కరోనా ఉల్లంఘనలపై ఉక్కుపాదం
లాక్ డౌన్ ఉల్లంఘించి బయటకు వస్తే ఫైనే
కట్టుదిట్టంచేస్తున్న గడివేముల పోలీసులు
తపుచేస్తే ఊరుకోం-ఎస్సై ఎం.శ్రీధర్
కరోనా కట్టడి కోసం పెట్టిన లాక్ డౌన్ లో నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపైకి వస్తున్న వారిపై ఉక్కుపాదం మోపాలని గడివేముల పోలీసులు నిర్ణయం తీసుకొన్నారు. అవసరంలేకున్నా సరదా కోసం బయటికొచ్చేవారు ఎక్కువవడంతో ఈ చర్యలకు వారు పూనుకొన్నారు. లాక్ డౌన్ మినహాయింపు సమయంలో కొనసాగుతున్న నిబంధనల ఉల్లంఘనలపైనా కూడా గడివేముల పోలీసులు ప్రత్యేక నజర్ పెట్టారు. లాడ్ డౌన్ మినహాయింపు సమయంలో బయటకు వచ్చే ప్రజలు తప్పని సరిగా మాస్క్ లు పెట్టేలా చర్యలు తీసుకొంటున్నారు. నిత్యవసర వస్తువులు కొనుగోలు చేసేందుకు వచ్చే వారు నిర్ణీత సమయంలో తమ పనులు పూర్తి చేసుకొని ఇండ్లకు తిరిగి వెళ్లాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అదే సందర్బంలో అనవసరంగా రోడ్డుపైకి వస్తున్న ద్విచక్ర వాహనాలపై , ఇతర వాహనాలపై ప్రత్యేక శ్రద్ద పెడుతున్నారు గడివేముల పోలీసులు. నిబంధనలు ఉల్లంఘించి బయటకు వచ్చే వాహనాలపై రుసుం విధించి ఆకతాయిలను నియంత్రించే చర్యలను వారు చేపట్టారు.
తప్పుచేస్తే చూస్తూ ఉరుకోం-ఎస్సై ఎం.శ్రీధర్
కరోనా వేళ నిబంధనలను ఉల్లంఘించి తపుచేస్తే ఏ మాత్రం సహించబోమని గడివేముల ఎస్సై ఎం.శ్రీధర్ స్పష్టంచేశారు. లాక్ డౌన్ నిబంధనలను పట్టిష్టంగా అమలు చేస్తామన్నారు. ఈ విషయంలో రాజీపడేదే లేదని ఆయన స్పష్టంచేశారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకొంటామని ఆయన హామీ ఇచ్చారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: