లోకేష్ మానసిక స్థితిపై అనుమానాలు..
ఎర్రగడ్డలో చూపించండి
రాయలసీమ ప్రజలను రౌడీలు, గూండాలు అంటారా?
జంతువులతో పోల్చుకుంటూ వికృతంగా ప్రవర్తిస్తారా?
వైసీపీ నేత డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి ఆగ్రహం
(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)
ప్రతిసారి రౌడీలు, గూండాలు అంటూ రాయలసీమ ప్రజలను చంద్రబాబునాయుడు కించపరుస్తున్నారని వైసీపీ నేత డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడు ఎక్కడేం జరిగినా కడప రౌడీలు, పులివెందుల గూండాలు, పులివెందుల పంచాయితీ అంటూ రాయలసీమ వాసులను అవమానించేలా మాట్లాడుతున్నారు. అందుకు రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేష్ లు ఈ విధంగా మాట్లాడినందుకే రాయలసీమలో మొత్తం 52 అసెంబ్లీ స్థానాలు ఉంటే.. 49 వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలిచారు.. 3 మాత్రమే టీడీపీ గెలిచిందని అన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసి.. ఒకే ప్రాంతానికి పరిమితమై మరో ప్రాంతాన్ని హేళన చేసేలా ప్రవర్తించడం చంద్రబాబుకే చెల్లిందని అన్నారు. ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టెలా మాట్లాడకూడదన్న కనీసపాటి విజ్ఞత చంద్రబాబుకు లేదని ఏలూరి విమర్శించారు. వీధుల్లో జరిగే గొడవలను కూడా చంద్రబాబు వైసీపీ ప్రభుత్వానికి ఆపాదించి..
తద్వారా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఇక ఆయన కుమారుడు నారా లోకేష్ వీధి రౌడీలాగా ప్రవర్తించడం బాధాకరమని.. ఒక ముఖ్యమంత్రిని ఒరేయ్ అంటూ సంబోధించడం అతని మూర్ఖత్వానికి నిదర్శనం అన్నారు. అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యేను శునకంతో పోల్చడం.. వాడు వీడు అంటూ మాట్లాడడం చూస్తుంటే అతని మానసిక స్థితిపై తమకు అనుమానాలు ఉన్నాయని.. వీలైతే ఎర్రగడ్డలో చూపించాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నానని ఏలూరి అన్నారు. నారా లోకేష్.. మేము సింహాలం అంటూ బీరాలు పలకడం మరి అతిశయంగా ఉందన్న ఏలూరి.. మనుషులను జంతువులతో పోల్చుకుంటున్నారు కాబట్టే వికృతంగా ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు.. ఇకనైనా చంద్రబాబు, నారా లోకేష్ తమ ప్రవర్తన మార్చుకోవాలని ఏలూరి రామచంద్రారెడ్డి హితవు పలికారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: