సమయపాలన చేసిన వారే విజేయులు

యువకులు సమయాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలి

--ప్రముఖ అమెరికన్ మనస్తత్వవేత్త డాక్టర్ మొహమ్మద్ ఖుతుబుద్దీన్


సమయం అనేది దేవుని తరఫునుండి ప్రసాదింపబడిన ఒక వరం. ఇది మానవుల కోసం ఎంతో అవసరం. దీనిని మానవులు గౌరవించాలి. సమయాన్ని వృధా చేయరాదు. ఈవరం చూస్తూ చూస్తూ ఉండగానే ఐస్ లా కరిగి పోతుంటుంది. ఒకసారి చేజారి పోయిందంటే మళ్ళీ తిరిగి రాదు. సమయానికి ముందే ప్లాన్ చేసుకునే వాడు విజేయుడు. అలాంటి వాడు సమయాన్ని తన గుప్పెట్లో పెట్టుకుంటాడు. ఏమరుపాటు లో ఉన్న వ్యక్తి అది దాటిపోయిన తర్వాత విచారం వెలిబుచ్చు తాడు.

సమయం ఖడ్గం వంటిది. మనిషి దానిని సద్వినియోగం చేసుకుంటే ప్రపంచాన్నే జయిస్తాడు. లేదా ఆ సమయమే అతని  ప్రాణసంకటంగా మారుతుంది. సమయంలోని సెకండ్లను Unit of Life గా భావించాలి. చంచల స్వభావం గల ఈ సమయాన్ని లాటిన్ భాషలో tempus fugit అంటారు. ఈ స్థితి ఏమరు పాటు వల్ల, అశ్రద్ధ వల్ల సమయాన్ని వృధా చేయడం వల్ల దాపురిస్తుంది.  ఎలాంటి గుళిక అంటే ఇది మీ ఖరీదైన జీవితాన్ని మీకు తెలియకుండానే వల్లకాడుకు పంపించవచ్చు కూడా. సమయం ఎవరి కోసం ఎదురు చూడదు. ఎలాంటి ఆటంకం లేకుండా అది ముందుకు సాగిపోతూనే ఉంటుంది. ఎందుకంటే అది మనకు కనిపించదు కదా! మనిషి గనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే lllusion చూపులు మోస పోతాయి. సమయం విలువ తెలిసిన వాడే దానిని సద్వినియోగం చేసుకుంటాడు. లాటిన్ భాషలో carpe diem అని చెప్పబడుతున్నది. మనిషి ఎప్పుడైతే సమయాన్ని తన గుప్పెట్లో పెట్టుకుంటాడో అప్పుడు vatanouva అంటే అతడొక కొత్త జీవితాన్ని పొందుతాడు. ఇదే విజేత గల జీవితం

మనిషిలోని ఏమరపాటు, నిస్సత్తువ, సోమరితనం వల్ల, సరైన శిక్షణ లేకపోవడం వల్ల, సమయం మనిషి నుండి చేజారిపోతుంది. చేజారిపోయిన సమయం మళ్ళీ తిరిగి రాదు. ఇదొక వాస్తవం. ఎవరైతే సమయం యొక్క స్వభావాన్ని అర్థం చేసుకున్నారో దాని ప్రకారం గా తమను తాము మలచుకున్నారో  వారే విజయులైనట్టుగా చరిత్ర సాక్ష్యం ఇస్తోంది. ఇలా సమయ పాలన చేసేవారిని, సమయాన్ని గౌరవించే వారిని చరిత్ర లిఖించుకుంది. ప్రపంచం వీరిని మర్చిపోదు. యువకులు అభివృద్ధి కలలు కనాలి. ఆ కలలు నిజం చేసుకోవడానికి వారు తమ షెడ్యూలును ముందుం చుకోవాలి. తమvisions బోర్డు ను సిద్ధం చేసుకోవాలి. వారు ఏమి చేయాలో ఏమి చేయకూడదో వాటి గురించి ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. చేసే పనులు ఒక కాలంలో, చేయకూడని పనులు మరో కాలంలో, అస్సలు చేయకూడని పనుల గురించిన కాలం కూడా ఒకటి వారి  షెడ్యూల్ లీస్ట్ లో ఉండాలి. ఈ పనులన్నింటినీ సమయానుకూలంగా చేసినట్టయితే విజయం యువకుల పాదాలను ముద్దాడుతుంది. ప్రపంచంలో విజయం సాధించిన వారి జీవిత చరిత్రలను యువకులు చదవాలి. వారు సమయ పాలన పాటిస్తూ ఉన్నత శిఖరాలకు ఎలా చేరుకున్నారో తెలుసుకోవచ్చు. వారి జీవితాల ద్వారా అనేక గుణపాఠాలు నేర్చుకోవచ్చు. విజేయులైన వారి జీవిత చరిత్రలు యువకులకు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి మార్గదర్శకంగా నిలుస్తాయి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు: రెండు వరాల గురించి ప్రజలు ఏమరుపాటులో పడి ఉన్నారు ఒకటి ఆరోగ్యం, రెండవది తీరిక.నిరంతరంగా నడుస్తున్న సమయం నిలకడగా ఉండదనే విషయాన్ని  యువకులు తెలుసుకోవాలి. అసలు మనిషి జీవితం అంటేనే నిర్ణీత సమయం. ఇలాంటి నిర్ణీత సమయాన్నే గొప్ప సమయంగా భావించి పనులు నెరవేర్చుకుంటేనే విజయం ప్రాప్తం అవుతుంది. మనిషి మెదడు, సృష్టి వ్యవస్థ ఒకదానితో మరొకటి ముడివడి ఉన్నాయి. రాత్రి నిదుర పగటి నిద్ర కంటే మేలైనది. సమయాన్ని ఆలోచనాత్మకంగా వాడుకుంటే అది ఆలోచనలకు శక్తి చేకూరుస్తుంది. సమయాన్ని స్నేహితులతో సంతోషంగా  గడిపితే అది మిమ్మల్ని సంతోష సంబరాలలో ముంచెత్తుతోంది.

సమయాన్ని గనుక ఆరాధనలో గడిపినట్లయితే

ఆ సమయం దేవుని సామీప్యానికి చేరుస్తుంది. దేవుని నియమావళి ప్రకారం మనిషి పసితనం నుండి  యుక్తవయస్సుకు యుక్తవయసు నుండి వృద్ధాప్యానికి చేరుకుంటాడు.  చిన్నతనంలోని పనులు యుక్తవయసులో చేయలేడు. ఒకవేళ అతను అలా వ్యవహరించినట్లయితే ప్రజలు అతనిని పిచ్చి వాని గా నిర్ధారిస్తారు. ఒక వ్యక్తి సమయం పై ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటాడు, మరొక వ్యక్తి దానిని పట్టించుకోడు. సమయం పై ఆధిపత్యం కలిగి ఉండే వ్యక్తి కాలం యొక్క స్వభావాన్ని తెలుసుకుని తన గుప్పెట్లో పెట్టుకుంటాడు దాని ప్రకారం గా తన కార్యకలాపాలను నిర్వహించుకుంటూ విజయం సాధిస్తాడు. తన ఉపాయాల ద్వారా తన అదృష్టాన్నేమార్చి వేసుకుంటాడు.తను ప్రయోజనం పొందుతూ ఎదుటి వారు ప్రయోజనం పొందడానికి మార్గదర్శి అవుతాడు. సమయాన్ని పట్టించుకోని వ్యక్తి సమయపాలన చేయడు, పట్టించుకోడు, పైగా బద్ధకంగా వ్యవహరిస్తాడు. ఇలాంటి వ్యక్తి జీవితం అపజయం పాలు అవుతుంది.అతడు అనామకంగా జీవిస్తుంటాడు. అందువల్ల యువకులు సమర్థులుగా తయారవ్వాలి. సమయాన్ని గౌరవించిన వాడు మంచి పనులు చేస్తూ ఉంటాడు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తన సామర్థ్యాన్ని పెంపొందించుకున్నప్పుడు అతడు ఒక గొప్ప వ్యక్తిగా పైకి వస్తాడు.

సామూహికంగా గాని, వ్యక్తిగతంగా గాని రెండు రూపాలలోనూ సమయమే పెట్టుబడి. గ్రంథ పఠనం ఇంటర్నెట్ కంప్యూటర్ సెల్ఫోన్ల వాడకం వర్తమాన కాలపు అవసరాలు. అయితే అనవసరమైన పుస్తక పఠనం సమయాన్ని వృధా చేస్తుంది. ఇంటర్నెట్ ను అవసరం మేరకు ఉపయోగించాలి. అవసరం కోసమే ఉపయోగించాలి. అశ్లీలం చూడడం వల్ల, అనవసరంగా ఇంటర్నెట్ వాడడం వల్ల వ్యతిరేక ఆలోచనలు పుట్టుకువస్తాయి. అదేవిధంగా అవయవాల వ్యవస్థ ఒక ప్రభావానికి లోనవుతుంది. సెల్ ఫోన్ కూడా అంతే. దానిని సరైన విధానంలో ఉపయోగించుకుంటే సమయం వృధా కాకుండా ఉంటుంది. పైగా సమయం మన అధీనంలోనే ఉంటుంది. అలా కాక వినోదం కోసం ఉపయోగిస్తే జీవితంలోని ఖరీదైన సమయం ఏమరపాటులో గడిచిపోతుంది. అయితే దీనిని సరైన  విధంగా ఉపయోగిస్తే ఇది ప్రయోజనకరమైనదే. దేవుడు, దేవుని నిదర్శనాలలో సమయం యొక్క ప్రాధాన్యత కానవస్తోంది. ఉదయించే సూర్యుని స్థితి ఒక విధంగా ఉంటే, అస్తమించే సమయం లో దాని స్థితిగతులు వేరుగా ఉంటాయి. పొద్దుక్కేవరకు పడుకునేవారు ఉదయపు వెలుగులను నోచుకోలేక పోతారు. చంద్రుని దశలు కూడా సమయానుకూలంగా నిర్ణయింపబడ్డాయి. ఇస్లామీయ బోధనల ప్రకారం సమయాన్ని చెడుగా చెప్పరాదు. ఎందుకంటే అల్లాహ్ యే సమయం గనుక అల్లాహ్ యే సమయాన్ని నిర్ణయించాడు. అందువల్ల అల్లాహ్ యే సత్యం గనుక అనేక మంది మేధావులు ఈ విషయాన్ని ఏకీభవిస్తున్నారు. అందువల్ల మనిషి సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి. అనవసరంగా సమయం వృధా చేయరాదు. భవిష్యత్తులో పశ్చాత్తాపం నుండి రక్షించుకోవడానికి దూరదృష్టి బైనాక్యులర్ల  అవసరం ఉంటుంది. దూరదృష్టిని బైనాక్యులర్ను  దృష్టిలో పెట్టుకొని రేపటి బంగారు దినం కోసం ఈరోజే  రచించుకోవాలి. రాబోయే సమయాన్ని తన జేబులో పెట్టుకుంటే విజయం సాధించగలుగుతారు

అనువాదం -మొహమ్మద్ అబ్దుల్ రషీద్

 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: