పడుచు ప్రేమికుల ప్రణయ కథనం

లావణ్య విత్ లవ్ బాయ్స్

డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ చిత్రం 'ఊర్వశి'లో


(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

     'ఎక్కడికి వెళ్తుందో మనసు' అనంతరం ప్రముఖ గీత రచయిత-బహుముఖ ప్రతిభాశాలి డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన స్వచ్ఛమైన ప్రేమకథ 'లావణ్య విత్ లవ్ బాయ్స్'. పావని టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రంలో యోధ-కిరణ్-సాంబ హీరోలు. ప్రఖ్యాత రచయిత-నటుడు పరుచూరి గోపాలకృష్ణ, కాశీ విశ్వనాధ్, హేమసుందర్, వైభవ్, యోగి, భవాని ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ వినోదభరిత ప్రేమకథాచిత్రాన్ని 'రాజ్యలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్' పతాకంపై శరత్ చెట్టి (యూఎస్ఏ) సమర్పణలో శ్రీమతి రాజ్యలక్ష్మి.సి-నర్సింలు పటేల్ చెట్టి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 6 న ప్రముఖ ఓటిటి ఊర్వశి ద్వారా విడుదల కానుంది.

 


     ఈ సందర్భంగా ఈ చిత్రానికి కథ-మాటలు-పాటలు-స్క్రీన్ ప్లే సైతం సమకూర్చిన చిత్ర దర్శకులు డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ మాట్లాడుతూ.. "ముందుగా మా "లావణ్య విత్ లవ్ బాయ్స్" చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గల తెలుగు ప్రేక్షకులకు చేరువ చేస్తున్న "ఊర్వశి ఓటిటి"కి కృతజ్ఞతలు. అలాగే మా నిర్మాతలు శ్రీమతి రాజ్యలక్ష్మి.సి-నర్శింలు పటేల్ చెట్టి-శరత్ చెట్టిలకు కూడా. "ప్రేమ పేరుతో తన వెంట పడే మేకవన్నె పులుల నుంచి లావణ్య అనే ఒంటరి యువతి తనను తాను రక్షించుకుని.. స్వచ్ఛమైన ప్రేమను ఎలా పొందింది?" అనే అంశాన్ని అత్యంత వినోదాత్మకంగా అందరి హృదయాలకు హత్తుకునేలా రూపొందిన చిత్రమిది.


మనసులను మైమరపించే మాటలు-పాటలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. ఇందులో ముఖ్య పాత్రలు పోషించిన పరుచూరి గోపాలకృష్ణ, కాశీ విశ్వనాధ్ ల ప్రశంసలు ఎప్పటికీ మర్చిపోలేను. పుష్కలమైన వినోదానికి రవ్వంత సందేశం జోడించాం. అందరినీ అలరిస్తుందనే నమ్మకం ఉంది" అన్నారు.

     ఈ చిత్రానికి కెమెరా: రమణ తోట, సంగీతం: యశోకృష్ణ, సమర్పణ: శరత్ చెట్టి (యూఎస్ఏ), నిర్మాతలు: శ్రీమతి రాజ్యలక్ష్మి.సి-నర్సింలు పటేల్ చెట్టి, కథ-మాటలు-పాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ, విడుదల: ఊర్వశి ఓటిటి!!

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: