవ్, వళ్ళం రమేష్, ఎస్.ఓబులేసు, ఉద్దండం సుధాకర్, రాము, బండా తిరుపాలు, కె.వెంకటరమణ, అశోక్ నాయుడు, శ్రీరాములు, అంజినప్ప, ఆదినారాయణ, భైరవ, శ్రీరాములు, ఉత్తన్న, రామచంద్ర(మట్టి), నాగరాజు, వై.లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

                                 

 'ఒకే ఒక లోకం' సినిమా విజయం సాధించాలి 

- ఒంగోలు సంతపేట సాయిబాబా మందిరం లో లాంఛనంగా ప్రారంభమైన సినిమా షూటింగ్ 

- క్లాప్ కొట్టిన యువ నేత బాలినేని ప్రణీత్ రెడ్డి


(జానోజాగో వెబ్ న్యూస్-ఒంగోలు ప్రతినిధి)

'ఒకే ఒక లోకం' సినిమా పెద్ద విజయం సాధించాలని వైసిపి యువ నేత బాలినేని ప్రణీత రెడ్డి ఆకాంక్షించారు. ప్రకాశం బుల్స్ ఆర్ట్ ప్రొడక్షన్స్ నేతృత్వంలో కొరిటాల సాయి సమర్పణలో ఒకే ఒక లోకం సినిమా ఒంగోలు సంతపేటలోని సాయి బాబా మందిరంలో లాంఛనంగా ప్రారంభమైయ్యింది. మంత్రి బాలినేని తనయుడు బాలినేని ప్రణీతరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టారు. ఆలయ వేద పండితులు మఠంపల్లి దక్షిణామూర్తి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొద్ది సేపు యూనిట్ తో ప్రణీత్ రెడ్డి సినిమా గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రణీత్ రెడ్డి మాట్లాడుతూ 'ఒకే ఒక లోకం' సినిమా గొప్ప విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఒంగోలులో యువతకు మంచి మెసేజ్ ఇచ్చే చిత్రం ఒంగోలులో ప్రారంభం కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. షూటింగకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్న తాము అండగా ఉంటామని తెలియజేశారు.

సినిమా దర్శకులు విష్ణు నారాయణ మాట్లాడుతూ నాకు దర్శకుడిగా అవకాశం కల్పించిన కోరిటాల సాయి, రచయిత కృష్ణారెడ్డికు కృతాజ్ఞతలు తెలియజేశారు. ఇది కాలేజీ లవ్ బ్యాక్ గ్రౌండ్ స్టోరీ అని వివరించారు. చాలా చక్కగా సనిమా ఉంటుందని తెలిపారు. రచయిత కృష్ణారెడ్డి మాట్లాడుతూ రెండు సంవత్సరాలు కష్టపడి తయారు చేసిన కథ అని పేర్కొన్నారు. అద్భుతంగా సినిమా ఉంటుందని తెలిపారు. నిర్మత సాయి కుమార్ మాట్లాడుతూ ఈ సినిమా తీయడానికి ఖర్చుకు వెనుకాడబోమని అన్నారు. గొప్పగా తీస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో హిరోలుగా కార్తీక్, యశ్వంత్ నటిస్తున్నారు. స్కిన్ ప్లే, దర్శకత్వం వై. విష్ణు నారాయణ, హసీనా, నవ్య, శ్రావణీ హిరోయిన్లుగా షకీలా, జీ.కె రెడ్డి విలన్గా నటిస్తున్నారు. కెమేరా మెన్లు ఇ. ప్రకాష్, ఎస్.కె బాబు, పాటలు కిల్లి గిరిజా, కథ - మాటలు కూతుళ్ళ క్రిష్ణారెడ్డి, మ్యాజిక్ భరత్ (కర్నాటక) అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వైపిసి నాయకులు బాలిశెట్టి నాగేశ్వరరావు, నేటి దినపత్రికా సూర్య జిల్లా బ్రాంచ్ మేనేజర్ గొట్టిపాటి నాగేశ్వరరావు, తదితరులు ఉన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

 ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ 

అధ్యక్షుడు ప్రభును అభినందించిన

నరసింహపురం చిత్ర బృందం!!

 "ఈ అభినందన మా కార్యవర్గ సభ్యులందరికీ"     -ప్రభు


(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)  

     జులై 30న విడుదలవుతున్న ఫ్యామిలీ ఓరియంటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'నరసింహపురం' చిత్ర బృందం ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు ప్రభును అభినందించింది. ఈ చిత్రం ప్రివ్యూ సందర్భంగా ప్రభును శాలువాతో సత్కరించారు. ఎంతో ఫ్యాషన్ తో.. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి రూపొందిన 'నరసింహపురం' ఘన విజయం సాధించాలని ప్రభు ఆకాంక్షించారు. ఈ అభినందన తమ కొత్త కార్యవర్గం అందరికీ చెందుతుందని పేర్కొన్నారు. 

     మూడోసారి ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రభు సారధ్యంలోని కొత్త కార్యవర్గం మరింత మంచి పేరు తెచ్చుకోవాలని చిత్ర కథానాయకుడు నందకిషోర్, దర్శకుడు శ్రీరాజ్ బళ్లా, నిర్మాత ఫణిరాజ్ గౌడ్, సంగీత దర్శకుడు ఫ్రాంక్లిన్ సుకుమార్ కోరుకున్నారు. జులై 30 న 'నరసింహపురం' చిత్రం తప్పకుండా అందరికీ నచ్చుతుందని తెలిపారు.

     కల్యాణ మాధవి, లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫేమ్ విజయ్ కుమార్, అరవిందసమేత ఫేమ్ రంగధామ్, రవివర్మ బళ్ళా, సంపత్, ఫణిరాజ్, స్వామి, శ్రీకాంత్, శ్రీకర్, శివ, జునైద్, గిరిధర్, సాయిరాజ్ ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, మేకప్: కె.వి.బాబు, పబ్లిసిటీ డిజైన్స్: వెంకట్.ఎం, విఎఫెక్స్: చందు ఆది, కెమెరా: కర్ణ ప్యారసాని, ఎడిటింగ్ & డి.ఐ: శివ వై.ప్రసాద్, 5.1 మిక్సింగ్: రమేష్ కామరాజు, పాటలు: గడ్డం వీరు, సంగీతం: ఫ్రాంక్లిన్ సుకుమార్, నిర్మాతలు: శ్రీరాజ్ బళ్ళా- టి.ఫణిరాజ్ గౌడ్-నందకిశోర్ ధూళిపాల, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీరాజ్ బళ్ళా!!

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

 ప్రజాధనంతో ఎన్నికల్లో లబ్ధికి యత్నాలు

కాంగ్రెస్ నేత జి.నిరంజన్ విమర్శ

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

ప్రజాధనంతో అధికార టి.అర్.ఎస్ పార్టీ హుజూరాబాద్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తోందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ ఉపాధ్యక్షులు జి.నిరంజన్ విమర్శించారు. రాష్ట్రంలో మళ్లీ ఒక వైపు కరోనా కేసులు పెరుగుతుంటే మరొక వైపు హుజూరాబాద్ లో ఎన్నికల తేదీలు ప్రకటించక ముందే ఎటువంటి కోవిద్ నిబంధనలను పాటించకుండా ప్రచార హోరు జోరుగా సాగుతోందని ఆయన విమర్శించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ప్రజలను కరోనా ముప్పుకు గురి చేస్తున్నారు. ఒక వైపు ప్రజలను మాస్క్ ధరించాలి, భౌతిక దూరము పాటించాలని చెపుతూ మరొక వైపు సి.ఎమ్, మంత్రులే పాటించక పోవడం దురదృష్టకరం. దళిత బంధు కార్యక్రమాన్ని ఉప ఎన్నికలు అయ్యే వరకు ఆపాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మేలు జరిగే ఏ పనిని ఆపుమని కోరదు.. దళిత బంధు పూర్తిగా ఎన్నికల కోసమే తెస్తున్నారు. సి.ఎం హోదాలో ఉంటూ మేము సన్యాసులము కాదు. రాజకీయము ఎందుకు చేయకూడదని దిగజారుడు మాటలు మాట్లాడటం తగదు. కేసీఆర్ స్వయంగా ఎన్నికల కోసమే తెస్తున్నామని అన్నారు. ఎన్నికల కమిషన్, కోర్టు లు సుమోటోగా తీసుకోవాలి. అధికార దుర్వినియోగాన్ని అరికట్టాలి. దళిత బంధు ను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. కానీ దీన్ని పూర్తిగా రాష్ట్రమంతా అమలు చేయాలి. పైలెట్ ప్రాజెక్ట్ పేరుతో హుజూరాబాద్ లోనే ఎందుకు..? రాష్ట్రంలో దళిత బంధు మొత్తం 1200 కోట్లయితే కేవలము హూజూరాబాద్ లోనే 1500 నుండి 2000 కోట్లు ఖర్చు పెడతామని సి.ఎం అనడములో ఉద్దేశ్యమేమిటి?. ప్రగతి భవన్ కు హుజురాబాద్ ప్రతి గ్రామంనుండి ఇద్దరు, ప్రతి మునిసిపల్ వార్డు నుండి ఇద్దరు నాయకులను మొత్తము 412 మందిని పిలిచి కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడటము ఎన్నికల కోసమేనా? వారితో కల్సి చేసిన భోజనం ఎన్నికల కోసమేనా? ఇది అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. కె.సి.ఆర్ కు చిత్తశుద్ధి ఉంటే ప్రతి నియోజక వర్గము

తన ఫోటోకు రెండు వైపుల బాబా సాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ ఫొటోలు పెట్టుకున్నంత మాత్రాన దళిత బందు కాలేడు రెండో విడత గొర్రెల పంపిణీ కూడా మంత్రి శ్రీనివాస్ యాదవ్ హుజురాబాద్ నియోజకవర్గములోని జమ్మికుంట లో నిన్న ప్రారంభించి ఆ నియోజక వర్గము లోని 500 లబ్దిదారులకు గొర్రెల పంపిణీ చేశారు. ఉద్యోగులకు ఫిట్మెంట్ ఇప్పటి వరకు ఇవ్వకుండా ఈ నెల నుంచి ఇస్తామని ప్రకటించారు. 30% పిట్మెంట్ ఇస్తున్నందుకు టి.ఎన్.జి.ఓ లు ప్రతి జిల్లాలో సి.ఎం కృతఙతా సభలు పెడతామని, అదీ కరీంనగర్ నగర్ నుండి మొదలు పెడదామనడము, ఎన్నికల నిర్వహణలో భాగస్వామ్యులు కాబోయే ఎన్.జి.ఓ లు ఎంత నిష్పక్షపాతంగా ఉండబోతారో అనడానికి నిదర్శనం. ఎన్నికల కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేవరకు జరిగే ఈ అధికార దుర్వినియోగానికి కళ్లెం వేయకుండా నిష్ఫక్షపాత ఎన్నికలు జరుపలేదు. అసెంబ్లీ, లొక్ సభ తో సహా ఏ స్థానానికైనా ఖాళీ ఏర్పడిన నాటి నుండే అధికార దుర్వినియోగం జరుగకుండా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి. ఎన్నికల కమిషన్ ఈ అధికార దుర్వినియోగం, కరోనా నిబందనలను ఉల్లఘింస్తూ చేసే ప్రచారాలను అరికట్టలేక పోతే వెంటనే ఎన్నికలను ప్రకటించాలి. అధికార దుర్వినియోగాన్ని, ప్రజాధన దోపిడిని అరికట్టాలి. కరొనా ముప్పునుండి ప్రజలను కాపాడాలి. అని ఆయన కోరారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


 వెన్నుముక కండరాల క్షీణత (ఎస్‌ఎంఏ)తో బాధపడుతున్నారా

పెద్దలతో పాటుగా రెండు నెలలు, ఆపై వయస్సు చిన్నారులకు

నోటి ద్వారా చికిత్సనందించే మొట్టమొదటి ఒక్క ఔషదం రోష్‌ యొక్క ఎవ్రిస్డీ (రిస్డీప్లామ్‌)

ఇప్పుడు భారతదేశంలో లభ్యం


(జానోజాగో వెబ్ న్యూస్-నెట్ వర్క్ డెస్క్)

రోష్‌ నేడు, వెన్నుముక కండరాల క్షీణత (స్పైనల్‌ మస్క్యులర్‌ అట్రోఫీ– ఎస్‌ఎంఏ) రోగుల కోసం భారతదేశంలో ఆమోదించబడిన  మొట్టమొదటి మరియు ఒకే ఒక్క చికిత్స ఎవ్రిస్డీ (రిస్డిప్లామ్‌)ను విడుదల చేసినట్లు వెల్లడించింది. ఎవ్రిస్డీను మొదటగా యుఎస్‌ ఎఫ్‌డీఏ ఆగస్టు 2020లో ఆమోదించింది. యుఎస్‌లో అనుమతించబడిన 11 నెలల  లోపుగానే ఇప్పుడు ఇండియాలో కూడా లభ్యమవుతుంది. ఆవిష్కరించిన నాటి నుంచి 50కు పైగా దేశాలలోని 4000 ఎస్‌ఎంఏ రోగులు ఎవ్రిస్డీ నుంచి ప్రయోజనం పొందారు.

అతి తీవ్రమైన, అభివృద్ధి చెందేటటువంటి న్యూరోమస్క్యులర్‌ వ్యాధి , ఎస్‌ఎంఏ. దీని వల్ల మరణమూ సంభవించవచ్చు. అంతర్జాతీయంగా ప్రతి 10000 జననాలలో దాదాపు ఒకరిపై ఇది  ప్రభావం చూపవచ్చు మరియు భారతదేశంలో  7744 జననాలలో  ఒకరిపై ఇది  ప్రభావం చూపుతుంది. శిశుమరణాలకు కారణమవుతున్న జన్యు కారణాలలో ఇది అగ్రగామిగా నిలుస్తుంది. సర్వైవల్‌ మోటర్‌ న్యూరాన్‌ 1(ఎస్‌ఎంఎన్‌1) జీన్‌ మ్యుటేషన్‌ కారణంగా ఎస్‌ఎంఏ వస్తుంది. దీని కారణంగా ఎస్‌ఎంఎన్‌ ప్రోటీన్‌ లోపిస్తుంది. ఈ ప్రొటీన్‌, శరీరమంతా కూడా లభ్యమవుతుంది.  కండరాలు మరియు కదలికలను నియంత్రించే నరాలు పనిచేయడానికి ఇది తప్పనిసరి. ఈ ప్రొటీన్‌ లేకుండా నరాలకు సంబంధించిన కణజాలం సరిగా పనిచేయదు. ఈ ప్రొటీన్‌ లోపిస్తే కొంత కాలానికి కండరాలు నీరసించిపోతాయి. ఎస్‌ఎంఏ  తరహా అనుసరించి, వ్యక్తుల శారీరక సామర్థ్యం మరియు వారు నడిచే తీరు, ఆహారం తీసుకోవడం లేదా శ్వాసించడం కూడా గణనీయంగా ప్రభావితం కావడం లేదా కోల్పోవడం జరుగవచ్చు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

 నరసింహపురం విడుదల వేడుక

30న ప్రపంచవ్యాప్తంగా,,,థియేటర్లలో రిలీజ్!!


(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

    గీత్ గౌరవ్ సినిమాస్ పతాకంపై..  పి.ఆర్.క్రియేషన్స్ సమర్పణలో టి.ఫణిరాజ్ గౌడ్-నందకిశోర్ ధూళిపాలతో కలిసి 'శ్రీరాజ్ బళ్లా' స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఫ్యామిలీ ఓరియంటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'నరసింహపురం'. పలు సీరియల్స్, సినిమాల ద్వారా సుపరిచితుడైన నందకిశోర్ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 30న విడుదలవుతున్న సందర్భంగా ప్రి-రిలీజ్ వేడుకను చిత్ర బృందం ఘనంగా నిర్వహించింది. సిరి హనుమంతు హీరోయిన్ గా నటిస్తుండగా.. వర్ధమాన నటి ఉష ఈ చిత్రంలో హీరో చెల్లెలు పాత్రలో నటించారు. 

గ్రాండ్ సక్సెస్ సెలెబ్రేషన్స్ ను తలపించేలా జరిగిన ఈ వేడుకలో ఎమ్.ఎల్.ఎ లక్ష్మారెడ్డి, ఫ్రెండ్లీ స్టార్ శ్రీకాంత్, ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ప్రముఖ నటుడు సమీర్, ఊర్వశి ఓటిటి సిఇఓ తుమ్మలపల్లి రామసత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిత్ర కథానాయకుడు నందు, దర్శకుడు శ్రీరాజ్ బళ్లా, నిర్మాత ఫణిరాజ్ గౌడ్, చెల్లెలు పాత్రధారి ఉషతోపాటు చిత్ర బృందం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. థియేటర్ ట్రైలర్ ను విడుదల చేసిన ముఖ్య అతిధులు 'నరసింహపురం' పెద్ద విజయం సాధించి చిత్రబృందానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం నటీనటులు-సాంకేతిక నిపుణులకు జ్ఞాపికలు అందించారు. హీరో శ్రీకాంత్, తమ్మారెడ్డి సమీర్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపిన దర్శకనిర్మాతలు.. "నరసింహపురం" కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం చేసి... ఈ చిత్రం అద్భుతంగా రూపొందడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

     కల్యాణ మాధవి, లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫేమ్ విజయ్ కుమార్, అరవిందసమేత ఫేమ్ రంగధామ్, రవివర్మ బళ్ళా, సంపత్, ఫణిరాజ్, స్వామి, శ్రీకాంత్, శ్రీకర్, శివ, జునైద్, గిరిధర్, సాయిరాజ్ ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, మేకప్: కె.వి.బాబు, పబ్లిసిటీ డిజైన్స్: వెంకట్.ఎం, విఎఫెక్స్: చందు ఆది, కెమెరా: కర్ణ ప్యారసాని, ఎడిటింగ్ & డి.ఐ: శివ వై.ప్రసాద్, 5.1 మిక్సింగ్: రమేష్ కామరాజు, పాటలు: గడ్డం వీరు, సంగీతం: ఫ్రాంక్లిన్ సుకుమార్, నిర్మాతలు: శ్రీరాజ్ బళ్ళా- టి.ఫణిరాజ్ గౌడ్-నందకిశోర్ ధూళిపాల, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీరాజ్ బళ్ళా!!

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

 మీ హయాంలో విస్మరించి...ఇపుడు ప్రశ్నించడమా

టీడీపీ నేతలపై డాక్టర్ ఏలూరి ఫైర్

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

తమ హమాంలో వెలిగొండ ప్రాజెక్టు విస్మరించి ఇపుడు వైసీపీ ప్రభుత్వం వాటిని చేపడుతుంటే ప్రశ్నిలు గుప్పించడం సిగ్గుచేటని టీడీపీ నేతలను ఉద్దేశించి వైసీపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ...టీడీపీ ఐదేళ్ల పాలనలో వెలిగొండ ప్రాజెక్టు పనులు చేయకుంటే ప్రశ్నించని టీడీపీ నేతలు.. ఇప్పుడు వైసీపీ హయాంలో ప్రాజెక్టు పూర్తవుతుంటే ప్రజల దృష్టిలో పడాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.. వారానికోసారి ప్రాజెక్టు వద్దకు వెళ్లడం.. అక్కడేదో పొడిచేస్తున్నట్టు బిల్డప్ ఇవ్వడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.. వెలిగొండ విషయంలో రోజుకోరకంగా ఆరోపణలు చేస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేయడం సిగ్గుచేటు. అని ఏలూరి రామచంద్రారెడ్డి విమర్శించారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

 

 స్టార్ ప్రొడ్యూసర్ శరత్ మరార్

విడుదల చేయనున్న

 క్షీరసాగర మథనం ట్రైలర్

ఆగస్టు 6 న థియేటర్లలో విడుదల


(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

    ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన పలు సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో పని చేసే మెరికల్లాంటి కొందరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్స్ సంయుక్తంగా తెరకెక్కించిన చిత్రం "క్షీరసాగర మథనం". సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అనిల్ పంగులూరి దర్శకత్వంలో అత్యంత ఆహ్లాదకరంగ రూపొందిన 'క్షీర సాగర మథనం' అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 6... థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. 

     ఈ చిత్రం ట్రైలర్ ను ప్రముఖ నిర్మాత శరత్ మరార్ రిలీజ్ చేయనున్నారు. మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల తాలూకు భావోద్వేగాలను తెరకెక్కిస్తూ రూపొందుతున్న ఈ చిత్రంలో మానస్ నాగులపల్లి, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా నటించారు. అక్షత సోనావని హీరోయిన్ కాగా ప్రదీప్ రుద్ర  ప్రతినాయకుడు. శ్రీ వెంకటేశ పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. 


 

    చిత్ర దర్శకుడు అనిల్ పంగులూరి మాట్లాడుతూ.. మా చిత్రానికి మోరల్ గా ఎంతో సపోర్ట్ చేస్తున్న శరత్ మరార్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఆయన చేతుల మీదుగా మా "క్షీర సాగర మథనం" ట్రైలర్ రిలీజ్ అవుతుండడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆగస్టు 6న థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.

     చరిష్మా శ్రీకర్, గౌతమ్ శెట్టి, ప్రియాంత్, మహేష్, అదిరే అభి, శశిధర్, ఇందు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ వినూత్న కథాచిత్రానికి ప్రచార రూపకల్పన: డిజైన్ ఐ.డి, పోరాటాలు: వింగ్ చున్ అంజి, పాటలు: శ్రీమణి-వశిష్ఠ శర్మ-వి.ఎన్.వి.రమేష్ కుమార్, సంగీతం: అజయ్ అరసాడ, ఛాయాగ్రహణం: సంతోష శానమోని, కూర్పు: వంశీ అట్లూరి, సహ-దర్శకుడు: కిషోర్ కృష్ణ, పీఆర్వో: ధీరజ అప్పాజీ, సహనిర్మాత: మురళీకృష్ణ దబ్బుగుడి, నిర్మాణం: ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్, రచన-దర్శకత్వం: అనిల్ పంగులూరి!!

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

 మత రాజకీయాలు కాదు.. 

హామీలు నెరవేర్చండి

వైసీపీ నేత డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి 

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

ఏపీలో బీజేపీ మతాల పేరుతో అతి రాజకీయం చేస్తుందని వైకాపా రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ మూల, ఏ చిన్న సంఘటన జరిగినా దానిని ప్రభుత్వానికి అంటగట్టి బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.. అన్ని మతాలు, కులాలను సమానంగా చూస్తూ పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అన్నారు.. తమ ప్రభుత్వానికి ఏ మతం తక్కువకాదు అన్ని మతాలు సమానం అని ఏలూరి తెలిపారు.
గోవుల అక్రమ రవాణా జరగకపోయినా జరిగినట్టు మాట్లాడి ప్రజల మధ్య గందరగోళాన్ని సృష్టించడం దారుణమన్నారు. అంతర్వేది రధం దగ్దం కేసును సిబిఐకి ఇస్తే ఇంతవరకూ దర్యాప్తు చేపట్టలేదు.. ఎందుకు దర్యాప్తు చెయ్యలేదో సోము వీర్రాజు సమాధానం చెప్పాలన్నారు.. ఇక ముఖ్యమంత్రిని ఒక మతానికి పరిమితం చేసేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్న ఏలూరి.. మతరాజకీయాలు మాని.. ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా, పోలవరం పునరావాస ప్యాకేజి అలాగే విభజన హామీలపై బీజేపీ నాయకులు పోరాటం చెయ్యాలని డాక్టర్ ఏలూరి సూచించారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

 మధ్యప్రదేశ్ పర్యాటక సంస్థ సహకారం మరువలేనిది!!

- తప్పించుకోలేరు దర్శకనిర్మాత "ఆర్.వి.జి"  

ౌ ఆగస్టు 13 విడుదల


(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)         

      ఆర్.వి.జి మూవీజ్- ఎస్.వి.ఎల్.ఎంట్రప్రైజస్ పతాకాలపై రుద్రాపట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి)-తలారి వినోద్ కుమార్ ముదిరాజ్- శ్రీనివాస్ మామిడాల-లలిత్ కుమార్ సంయుక్తంగా నిర్మించిన సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ "తప్పించుకోలేరు". "కొత్తకథ, ఉసురు, అయ్యప్ప కటాక్షం" వంటి చిత్రాలతో దర్శకుడిగా తన సత్తాను ఘనంగా చాటుకున్న రుద్రాపట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి) స్వీయ నిర్మాణంలో తాజాగా రూపొందించిన ఈ చిత్రం సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 13 విడుదలకు సిద్దమవుతోంది. రవిశంకర్ ఓంకాళి ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. 

     ఆదర్శ్, హరీష్, ట్వింకిల్ అగర్వాల్, సాయిశ్వేత, ఆకెళ్ల, ఫహీం ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మధ్యప్రదేశ్ లోని భోపాల్ గ్యాస్ సంఘటన స్పూర్తితో తెరకెక్కింది. మధ్యప్రదేశ్ పర్యాటక సంస్థ సౌజన్యంతో చాలా భాగం భోపాల్ మరియు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రాన్ని అక్కడ కూడా విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.


     దర్శకనిర్మాత ఆర్.వి.జి మాట్లాడుతూ..."మా చిత్ర రూపకల్పనలో మధ్యప్రదేశ్ పర్యాటక శాఖ అందించిన సహాయసహకారాలు మరువలేనివి. డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో రూపొందిన "తప్పించుకోలేరు" చిత్రాన్ని ఆగస్టు 13న రిలీజ్ చేస్తున్నాం. వి.ఎస్.పి.తెన్నేటి మాటలు-పాటలు, రాజేష్ రాజ్ మ్యూజిక్.. ఈ చిత్రానికి మెయిన్ ఎస్సెట్స్" అన్నారు.

     ఏ.విఎల్.నరసింహం, నిట్టల మల్లాది భాస్కర్, మేజర్ ఆర్.వి.సుబ్బారావు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, రచనా సహకారం: వి.ఆర్.కంచి, ఛాయాగ్రహణం: ప్రసాద్ కె.నాయుడు, సంగీతం: రాజేష్ రాజ్.టి, మాటలు-పాటలు: వి.ఎస్.పి.తెన్నేటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవిశంకర్ ఓంకాళి, నిర్మాతలు: రుద్రాపట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి)-తలారి వినోద్ కుమార్ ముదిరాజ్-శ్రీనివాస్ మామిడాల-లలిత్ కుమార్, రచన-దర్శకత్వం: రుద్రాపట్ల వేణుగోపాల్(ఆర్.వి.జి)!!

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

 డ్యూరోఫ్లెక్స్ మొట్టమొదటి ప్రచారకర్తగా అలియా భట్

భారత్ మరింత మెరుగ్గా నిద్రించడంలో,,.

తోడ్పడేందుకు కార్యాచరణలో డ్రీమ్ టీమ్


(జానోజాగో వెబ్ న్యూస్-బిజినెస్ బ్యూరో)

జులై 2021: భారతదేశ అగ్రగామి స్లీప్ సొల్యూషన్స్ ప్రొవైడర్ అయిన డ్యూరోఫ్లెక్స్ యువతకు ప్రతీక అయిన అలియా భట్ ను తమ మొట్టమొదటి ప్రచారకర్తగా ప్రకటించింది. 50 ఏళ్లకు పైగా నైపుణ్యంతో కూడిన ఈ విశ్వసనీయ స్లీప్ సొల్యూషన్ బ్రాండ్ తమ తదుపరి క్యాంపెయిన్ ను ఆమెతో ప్రారంభించనుంది, మరింత మెరుగ్గా నిద్రించేందుకు భారతదేశానికి స్ఫూర్తినందించనుంది.

నటి అలియా తన బహుముఖ ప్రతిభకు, అవార్డులు పొందిన పనితీరుకు, ఉత్కృష్టత సాధించేందుకు గల కట్టు బాటుకు పేరొందారు. నిరంతరం ఆమె హద్దులను అధిగమిస్తూ ముందుకెళ్తూ వచ్చారు. నూతన శిఖరాలను అధిరోహించారు. అదే సమయంలో వృత్తిపరమైన విజయాలను, వ్యక్తిగత ఆరోగ్యాన్ని సమతుల్యం చేసుకుం టూ వచ్చారు. తన ఆరోగ్యదాయక జీవనశైలికి ప్రశాంత నిద్ర కారణమని ఆమె పరిగణిస్తుంటారు. సామాజిక మాధ్యమాల్లో సైతం నిద్ర పట్ల తన ప్రేమను చాటుకుంటూ ఉంటారు. అలియా కు నిద్ర పట్ల గల ఆరాధనా భా వం ఆమెను డ్యూరోఫ్లెక్స్ కు పరిపూర్ణ ప్రచారకర్తగా మార్చింది. 

ఈ సందర్భంగా డ్యూరోఫ్లెక్స్ సీఎంఓ స్మితా మురార్క మాట్లాడుతూ, ‘‘స్లీప్ సొల్యూషన్స్ విభాగంలో అత్యంత నై పుణ్యంగల సంస్థ డ్యూరోఫ్లెక్స్. భారత్ కు మెరుగైన రీతిలో నిద్రపోయేందుకు తోడ్పడాలన్న కార్యాచరణను అది చేపట్టింది. నూతన తరం వినియోగదారులతో మేము ఏకం కాగల విధంగా కలసి పని చేయాలని మేం కోరుకుంటున్నాం. అలియా భట్ తిరుగులేని విధంగా యూత్ ఐకాన్. తనకు తానుగా ఉన్నత స్థాయికి చేరు కున్నారు. ఆరోగ్యదాయక జీవనశైలిలో నిద్ర కీలకపాత్ర పోషిస్తుందని ఆమె అంటున్నారు. నిద్రపై మేం పంచు కున్న కట్టుబాటును ఆమె ద్వారా యావత్ దేశంలో ప్రచారం చేయాలని భావిస్తున్నాం’’ అని అన్నా రు.

ఒత్తిళ్లతో నిండిన నేటి వాతావరణంలో నిద్ర రాజీపడుతోంది. ఈ నేపథ్యంలో మెరుగైన నిద్రను అందించే మ్యాట్రె సెస్ వంటి అవసరమైన ఉత్పాదనలను ఎంచుకోవడంలో భారత్ అప్ గ్రేడ్ కావడాన్ని ప్రోత్సహించాలని డ్యూరో ఫ్లెక్స్ కోరుకుంటోంది. పరిశోధనల ఆధారంగా, సాంకేతికంగా ముందంజలో ఉండే విధంగా మ్యాట్రెసెస్ ను, స్లీప్ యాక్సెసరీస్ ను ఈ బ్రాండ్ అందిస్తోంది. 

డ్యూరోఫ్లెక్స్ నిరంతరం తన సామాజిక మాధ్యమ చానల్స్ @duroflexworld  ద్వారా నిద్ర పై ప్రచారం చేస్తూనే ఉంది. నిద్ర శక్తిని విశ్వసించే వారితో కలసి పనిచేస్తూనే ఉంది. 

డ్యూరోఫ్లెక్స్ తో తన అనుబంధం గురించి అలియా భట్ మాట్లాడుతూ, ‘‘ఒక నటిగా నిర్దిష్ట సమయానికి ముం దుగానే సెట్స్ కు చేరుకోవడం, గంటల తరబడి షూటింగ్ లు మా జీవితంలో భాగమైపోయాయి. చక్కటి నిద్ర నా మహత్తర శక్తి అనే విషయం నేను తెలుసుకున్నాను. అది నా పనితనాన్ని అధికం చేస్తుంది. నా విజయా ల్లో అదెంతో కీలకం. నిద్ర విషయంలో నేనెప్పుడూ రాజీపడను. నిద్ర ప్రాధాన్యం పై అవగాహన పెంచేందుకు, మాట్రెసెస్ లాంటి నిద్రకు అవసరమైన వస్తువుల విషయంలో సరైన అవగాహనతో నిర్ణయాలు తీసుకునేందు కు భారత్ కు తోడ్పడేందుకు డ్యూరోఫ్లెక్స్ లాంటి శక్తివంతమైన బ్రాండ్ తో అనుబంధం నాకెంతో ఆనందాన్ని అందిస్తోంది’’ అని అన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

 అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు

జస్టిస్ కాంతారావు

ఏ.పి. పాఠశాలవిద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ కమీషన్ ఛైర్మన్ జస్టిస్ ఆర్. కాంతారావు

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

              పలుమార్లు హెచ్చరించినప్పటికీ రాష్ట్రంలోని విద్యాసంస్థలు తమ తీరు మార్చుకోవడం లేదని పాఠశాల విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఆర్. కాంతారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఫీజు, ఉద్యోగులకు జీతాలు చెల్లించే విషయంలో కమిషన్ మరియు ప్రభుత్వం ఇది వరకే ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, అయినా ఇంకా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయని ఆయన పత్రికా ప్రకటనలో తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో ఆన్లైన్ క్లాసులు ప్రారంభించిన కొన్ని విద్యాసంస్థలు అధిక ఫీజు వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. ఆన్లైన్ క్లాసులకు అనుమతి ఇచ్చినంత మాత్రాన ఇష్టం వచ్చిన రీతిలో ఫీజులు వసూలు చేసుకోమని చెప్పినట్లు కాదని ఆయన అన్నారు. ప్రైవేటు పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలలు తప్పనిసరిగా గత సంవత్సరం ట్యూషన్ ఫీజు మాత్రమే కట్టించుకోవాలని తెలిపారు.


అది కూడా వాయిదాల్లో చెల్లించే అవకాశాన్ని తల్లిదండ్రులకు ఇవ్వాలని జస్టిస్. కాంతారావు స్పష్టం చేశారు. దీనికి అదనంగా ఎలాంటి ఫీజులు వసూలు చేయరాదని హెచ్చరించారు.  మరోవైపు మార్చి నెల నుంచి ఈ ప్రైవేటు విద్యాసంస్థలు ఉపాధ్యాయులను, ఇతర సిబ్బందిని మౌఖిక ఆదేశాలతో ఉద్యోగాల నుంచి తొలగించినట్లు, జీతాలు ఇవ్వట్లేదని ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. తక్షణమే సిబ్బందికి జీతాలు అందించాలని, తొలగించిన సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించారు. దీన్ని బేఖాతరు చేసే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

డి ఈ ఓ లు, ఆర్జేడీ లు, ఆర్ ఐ వో లు తమ పరిధిలో తల్లిదండ్రులతో, ప్రైవేట్ ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించి అధిక ఫీజులు వసూలు చేస్తున్న, ఉద్యోగులకు జీతాలు ఇవ్వని విద్యాసంస్థలను గుర్తించాలని ఆయన సూచించారు. తమ స్థాయిలో సమస్యల పరిష్కారానికి ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉల్లంఘనలకు పాల్పడిన విద్యాసంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పారు. 

విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రైవేటు ఉపాధ్యాయులు తమ సమస్యలను నేరుగా రాష్ట్ర పాఠశాల విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ కు కూడా తెలియ చేయవచ్చని జస్టిస్ కాంతారావు వెల్లడించారు. 9150381111 కు ఫోన్ ద్వారా (ఫోన్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ప్రభుత్వ పని దినాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది), apsermc2020@gmail.com కు ఈ - మెయిల్ ద్వారా, www.apsermc.ap.gov.in పోర్టల్ లో గ్రీవెన్స్ అనే లింక్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు...!!

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

 

ఖమ్మం జిల్లా నూతన కలెక్టర్ కు,,, 

శుభాకాంక్షలు తెలిపిన ఎం.పి.జె అధ్యక్షులు ఖాసిం బృందం


(జానోజాగో వెబ్ న్యూస్-ఖమ్మం ప్రతినిధి)

ఖమ్మం జిల్లాకు నూతన కలెక్టరుగా వచ్చిన పి.వి. గౌతమ్ గారిని జిల్లా ఎం.పి.జె నాయకులతో మర్యాద పూర్వకంగా కలసి అభినందనలు తెలిపిన అధ్యక్షులు ఎస్.కే.ఖాసిం.  ఈ సందర్భం గా మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ నాయకులు కలెక్టరు గారిని పుష్ప గుచ్చంతో స్వాగతం పలికారు.  కలెక్టరు గౌతం మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సంస్థ  చేసిన కార్యక్రమాలను గురించి అడిగి తెలుసుకున్నారు.  జైలర్ గారి సహకారంతో, పేద ఖైదీలను అపరాధ రుసుము చెల్లించి విడుదల చేయించడం, కరోనా మహమ్మారి దెబ్బకు చితికి పోయిన ప్రైవేట్ టీచర్లకు ఆర్ధిక సహాయం అందించడం, శివారు ప్రాంతాలలో వున్న ప్రజలకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేయడం, తదితర అంశాలను ఆసక్తిగా విన్న కలెక్టరు గారు ఎం.పి.జె సభ్యులకు  అభినందనలు తెలిపారు. ప్రజలకు ఎం.పి.జె సేవలు ఇంకా విస్తరించాలని, మరెన్నో ప్రజోపయోగ కార్యక్రమాలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమములో ఎం.పి.జె జిల్లా కార్యదర్శి  బి. సతీష్ చౌదరి, కోశాధికారి హకీం, షర్ఫుద్దీన్, గౌస్, జాని తదితర నాయకులు పాల్గొన్నారు. 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

మార్కాపురం పురపాలక కో-ఆప్షన్ మెంబర్ గా... 

పఠాన్ అమీరుల్లా ఖాన్ ఎన్నిక

పలువురి అభినందనలు


(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

       ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ పురపాలక కో-ఆప్షన్ మెంబర్ ఎన్నికల సందర్భంగా ముస్లీమ్ మైనారిటి వర్గానికి చెందిన పఠాన్ అమీరుల్లాఖాన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వీరు గతంలో కాంగ్రెస్ హయాంలో కౌన్సిలర్ గాను, టిడిపీ హయాంలో మార్కెట్ యార్డు మెంబరు గాను, ప్రస్తుతం మార్కాపురం పట్టణ ఏఐటియుసి నాయకుడు, టౌన్ ఫోర్ వీలర్స్ మోటార్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడుగా వుంటూ పలు ప్రజాసేవా కార్యక్రమాలలో పాల్గొంటూ తమ వంతు సహయసహకారాలు అందిస్తూ ప్రజలలో ఆదరణ,మంచిగుర్తింపు కలిగిన అమీరుల్లాఖాన్ ను పురపాలక కో-ఆప్షన్ మెంబర్ గా ఎన్నికయినందుకు మార్కాపురం నియోజకవర్గ ఎంఎల్ఎ కుందూరు నాగార్జున రెడ్డి, పురపాలక కమీషనర్ నయీమ్ అహమ్మద్ ఛైర్మన్ బాల మురళీకృష్ణ, వైస్ ఛైర్మన్ షేక్. ఇస్మాయిల్, పురపాలక సిబ్బంది, పలువురూ శుభాకాంక్షలు తెలిపారు. 

 


     ఈ కార్యక్రమములో పెద్దలు అందె నాసరయ్య, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి జిల్లా ఏఐటియుసి కార్యదర్శి షేక్ ఖాసీమ్, మైనారిటి నాయకులు 14వబ్లాక్ వైసిపి ఇన్ఛార్జ్ షేక్ కరీముల్లా, పి.సర్దార్ ఖాన్, పి. ఖలీలుల్లాఖాన్, పి.మొహసీన్, 35వ బ్లాక్ కన్వీనర్ షేక్ మొహమ్మద్ తాజ్ హుస్సేన్ పి.నవాజ్ ఖాన్ మరియు కౌన్సిలర్లు పాల్గొన్నారు.
 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి