జూన్ 2021

 పేద ముస్లింల కోసం సామూహిక వివాహాలు

ఈ తరహా వివాహం చేసుకొన్న వారికి రూ.30వేల ఆర్థిక సహాయం

నశ్యం ఖుద్దూస్ వెల్లడి


(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

అగస్టు నెల 7వ తేదిన నంద్యాలలోని అంజుమన్ షాదిఖానాలో ఉచిత సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నట్లు అంజుమన్ అధ్యక్షులు నశ్యం అబ్దుల్ ఖుద్దూస్ తెలిపారు. ఇందుకోసం జులై నెల 31నాటికి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా గల అంజుమన్ లో ధరఖాస్తులు తీసుకోవాలన్నారు. వధూవరుల ఆధార్, ఫోటోలు జత చేసి దరఖాస్తు ఫారంను పూర్తి చేసిఇవ్వాలని సూచించారు. వధువు నంద్యాలకు చెంది వారై 18 ఏండ్లు నిండి ఉండవలెనని తెలిపారు. వివాహం రోజే రూ.30,000/-నగదు చెక్కు ఇవ్వబడునని ఖుద్దూస్ తెలిపారు. 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

 ఒంగోలు ఆంధ్రకేసరి యూనివర్శిటీ ఏర్పాటుపై డాక్టర్ ఏలూరి హర్షం

మంత్రులు బాలినేని, సురేష్ ల కృషి ఫలించిందని వ్యాఖ్య

కల సాకారమైందని ఆనందం

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

ఒంగోలు నగర శివారులో రూ.339 కోట్లతో ఆంధ్రకేసరి యూనివర్శిటీని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం వెల్లడైన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి స్పందించారు. ఆంధ్రకేసరి యూనివర్శిటీని ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.. మొట్టమొదటిసారి జిల్లాలో వర్సిటీని ఏర్పాటు చేస్తుండటం ఎంతో గర్వకారణం అని అన్నారు.. ఇందుకోసం తీవ్రంగా శ్రమించిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి, సహకరించిన మరో మంత్రి ఆదిమూలపు సురేష్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.. అదే విధంగా జిల్లాను అభివృద్ధి పధంలో పయనింపజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సదా రుణపడి ఉంటాం అని అన్నారు.
జిల్లాలో ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలన్నది తమ కల అని.. అది నేటితో సాకారం అయిందని ఏలూరి ఆనందంతో చెప్పారు.  యూనివర్సిటీ కోసం విద్యార్థి దశలో తాము ఓ చిన్నపాటి ఉద్యమాన్ని నడిపామన్న ఏలూరి.. 2008 ఎన్నికల ప్రచారంలో మహానేత వైఎస్ఆర్ గారిని కలిసి ప్రకాశం జిల్లాలో యూనివర్సిటీని ఏర్పాటు చెయ్యాలని తాము కోరగా.. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.. అయితే దురదృష్టశాత్తు ఆయన కాలం చేయడంతో ఆ తరువాత వచ్చిన పాలకులు ఈ అంశాన్ని మరుగున పడేశారని అన్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మళ్ళీ ఆశలు చిగురించాయని.. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు యూనివర్సిటీ సాధనకోసం ఎంతో కృషి చేశారని.. నేడు బాలినేని కృషి ఫలించి త్వరలో యూనివర్సిటీ ఏర్పాటు కాబోతుందని స్పష్టం చేశారు..ఇక జిల్లాకు వరప్రదాయిని అయిన వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయడం తోపాటు దొనకొండలో పారిశ్రమలు స్థాపిస్తు.. జిల్లాను అభివృద్ధి పయనంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏలూరి రామచంద్రారెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

 నంద్యాల ముస్లిం జేఏసీ విస్తృత స్థాయి సమావేశం

పార్టీలకు,జమాత్లకు అతీతంగా సమిష్టంగా నడుస్తాం

పలు తీర్మానాలు ఆమోదం


(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

నంద్యాల ముస్లిం జాయింట్ ఆక్షన్ కమిటి స్ధానిక ఆర్. కే. ఫంక్షన్ హాల్లో సర్వ సభ్య సమావేశం ఏర్పాటు చేసి విస్తృత స్థాయీ చర్చలు నిర్వహించింది. కన్వీనర్ అబ్దుల్ సమద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కో కన్వీనర్ ముహమ్మద్ అబులైస్, ట్రెజరర్ సుహైల్ రాణా,హాఫీజ్ అతాఉల్లా ఖాన్, మార్కెట్ యార్డు ఛైర్మన్ ఇసాక్ బాషా, కౌన్సిలర్ ముహమ్మద్ తమీం,మౌలానా ముఫ్తీ ముహమ్మద్ రఫీ, మాజి కౌన్సిలర్ ఖలీల్ అహమద్,మస్తాన్ ఖాన్ ,మోమీన్ గౌస్, గన్నీ అబ్దుల్ కరీం&పార్టీ, ఖలీల్ మౌలానా, హాఫీజ్ అబ్దుల్ హాది, మౌలాన సలాం, బిల్డర్ అబ్దుల్లా, ఫాజిల్ దేళాయ్, అడ్వకేట్ ఖాద్రి,యంఇయం అక్బర్ , యస్. బి షహెన్షా,న్యాయం మహబూబ్ బాషా, అబ్దుల్ నయీం, ముహమ్మద్ యూనూస్, అబ్దుల్ అలీం, ఆసిఫ్, బోరుగుల్ అక్బర్, డా.నజీర్, అబూబకర్, బ్లడ్ సద్దాం లు, పీ.వి వహబ్ , హిదయతుల్లా ఖాన్ ,రసూల్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో కింది తీర్మానాలు ఎకగ్రీవంగా ఆమోదించారు.

1.వైయస్సార్ నగర్ లో కేటాయించిన మూడు మతాల ఖనన,శ్మశానవాటికలకు రోడ్లు ఏర్పాటు చేసి ప్రహరీ గోడలం నిర్మించాలి.

2.ప్రధాన మంత్రి PMJVK స్కీమ్ క్రింద గ్రాంట్ అయిన పథకాలకు స్ధల సేకరణ చేసి భవనాలు కట్టించాలి.

3.ఉర్దూ కళాశాలకు పూర్తి స్థాయు ఆధ్యాపకులను నియమించాలి.

4.అన్యాక్రాంతం అయిన వక్ఖ్ అస్తులను పరిరక్షించి స్వాధీనం చేసుకోవాలి.

5.RARS ఉనికిని స్థలాలను కాపాడాలి.

6. మున్సిపల్ ఇంటి,చెత్త పన్నుల నిర్ణయం ఉపసంహరించాలి.

7. ఏన్నికల ప్రణాళి ప్రకారం ముస్లిం మైనార్టీ సబ్ ప్లాన్ అమలు చేయాలి.

8. రెండు సంవత్సరాలుగా నిలిచి పోయిన  దుల్హన్ పథకానకి నిధులు ఇచ్చి వెంటనే అమలంచేయాలి.

9.ప్రధానమంత్రి 15సూత్రాల పథకం 

అమలు చేస్తూ కలెక్టర్ సమావేశాలు నిర్వహించాలి.


 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

 జగనన్న కాలనీలపై ప్రత్యేక సమావేశం

భూమి పూజలకు సన్నాహాలు


(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

తర్లుపాడు మండలం లోని కలుజువ్వలపాడు గ్రామ సచివాలయంలో జగనన్న కాలనీల భూమిపూజ కార్యక్రమం, వైయస్సార్ భీమా ఈ కేవైసీ కి సంబంధించి సచివాలయంలో పంచాయతీ సర్పంచ్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. వాలంటీర్లకు, వివో ఏ లకు జగనన్న కాలనీలు,  లబ్ధిదారులను మ్యాపింగ్ చేసి వచ్చేనెల  1, 3, 4 తేదీలలో లబ్ధిదారులు అందరూ భూమి పూజ చేసుకొనే   విధంగా చూడాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. ఈ కార్యక్రమంలో  ఏ పీ ఎం  డి. పిచ్చయ్య,  గ్రామ సర్పంచ్, కార్యదర్శి,, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, సి సి లు, వివో ఏలు, మరియు గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

 ఏ1 గ్లోబల్ విద్యా సంస్థల వ్యవస్థాపకులు మీర్జా ఉస్మాన్ భేగ్ ఇంటా విషాదం 

ఆయన సతీమణి జాహిదా భేగం మరణం

ఎమ్మెల్యే లతో పాటు పలువురు నివాళి 


(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

            ఏ1 గ్లోబల్ విద్యా సంస్థల వ్యవస్థాపకులు మీర్జా ఉస్మాన్ భేగ్ సతీమణి జాహిదా భేగం మరణించారు. దీంతో ఆయన ఇంటా ఇంటా విషాద ఛాయలు అలుముకొన్నాయి. జాహిదా భేగం కు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఆమె బౌతిక కాయం శనివారం అర్ధరాత్రి  పట్టణంలోని ఉస్మాన్ భేగ్ నివాసానికి  అర్ధరాత్రి చేరుకుంది. ఈ సమాచారం అందుకున్న  సన్నిహితులు పెద్ద సంఖ్యలో భేగ్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సతీమణి మృతితో శోకసంద్రంలో వున్న ఏ1 గ్లోబల్ విద్యా సంస్థల వ్యవస్థాపకులు మీర్జా ఉస్మాన్ భేగ్, వారి కుమారులు యమ్ జాఫర్ అలీభేగ్, కాలేజీ చైర్మన్ షంషీర్ అలీభేగ్ సోదరులను ఎమ్మెల్యేలు కె నాగార్జున రెడ్డి,అన్నా రాంబాబు, మాజీ ఎమ్మెల్యేలు జంకే వెంకటరెడ్డి,పాలపర్తి డేవిడ్ రాజు,   రాష్ట్ర వైసీపీ కార్యదర్శి వెన్నా హనుమారెడ్డి,జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం,

మీర్జా ఉస్మాన్ భేగ్ 

మున్సిపల్ చైర్మన్ చిర్లంచెర్ల క్రిష్ణ, వైస్ చైర్మన్ ఎస్ కె ఇస్మాయిల్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ గుంటక కృష్ణవేణి సుబ్బారెడ్డి, వైస్ ఛైర్మన్ బొగ్గరపు శేషయ్య, నియోజకవర్గ సీపీఐ కార్యదర్శి అందే నాసరాయ్య, మున్సిపల్ కమిషనర్ సిఎంఏ నయిమ్ అహమ్మద్, జానో జాగో వెబ్ న్యూస్ గుంటూరు మరియు ప్రకాశం జిల్లాల బ్యూరో చీఫ్ షేక్ గౌస్ బాష, ఏ1 గ్లోబల్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీధర్, ఎన్ ఎస్ అగ్రికల్చర్ కాలేజీ కరస్పాండెంట్ ఎన్ చంద్రమౌళి, నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ ఇమ్మడి కాశినాథ్, టీడీపీ నాయకులు గొట్టం శ్రీనివాస రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్స్ బుస్సేట్టి నాగేశ్వరరావు, దారివేముల హర్షిత బాబి, చాటకొండ చంద్ర, మాజీ జడ్పిటిసి జవ్వాజి రంగారెడ్డి, ఆర్ భాష పతిరెడ్డి తదితరులు పరామర్శించారు. ఈ సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. 

అంతిమయాత్రలో అంతిమ యాత్రలో ఎమ్మెల్యే.కుందూరు.. మునిసిపల్ ఛైర్మన్  

జాహిదా భేగం అంతిమయాత్రలో  ఎమ్మెల్యే కె నాగార్జున రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చిర్లంచెర్ల బాల మురళి క్రిష్ణ, రాష్ట్ర బిసి జనసభ ప్రధాన కార్యదర్శి పీఎల్పీ యాదవ్,  మున్సిపల్ కౌన్సిలర్ యమ్ సిరాజ్ భేగ్, వైసీపీ నాయకులు డాక్టర్ ఎస్ కె మాక్బుల్, గుంటక వెంకటరెడ్డి,ఎస్ కె కరీం భాష తదితరులు పాల్గొన్నారు.


✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

 టీచింగ్, నాన్ టీచింగ్..కింది స్ధాయి ఉద్యోగుల కొరకు,,,

ప్రత్యేక పథకాన్ని ప్రవేశ పెట్టాలి

ఏపీ వినియోగదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకటేశ్వర రావు 


(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

మార్కాపురం నియోజకవర్గ స్థాయి ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్లు యూనియన్ సమావేశం ఈరోజు స్దానిక ఎన్ జీ ఓ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న ఏపీ వినియోగదారుల సంఘము రాష్ట్ర అధ్యక్షుడు కోడూరి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ సంవత్సరం కరోనా నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలలు,కళాశాలలు మూత పడటంతో అందులో పనిచేస్తున్న టీచర్స్,ఆయమ్మలు, స్వీపర్స్, డ్రైవర్స్,క్లీనర్స్, క్లర్క్స్, అటెండెర్స్ లాంటి వారి జీవితాలు జీతం లేక సతమతం అవుతున్నారు. వీరిని ఆదుకొనుటకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని ప్రవేశ పెట్టాలని కోరారు.రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆదుకోవడం హర్షించదగ్గ విషయం. అలాగే వందలాదిమంది ప్రైవేట్ స్కూల్స్ నమ్ముకొని జీవనోపాది పొందుతున్నారు.

కరోనా కారణముగా ప్రవేటు పాఠశాలల యాజమాన్యాలతోపాటు పనిచేస్తున్న ప్రతిఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు వీరి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మాట్లాడారు. ప్రభుత్వం మీద ఆధార పడకుండా ప్రైవేట్ జాబ్స్ చేస్తూ కుటుంబాలు పోషించుకుంటున్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో బడులు తెరిచే అవకాశం లేనందున ప్రభుత్వమే అండగా ఉండాలని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు టి.నాగేశ్వరరావు, ఓ రామాంజనేయులు, జి.కృష్ణ చౌదరి, దుర్గా లక్ష్మీ,సరస్వతి, మహేష్,కె.అరుణ.ఓ శైలజ తదితరులు పాల్గొన్నారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

 అంగన్ వాడీల సమస్యలను పరిష్కరించాలి

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ర్యాలీ


(జానో జాగో వెబ్ న్యూస్ - మార్కాపురం ప్రతినిధి)

ప్రకాశం జిల్లా మార్కాపురం అంగన్వాడి వర్కర్స్ యూనియన్ అండ్ హెల్పర్స్ ఏ ఐ టి యు సి ఆధ్వర్యంలో పూల సుబ్బయ్య భవన్ నుండి ర్యాలీగా ఆర్డిఓ ఆఫీస్ లోకి వెళ్లి సూపర్డెంట్ నెహ్రు బాబు కి వినతి పత్రం సమర్పించారు. అంగన్వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలలలో విలీనం ఆపాలి, నూతన విద్యా విధానము రద్దు చేయాలి, అంగన్వాడి వర్కర్స్ కు అండ్ హెల్పర్స్ కు సంబంధించిన అన్ని సంక్షేమ పథకాలు వర్తింప చేయాలి పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం 18000 ఇవ్వాలి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ కు నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి అని తెలియచేస్తూ విజ్ఞాపన పత్రాన్ని  అందచేశారు.  ఈ కార్యక్రమంలో షేక్ ఖాసిం ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సి హెచ్ వెంకట రత్నం జిల్లా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అధ్యక్షులు యూనియన్ నాయకులు కె రమాదేవి రజిని కుమారి ఇ టి ఎస్ శివలక్ష్మి జి గోవిందమ్మ మొదలగు వారు పాల్గొన్నారు. 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 


 

అర్హతున్న జర్నలిస్టులందరికీ గుర్తింపు కార్డులు

మంత్రి పేర్ని నాని 


(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

అర్హత ఉన్న ప్రతి జర్నలిస్ట్ కు ఈనెల 28 నుంచి  అక్రిడేషన్ కార్డులు జారీ చేస్తామని సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ పూర్తయ్యాక జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం సవరించిన మార్గదర్శకాలతో ఇచ్చిన జీవో 142 ప్రకారం అర్హత ఉన్న ప్రతి జర్నలిస్టు కు అక్రిడేషన్ కార్డు జారీ చేస్తామని ఆయన స్పష్టంచేశారు.  ప్రభుత్వ జీవోను హైకోర్టు సమర్ధించినందున న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈనెల 28 నుంచి అక్రిడేషన్లు జారీ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

 

పెండింగ్​లో ఉన్న వారి అక్రిడేషన్లను పరిశీలించి సత్వరమే జారీ చేస్తామన్నారు. ఇకపై నిరంతరాయంగా అక్రిడేషన్లు జారీ చేస్తామన్న మంత్రి పాత్రికేయులు ఎప్పుడైనా కొత్తగా అక్రిడేషన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. గుర్తింపు కార్డుల మంజూరు కోసం రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని.. రాష్ట్ర స్థాయి కమిటీలో ఐ అండ్ ​పీఆర్ (I&PR) కమిషనర్, జిల్లా స్థాయిలో కలెక్టర్ ఛైర్మన్​గా ఉంటారన్నారు. కమిటీలో వైద్యారోగ్యశాఖ,లేబర్, హౌసింగ్, రైల్వే, ఆర్టీసీ, ఐఅండ్పీఆర్ అధికారులు సభ్యులుగా ఉంటారన్నారు. కమిటీలు ప్రభుత్వానికి చిన్న పేపర్లంటే చిన్నచూపు లేదని.. నిబంధనల మేరకు వారికి న్యాయం చేస్తామన్నారు. కొవిడ్ వల్ల మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబాలకు సీఎం జగన్ ఖచ్ఛితంగా న్యాయం చేస్తారన్నారు. అక్రిడేషన్ల ప్రక్రియ ఆగిపోవడంతోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియ ఆగిందన్నారు. గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ పూర్తయ్యాక జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి నాని వెల్లడించారు.


 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 వీరభద్ర స్వామి కాంప్లెక్స్ కి శంకుస్థాపన చేసిన

ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి


(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

     ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రం అయిన స్థానిక బస్టాండ్ సెంటర్లో గల వీరభద్ర  స్వామి గుడి చుట్టూ ఉన్న గోడను తొలగించి ఆలయ అభివృద్ధి కొరకు చుట్టు గదులు నిర్మించి అద్దెకు ఇచ్చుటకు  కొత్తగా కాంప్లెక్స్ నిర్మాణానికి శనివారం రోజున మార్కాపురం శాసన సభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి శంకుస్థాపనకు శ్రీకారం చుట్టారు.. భూమి పూజలో పాల్గొని శంకుస్థాపన చేశారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమంలో  ఆలయ ధర్మకర్త నేరెళ్ల.సాంబశివ, వైసిపి నాయకులు  మాజీ సర్పంచ్ సూరెడ్డి.సుబ్బారెడ్డి, గొల్లపల్లి మాజీ సర్పంచ్ యక్కంటీ.రామిరెడ్డి, వైసిపి రైతు సంఘం విభాగం నాయకులు వెన్న. సత్యం, మాజీ ఎంపిటిసి సభ్యులు షేక్ అక్బర్ అలీ తదితరులు పాల్గొన్నారు. ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 బాలానగర్ ప్లయ్ ఓవర్ బ్రిడ్జ్ కు పి.జె.ఆర్ పేరు పెట్టాలి

కేసీఆర్ కు కాంగ్రెస్ నేత జి.నిరంజన్ విఙప్తి

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

పూర్వ ఖైరతాబాద్ నియోజకవర్గం నుండి అసెంబ్లీకి 5 సార్లు ఎన్నికై ఆ ప్రాంత ప్రజలకే కాక యావత్ తెలంగాణా ప్రజల కోసము అహర్నిశలు కృషి చేసిన తెలంగాణా ముద్దుబిడ్డ, మాజీ సి.ఎల్.పి నాయకులు పి.జనార్ధనరెడ్డి స్మారకార్థం హైదరాబాద్ బాలానగర్ లో కొత్తగా నిర్మించిన " బాలానగర్ ప్లయ్ ఓవర్ బ్రిడ్జ్ కు పి.జె.ఆర్ ప్లయ్ ఓవర్ బ్రిడ్జ్" గా పేరు పెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి జి.నిరంజన్ విఙప్తి చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు ఆయన ఓ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆ లేఖలో ఇలా పేర్కొన్నారు...ఈ నియోజకవర్గ ప్రాంతాల అభివృద్దికి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, కార్మిక వర్గాలకు అండగా నిలుస్తూ , రాత్రింబగళ్లు కృషి చేసిన ఆయన అందరి హృదయాల్లో, అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పటికీ తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పర్చుకున్నారని సి.ఎమ్ దృష్టికి తేవడము జరిగింది. మంత్రిగా ఆ పదవికే వన్నె తెచ్చిన పి.జె.ఆర్, సి.ఎల్.పి. నాయకుడిగా ప్రజా సమస్యలపై చేసిన పోరాటాలు ఇప్పటికీ ఎవరూ మరువలేరు. సి.ఎల్.పి నాయకుడు అనే పదానికి, ఆ పదవికి ప్రాశస్త్యం దక్కించింది ఆయనే. తాను అసువులు బాసే వరకు తెలంగాణా ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై తన గళాన్ని విన్పించారు. పోరాటాలు చేశారు. 2004 లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారము లోనికి వచ్చిన తర్వాత తెలంగాణా గళాన్ని వినిపించే ఆయనను రాష్ట్ర మంత్రివర్గములోకి తీసుకోక పోవడము ప్రజలను ఆశ్చర్య పరిచినది. ఆయినా పి.జె.ఆర్ వెనక్కు తగ్గలేదు. ప్రజాసమస్యలపై, తెలంగాణాకు జరుగుతున్న అన్యాయాలపై తన పోరాటాన్ని ఆపలేదని వివరించారు. 610 జి.ఓ అమలు పై, పోతిరెడ్డిపాడు అంశముపై, హైదరాబాద్ కు క్రిష్ణా జలాలు తీసుకు రావడముపై ఆయన అసెంబ్లీలోనా, బయటా ఆయన చేసిసి పోరాటం మరువలేనిది. ఆయన ఇంత త్వరగా మన మధ్యలో నుండి పోయే వారు కాదు. కాని ఆయనను తీవ్రమైన మనోవ్యధకు గురి చేయడము వలననే అసువులు బాశారు. బాలానగర్ ప్రాంతము కూడా ఆయన హయాంలోనే అభివృద్ది చెందింది. 1998 లోనే పి.జె.ఆర్ బాలానగర్ ప్లయ్ ఓవర్ బ్రిడ్జ్ కు ప్రపోజల్ కూడా పెట్టడం జరిగినది. అది ఇప్పుడు సాకారమవుతుంది. ఈ ప్రాంతముతో ఆయనకున్న అనుబందము తెలియనిది కాదు. ఈ ప్రాంతమంతా ఆయన అనుయాయులమయము.ఆయన అనుయాయులు ఒక్క పార్టీలోనే కాదు. అన్ని పార్టీలలో ఉన్నారు.తెలంగాణా మట్టిబిడ్డకు నివాళులర్పించేందుకు ఇదొక సదవకాశము. వివక్షతకు గురైన తెలంగాణా బిడ్డను, పోరాటయోధుడిని సదా స్మరించుకోవడానికి, బాలానగర్ ప్లయ్ ఓవర్ బ్రిడ్జ్ కు " పి.జె.ఆర్ ప్లయ్ ఓవర్ బ్రిడ్జ్ " గా నామకరణం చేయాలి. అని సీఎం కేసీఆర్ కు రాసిన లేఖలో ఆయన కోరారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

 మాదక ద్రవ్యాలతో...

మెదడుకు శరీరానికి సమాజానికి చేటు 

సారాయి అన్ని చెడులకు మూలం

దానికి దూరంగా ఉండడమే మేలు

అమెరికన్ మనస్తత్వవేత్త డాక్టర్ మొహమ్మద్ ఖుతుబుద్దీన్

డాక్టర్ మొహమ్మద్ ఖుతుబుద్దీన్

మాదక ద్రవ్యాలు అన్ని చెడు లకు మూలం. దీనికి దూరంగా ఉండాలి. చూడడానికి ఎంతో బాగుంటుంది. పళ్ళు ఫలాలు ధాన్యాలను మరగబెట్టి అంటే Formetation తో తయారు చేయబడుతుంది. సారాయి చాలా నష్టదాయకమైనది.  సారాయి వల్ల లాభం తక్కువ, నష్టాలు ఎక్కువ. సారాయి ఎంతగా నష్టం చేకూరుస్తుందో దానికి చరిత్రే సాక్ష్యం.సారాయి వల్ల అనేక జాతులు ఇంకాRoman Empire కూడా నాశనమయ్యాయి. సారాయి వల్ల అనేక పెద్ద పెద్ద నష్టాలు కూడా ఉన్నాయి. ప్రముఖ చారిత్రక గ్రంధాలలో దాని చెడు గురించి వ్రాయబడి ఉంది. అంతేకాదు మాదకద్రవ్యాల సేవనం వల్ల జరిగే ఆర్థికపరమైన, సామాజిక పరమైన నష్టాలు కూడా ఉన్నాయి.


మానవుల కోసం సారాయి సేవనం గొప్ప ప్రమాదం కలిగిస్తుంది. ఐక్యరాజ్యసమితి తన రిపోర్టులో, పటిష్టమైన అభివృద్ధి సాధించడంలో మత్తు అడ్డంకి అని చెప్పింది. సమయం వృధా కావడంతోపాటు అశ్లీలం తర్వాత అన్నింటికంటే ఎక్కువ చాలెంజ్ గా నిలిచింది మాదకద్రవ్యాలే. మత్తు సేవించేవారు ఆల్కహాల్ తో పాటుNarcotics నిద్ర మాత్రలు pain killer వంటి టాబ్లెట్స్ కూడా వాడుతుంటారు. మత్తు కోసం ఎన్నో పదార్థాలు ఉన్నాయి ఉదాహరణకు, మత్తు గల పౌడర్ను ముక్కులోకి పిలుస్తుంటారు. ఇంజెక్షన్ కూడా తీసుకుంటారు. (ఇంజక్షన్ వల్ల ఎయిడ్స్ వంటి భయంకరమైన వ్యాధి సోకే ప్రమాదం కూడా ఉంటుంది) అదేవిధంగా సిగరెట్లో డ్రగ్స్  కలిపి మత్తు కలిగించుకుంటారు. ప్రముఖ సంస్థ లెక్కల ప్రకారం విశ్లేషించి నట్లయితే జనాభాలోని 18 నుండి 20 శాతం మంది  ప్రజలు మాదక ద్రవ్యాలు వాడుతున్నారు. భారతదేశంలో రమారమి 200 మిలియన్ల కంటే అధిక ప్రజలు సారాయి తాగుతున్నారు.

   సారాయి తాగిన మనిషి తన శరీరంలో సత్తువ వచ్చిందని భావిస్తాడు. కానీ అది సారాయి కాదు అని వారు తెలుసుకోవాలి. నెమ్మది నెమ్మదిగా అది తెలిసిపోతూ ఉంటుంది. ప్రత్యేకించి యువకులకు  అది తీవ్ర నష్టం కలగజేస్తోంది. అది మెదడును, ఆలోచనలను దెబ్బతీస్తుంది. పైగా యువకులు మార్గం తప్పి పోతుంటారు. అనేక మంది యువకుల సామర్థ్యం నిర్వీర్యమై పోతుంటుంది. యువకులు సమర్ధుల యినప్పటికీ సారాయి తాగడం వల్ల తమ సామర్ధ్యాలను కోల్పోతున్నారు. ఈ విషయం సమాజానికి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఆల్కహాల్ overdose వల్ల అనేక మంది యువకులు మృత్యువాత పడుతున్నారు. మత్తు సేవించడం వల్ల ఎంతోమంది యువకుల ఆలోచనలు, శరీరం ప్రభావితం అవుతున్నాయి. యువకుల తల్లిదండ్రులు వారిని కనిపెడుతూ ఉండాలి. స్నేహితులతో వెళ్లడం గురించి, పార్టీ లలో పాల్గొనడం గురించి, రాత్రులలో ఆలస్యంగా ఇంటికి వచ్చే విషయం గురించి, ఆరా తీస్తూ ఉండాలి. తల్లిదండ్రులు గనుక అశ్రద్ధ చేసినట్లయితే పిల్లలు మాదకద్రవ్యా లకు  అలవాటు పడిపోతారు. ఇది సమాజానికి చాలా నష్టదాయకం.

    సారాయి తాగడం వల్లNervous system పై చాలా ప్రభావం పడుతుంది. దీనివల్ల మనిషి యొక్క cognitive system చెడిపోతుంది.

    సారాయి నిజానికి అదొక విషం taxin poison. ఇది మెదడును, నరాల ను పక్షవాతానికి గురి చేస్తుంది. అందువల్ల శరీరానికి కావలసింది ఏమిటో మనిషికి తెలియకుండా పోతుంది. సారాయి కేవలం మెదడు పైన నే కాక గుండెపై, కాలేయంపై కూడా ప్రభావం చూపుతుంది. సారాయి తాగడం వల్ల గుండె బలహీనపడుతుంది. అందువల్ల అది క్రమక్రమంగా నిర్వీర్యమై పోతుంది. ఇదేవిధంగా కాలేయం కూడా పనిచేయకుండా పోతుంది. దానివల్ల livercancenr కూడా వచ్చేస్తుంది. కొన్ని సందర్భాలలో సారాయి (ఆల్కహాల్) వల్ల  హై బ్లడ్ ప్రెషర్ వచ్చేస్తుంది. ఆల్కహాల్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడాన్ని అడ్డుకుంటుంది. సారాయి తాగడం వల్ల జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది. మనిషి కొన్ని సందర్భాలలో Alzheimer's వంటి వ్యాధికి కూడా గురవుతాడు. అప్పుడు మనిషి ఏం చేస్తున్నాడో కూడా అతనికి తెలియకుండా పోతుంది. ఎవరు ఏమిటి అని అనుకుంటున్నప్పుడు అతని మెదడు పరిమితంగా ఆలోచించడం మొదలు పెడుతుంది. డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలతో  పాటు సామాజికంగా ఆర్థికంగా జరిగే నష్టాలు కూడా ఉన్నాయి. సారాయి మనిషి వ్యక్తిగత జీవితాన్ని, సామాజిక జీవితాన్ని నాశనం చేయడమే గాక ఇంటిని రాక్షస నిలయం గా మారుస్తుంది.

భార్యా భర్తల లో అభిప్రాయభేదాలు కలిగిస్తుంది. బంధుత్వాలలో చీలికలు తెస్తుంది. కుటుంబాలలో ఉండే సంతోషాలను సారాయి తుడిచిపెట్టుకుపోతుంది. సారాయి సేవనం వల్ల పిల్లల చదువు పై ప్రభావం పడుతుంది. సంపాదన గుల్లయిపోతుంది. అందువల్ల పిల్లల పోషణ సరిగా జరగదు. ఇంకా చెప్పాలంటే సారాయి, కుటుంబాలలో అనేక చిక్కులు తెచ్చిపెడుతుంది.

ట్రాఫిక్ ప్రమాదాలలో మనిషి ఖరీదైన జీవితం అనంత లోకాల్లోకి వెళ్ళిపోతుంది. గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయి పోతుంది. ఇవి సారాయి తాగడం వల్ల జరిగే నష్టాలు. WHO విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం ప్రపంచమంతటా సారాయి తాగేవారు ప్రతిరోజు 60 వేల మంది మరణిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం జరిగే రోడ్డు ప్రమాదాలలో తాగేవారు లక్షల్లో చనిపోతున్నారు. నేరాల గురించి చెప్పాలంటే సారాయి తాగడం వల్లనే అనేక నేరాలు, జగడాలు జరుగుతున్నాయి. హత్యలు Homicide జరుగవచ్చు. దీనివల్ల శాంతిభద్రతలలో అంతరాయం కలగవచ్చు. ఏ సమాజంలోనైనా మద్యపాన సేవనం అధికమైతే అక్కడ  

లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తవచ్చు. దానివల్ల అనేక సామాజిక ఆర్థిక సమస్యలు ఉత్పన్నమవుతాయి.

సారాయి తాగడం వల్ల బీదరికం ఆకలి చావులు జనించ వచ్చు. ఆత్మహత్యలు అత్యధికంగా పెరిగి పోతూ ఉంటాయి. సామాజిక నష్టాలతో పాటు ఆధ్యాత్మిక నష్టాలు కూడా మనిషికి కలగవచ్చు. సారాయి తాగేవాడు న్యూనతకు గురవుతుంటాడు.  సారాయి మనిషి అంతరాత్మను నిర్జీవ పరుస్తుంది. అతని నుండి శాంతి శ్రేయాలు దూరమై పోతాయి. మనిషి ఒక  విచిత్రమైన స్థితికి లోనవుతాడు.

చాలా మత గ్రంథాలలో సారాయి నష్టదాయకమైన దని వ్రాయబడి ఉంది.

ఇస్లాం మద్యపాన సేవనం గురించి కఠినంగా నిషేధం విధించింది. సారాయి చెడు లన్నింటికీ మూలం అని నిర్దేశించింది. దీనికి దూరంగా ఉన్నవారు చెడు లన్నింటికీ దూరంగా ఉంటారు. సారాయిని అరబీ భాషలో kamar అని అంటారు kamar అంటే తెలివితేటలను మరుగుపరు చునది. సారాయి వల్ల తెలివితేటలు మందగించడంతో పాటు ఆరోగ్యం పైకూడా ప్రభావం చూపుతుంది. అనేక మంది మేధావులు అంటే ఫయాజ్ గౌరి, ఇబ్నెసీనా, న్యూటన్ వంటి వారు సారాయిని వ్యతిరేకించారు. ఆల్కహాల్ తాగడం వల్ల మనిషి ఆల్కహాల్ కు బానిసయిపోతాడు. మనిషి జ్ఞానాన్ని అది  మందగించేలా చేస్తుంది.అందువల్లనే ఆల్కహాల్ ను killer of wisdom అంటారు. అసలైతే ఆల్కహాల్ మత్తు కలిగించే పదార్థాలు మనిషి కోసం అది (Neurotoxin) విషం.

కొంతమంది తమ బాధలను మరవడానికి ఉల్లాసంగా ఉండటానికి మద్యం సేవిస్తూ ఉంటార. కానీ కొత్తగా భవిష్యత్తు కోసం దుఃఖం కొనుక్కుంటున్నా మని వారు తెలుసుకోవాలి.  ఒక గుక్క తమకు ఆరోగ్యం కలిగిస్తుందని భావిస్తారు. కానీ అదే వారి జీవితాన్ని హరించి వేస్తుంది. దాని నుండి సురక్షితంగా ఉండ దలిస్తే పాముకు ఎలా భయపడతామో అలా మాదకద్రవ్యాలకు భయపడాలి. అలాగే సారాయికి కూడా భయపడాలి. సారాయి తాగే స్నేహితులకు దూరంగా ఉండాలి.

సమాజంలోని పెద్దలు సారాయి గురించి ప్రజలలో జాగృతి కలిగించాలి, దాని  లొసుగుల గురించి తెలియజేయాలి. ప్రత్యేకించి యువకులను ఆ చెడు నుండి ఆపడానికి కొన్ని సూత్రాలను నియమాలను రూపొందించుకోవాలి.

సారాయి ఒక క్యాన్సర్ వంటిదని సమాజానికి తెలియజేయాలి.ఇది సమాజ పునాదులను పెకిలించి  వేస్తుంది. ప్రారంభంలోనే ఎవరైనా సారాయి విడిచిపెట్టినట్లయితే అతను  చిదరించు కోవడం, కోపగించుకోవడం, తిట్టడం, కొట్టడం చేస్తుంటాడు. ఇలాంటి సున్నితమైన సమయంలో కుటుంబం సపోర్టు బంధుమిత్రుల సపోర్టు చాలా అవసరం. అలా సపోర్ట్ అనేది అతనిలో అభిమానం కలుగజేస్తుంది. అతడు పూర్తిగా సారాయి విడిచిపెట్ట వచ్చు కూడా. ఇలాంటి సున్నిత సమయంలో సారాయి విడిచి పెట్టే వారిని ప్రోత్సహించాలి. ఈ విషయంలో  అనుభవజ్ఞులైనవారి సలహాలను కూడా పాటించాలి.

 సారాయి విడిచిపెట్టాల నుకున్నప్పుడు అతడు సామాజిక సేవకు ఉపక్రమించాలి. ఆరాధనలో నిమగ్నమైపోవాలి. సారాయి కి బదులుగా బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోవాలి.

ప్రతి సంవత్సరం ఐక్యరాజ్య సమితి 26 జూన్ నాడు international day against drug abuse  జరుపుతుంది. రండి మనమంతా ఈరోజు సారాయిని, ఆల్కహాల్ ను, మత్తుపదార్థాలను కూకటివేళ్లతో పెకలించి వేద్దాం. మన సమాజాన్ని మత్తు పదార్థాలు లేని పవిత్ర సమాజంగా తీర్చిదిద్దుద్దాం.


తెలుగు అనువాదం-మొహమ్మద్ అబ్దుల్ రషీద్

సెల్ నెం-9848516163

హైదరాబాద్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

 భారతదేశంలోనే మొదటి రిజర్వేషన్ల పితామహుడు...

ఛత్రపతి సాహు మహారాజ్

ఘన నివాళ్లులర్పించిన ఆంధ్ర బహుజన ప్రజావేదిక


(జానోజాగో వెబ్ న్యూస్-కదిరి ప్రతినిధి)

అనంతపురం జిల్లా, కదిరిలో "ఆంధ్ర బహుజన ప్రజావేదిక" ఆధ్వర్యంలో ఛత్రపతి సాహు మహరాజ్ గారి 148వ జయంతిని ఆయన చిత్ర పటానికి పూలమాల సమర్పించి ఘనంగా జరుపుకోవడం జరిగింది.  భారతదేశ చరిత్రలో దళిత, బహుజనులను బ్రాహ్మణుల పెత్తనం నుండి విముక్తి చేయటానికి సైద్ధాంతికంగా, పాలనపరంగా  మహాత్మ జ్యో తిబాపూలే, ఛత్రపతి శివాజీ ల వారసుడిగా కృషి చేసి భవిష్యత్ భారతానికి సామాజిక న్యాయ, ప్రజాస్వామిక తాత్విక పునాదిని ఏర్పరచి ప్రజల రాజుగా మిగిలిపోయిన మహానీయుడు, రాజర్షి ఛత్రపతి సాహుమహారాజ్ .

         1874 జూన్ 26 న రాధాబాయి, జయసింగ్ ఆబాసాహేబ్ ఘాట్గేలకు జన్మించిన యశ్వంతరావుఘాట్గేనే ఆ తర్వాత కాలంలో సాహు మహారాజ్ గా  ప్రసిద్ది చెందుతాడు. ఘాట్గేలు మహారాష్ట్ర లో వెనుకబడిన తరగతులకి చెందిన కున్భీ, వ్యవసాయం చేసుకొని జీవించేవారు. కొల్హాపూర్ రాజ్యంలో వారసులు లేకుంటే నాల్గవ శివాజీ భార్య రాణీ ఆనందబాయి 1884 మార్చి,17న  దత్తపుత్రుడిగా స్వీకరించి  యశ్వంతరావుఘాట్గేకి ముద్దుగా "సాహు" అని పేరు పెట్టుకుంటది. మూడేళ్ళకే తల్లిని కోల్పోయిన సాహు, 1886 మార్చి 20న తండ్రి మరణంతో 11 ఏళ్ళకే తల్లిదండ్రులిద్దరులేని  వాడైనాడు.

          యుక్తవయసు రాగానే 1894 ఎప్రిల్ 2 న సింహాసనం అధిష్టిస్తాడు సాహు. 1900 వ సంవత్సరం అక్టోబర్ నెలలో ఒక రోజు సాహు మహారాజ్ పంచగంగా నదిలో స్నానం చేస్తున్న సమయంలో బ్రాహ్మణ పురోహితుడు స్నానం  చేయకుండానే వచ్చి సాహు మహారాజ్ క్షత్రియ వంశస్తుడు కానందున ఒక వ్యవసాయం  చేసుకునే కులానికి చెందిన శూద్రుడైనందున ఈశడిoపుతో వేదోక్త మంత్రాల బదులు పౌరాణిక  మంత్రాలు చదివి అవమానిస్తాడు. పుట్టుకతోనే మనిషి కులం నిర్ణయించబడుతుందనీ రాజైనంత మాత్రాన,  దత్తత వచ్చినంత మాత్రాన క్షత్రియుడిగా మారిపోడని వాదనకు దిగుతాడు. ఈ సంఘటన సాహు మహారాజ్ ని మహాత్మ జ్యోతిబాపూలే సత్యశోధక సమాజ్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే వారసత్వాన్ని ఎన్నుకోవడానికి కారణమైతది. బాస్కరరావు జాదవ్ అనే ఉద్యోగిని  "సత్యశోధక్ సమాజ్" నడిపే బాధ్యతలు అప్పచెప్పి "మరాఠ దీనబందు" పేరుతో పత్రికని నడిపించి సత్యశోధక సమాజ తాత్విక దృక్పథాన్ని ప్రచారం చేయించిండు.  


            బ్రాహ్మణేతరులకి పురోహిత శిక్షణనిచ్చేందుకు సత్యశోధక్ సమాజ్ ఆధ్వర్యంలో పాఠశాల ప్రారంభమైంది. కొల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో వందలాది వివాహాలు, వేడుకలు సత్యశోధక్ సమాజ్ పద్దతిలో జరిగాయి.  బ్రాహ్మణేతరులని ఉన్నతోద్యాగాల్లోకి తెస్తే తప్ప వారి సామాజిక హోదాలో, జీవితాల్లో మార్పు రాదని, బ్రాహ్మణ ఆధిపత్యానికి అడ్డుకట్టపడదని భావించిండు.  

             వెనుకబడిన కులాల వారందరికి స్కూల్స్, హాస్టల్స్  ప్రారంభించి విద్యని ఒక ఉద్యమంగా నడిపిండు. కొల్హాపూర్ పట్టణంలో హాస్టల్స్ కాలనీనే నిర్మించిండు. 1901లో జైన హాస్టల్, విక్టోరియ మరాఠ హాస్టల్, 1906లో ముస్లీంలకు, 1907లో వీరశైవ లింగాయత్ లకు, 1908లో అంటరానివారికి, మరాఠాలకీ 1921లో దర్జీ మరియు నేత కులస్తులకి  నామ్ దేవ్ హాస్టల్‌, విశ్వకర్మలకి సోనార్ హాస్టల్స్ నిర్మించిండు. ప్రతి గ్రామంలో కనీసం ఒక ప్రాథమిక పాఠశాలనేర్పరచి  అందరికి, అన్ని కులాల వారికి ఉచిత నిర్భంధ ప్రాథమిక విద్యనందించిండు. మల్లయుద్ధం, క్రీడలు వంటి అంశాల్లో శిక్షణకు క్రీడా పాఠశాలలు ఏర్పాటు చేసిండు. 


 

           జులై 26,1902 భారత దేశ చరిత్రలో ఒక చరిత్రాత్మక దినం. ఆ రోజు ఛత్రపతి సాహు మహారాజ్ ప్రభుత్వం, ప్రభుత్వ పాలన వ్యవహారాల్లో  "ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంత" ఉండాలనే ఆలోచనతో  ప్రభుత్వోద్యోగాలన్నింటిలో వెనుకబడినవర్గాల వారికి  50% రిజర్వేషన్ లు కల్పిస్తూ సంచలనాత్మక ఉత్తర్వులని జారీ చేసింది. మొదటిసారిగా బ్రాహ్మణేతరులు గౌరవప్రదమైన ఉద్యోగాలు పొందారు. గ్రామ పరిపాలన రంగంలో వంశపారంపర్యంగా వచ్చే  ముఖ్యులైన పటేల్ ( పాటిల్ ), పట్వారీ ( కులకర్ణి ) వ్యవస్థని 1918 లో రద్దు చేసిండు. 

             టీచర్ ట్రైనింగ్ మరియు పాటిల్‌ ట్రైనింగ్ స్కూల్స్ పెట్టించిండు. గంగారామ్ కాంబ్లే అనే అంటరాని వ్యక్తి ఆధారం చూపించమంటే సాహు డబ్బిచ్చి హోటల్ పెట్టిస్తే ఎవరు ఆ హోటల్ కి రాకుంటే సాహు స్వయంగా తన పరివారంతో వెళ్ళి ముందు తను  టీ తాగి తన వాళ్ళందరికి తాగిస్తాడు. 

           1919,సెప్టెంబర్ 6న అంటరానితనాన్ని పాటించడం నేరమని  ప్రకటన ఇచ్చారు. 1920 మే,3వ తేదిన వెట్టిచాకిరి వ్యవస్థని రద్దు చేస్తూ చట్టం చేశారు. 1919 నవంబర్ 6న వెలువడిన చట్టం ప్రకారం అన్ని విధాల వృత్తుల్లోను, ఉద్యోగాల్లోను ఉండే అస్పృశ్యులకు ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యాన్ని కల్పించిండు. అంబేడ్కర్ ఆస్పృశ్యుల హక్కుల సాధన కోసం ఒక పత్రిక నడుపుటకు 2500 రూపాయలు ఇవ్వడంతో "మూక్ నాయక్" పత్రిక ప్రారంభమౌతది. 1920,ఎప్రిల్ 15న నాసిక్ లో అంబేడ్కర్ మరియు మిత్రులు  అంటరానివారికోసం ఒక హాస్టల్ కట్టాలనుకుంటే ఆ కార్యక్రమ ప్రారంభోత్సవానికి హాజరై ఐదు వేల రూపాయలు ఇస్తాడు సాహు. 1920 లో అంబేడ్కర్ ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకొనుటకై ఆర్థిక సహాయం చేశారు. అంబేడ్కర్ విదేశాల్లో ఉన్నంత కాలం "మూక్ నాయక్" పత్రిక నిర్వహణ కి ఆర్థిక సహాయం చేసిండు. 

Uploading: 1858560 of 2670968 bytes uploaded.

 

              కొల్హాపూర్ సంస్థానంలో బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ప్రారంభం చేసిండు. ఉన్నత విద్యలోకి బాలికలను ప్రోత్సహించేందుకు ఉపకారవేతనాలు, ప్రోత్సాహక బహుమతులు ఏర్పాటు చేసిండ్రు. వెనుకబడిన ఆడపిల్లలకు ఉచిత భోజన, వసతి సదుపాయాలు కల్పించిండు. 1919 జూన్ లో బాల్య వివాహాల రద్దు చట్టం  వచ్చింది. 1919 జులై 12న కులాంతర, వర్ణాంతర వివాహాలను  చట్టబద్దం చేస్తూ చట్టం తెచ్చిన "కొల్హాపూర్ స్పెషల్ మ్యారేజీ ఆక్ట్ - 1918" ప్రకారం  ఎందరో యువతీ యువకులు తమకు నచ్చిన భాగస్వామ్యులని ఎన్నుకున్నారు. విడాకులు మంజూరు చేయడంలో స్త్రీల నిర్ణయానికే ప్రాధాన్యతనిస్తూ 1919 ఆగష్ట్ 2న విడాకుల చట్టం మరియు స్పెషల్ మ్యారేజీ ఆక్ట్ అప్పుడు దేశంలో సంచలనాలను సృష్టించాయి. 1920 జనవరి 17న జోగిని, దేవదాసీ వ్యస్థను రద్దు చేసిండు . ప్రభుత్వం దేవదాసీల పునరావాసానికి చర్యలు తీసుకుంది. 1919 జులైలో వ్యభిచార వృత్తిలో ఉన్న స్త్రీలకు పునరావాసాన్ని కల్పించాల్సిందిగా అధికారులను ఆదేశించిండు. సాహు 1920 లో రూపొందించిన హిందూ న్యాయశాస్త్రం లోని అనేక అంశాలను స్వాతంత్రానంతరం రూపొందిన "హిందూ పర్సనల్ లా" లో భాగంగా భారత పార్లమెంట్ ఆమోదించింది.

              కరువు వచ్చినపుడు రైతులకు అన్ని రకాల పన్నులను, రుణాలని మాఫీ చేసిండు, అప్పుల కింద రైతుల ఆస్తులని, పనిముట్లనీ, పశువులని బలవంతంగా జప్తు చేసే చర్యలను నిషేధిస్తూ 1894 లోనే చట్టం చేసిండు. 1918 లో తన రాజ్యంలో వడ్డీ వ్యాపారాన్ని పూర్తిగా నిషేధిస్తూ సహకార సంఘాలని ఏర్పాటు  చేసిండు. రాధానగరి, పనాలా, కరవీర్, శిరోల్ వంటి ప్రాజెక్ట్ లని నిర్మించిండు."కింగ్ ఎడ్వర్ట్ అగ్రికల్చరల్ ఇన్సిట్యూట్" ద్వారా రైతులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేసిండు. తన తండ్రి పేరుతో ఏర్పరచిన "జైసింగ్ రావు ఘాట్గే టెక్నికల్ ఇన్సిట్యూట్" ద్వారా సాంకేతిక శిక్షణ లభించి పరిశ్రమలు ఏర్పడ్డాయి. చక్కర కర్మాగారాలు, బట్టల మిల్లులు, గోనే సంచుల ఫ్యాక్టరీలు, చిన్న తరహా కుటీర పరిశ్రమలు ఏర్పడ్డాయి. 

              స్వాతంత్రo గురించి సాహు 1917 , డిసెంబర్ 27 నాసిక్ లో జరిగిన సభలో "ఇపుడున్న కులవ్యవస్థ యధాతథంగా కొనసాగుతూ ఉండేట్లైతే ఒకవేళ మన చేతికి రాజకీయాధికారం వచ్చినప్పటికీ అదొక నియంతృత్వ రాజ్యంగానే తయారవుతుంది. స్వరాజ్యం పేరిట ఒక నియంతృత్వ రాజ్యం ఏర్పడటాన్ని నిరోధించాలంటే కనీసం పదేళ్ళ పాటు వెనుకబడిన కులాలకు విద్యా, ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం కల్పించే విధానం కొనసాగాలి" అని అన్నాడు. బొంబాయి ప్రెసిడెన్సి బ్రిటీష్ ప్రభుత్వ సెక్రటరీ లార్డ్ విల్లింగ్టన్ కు 1917,డిసెంబర్ 29 న లేఖ రాస్తూ "వెనుకబడిన కులాలను, ముఖ్యంగా అస్పృశ్యులను సామాజికంగా అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకతను గురించి గతంలో నేను ప్రస్తావించి ఉన్నాను. కొత్తగా రూపొందుతున్న భారత రాజ్యాoగంలో ఈ కులాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించవలసిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అస్పృశ్యులకు సంబంధించి మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని" నా అభిప్రాయం. ప్రభుత్వం నియమించబోయే స్థానిక పాలక మండళ్ళలో వెనుకబడిన కులాలకు, అస్పృశ్యులకు తగిన ప్రాధాన్యత కల్పిoచాలని  కోరిండు. ముంబాయిలో కార్మికుల ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ "రష్యా, జర్మనీ, ఇంగ్లాండ్ లలో వలే యుక్త వయసు వచ్చిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఉండాలి" అన్నాడు. 

               1917 లో మరాఠ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ "నేనిక్కడికి ఒక మహారాజ్ గా రాలేదు ఒక సామాన్యుడిగా వచ్చాను. మీరు నన్ను మీలోని ఒక శ్రామికుడిగా, రైతుగా భావించవచ్చు. నా పూర్వీకులు ఇదే పని చేశారు, అనడం సాహు మహారాజ్ ఎంతటి నిగర్వి, సామాన్య ప్రజలకు ఎంత దగ్గరగా చేరువయ్యాడో అర్థం చేసుకోవచ్చు. 

            కేవలం మహారాష్ట్రకే కాకుండా దక్షిణ భారతంలో జస్టీస్ పార్టీ ఉద్యమంతో పాటు  భారతదేశం మొత్తం మీద ప్రభావం చూపిన సాహు మహారాజ్ మే 6, 1922న మరణించిండు. వీరిని ఆదర్శంగా తీసుకొని బహుజన రాజ్యాధికార సాధన కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలైన బహుజనులు అందరూ మాతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.    

           ఈ కార్యక్రమంలో ఆంధ్ర బహుజన ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు అంపావతిని గోవిందు, కదిరి నియోజకవర్గం కన్వీనర్ యాటగిరి ప్రసాద్, జిల్లా కో-కన్వీనర్ కె.సాయిశీనా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.ఆర్.హరిప్రసాద్, ఎస్.లక్ష్మన్న, కదిరి టౌన్ కమిటీ మాజీ కన్వీనర్ వెంకటేశ్వరగౌడ్, కదిరి టౌన్ కమిటీ కో-కన్వీనర్ సి.ఆంజనేయులు, నిజామోద్దీన్, చౌడప్ప, రామచంద్ర, తిరుపాలు, సురేష్, నరసింహులు, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

 అల్ హింద్ సామాజిక సేవాసంస్థ ఆధ్వర్యంలో...

రక్తదాన కార్యక్రమం

(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)

అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో ని రహమత్ పురం .ఎల్ ఐ సీ.కార్యాలయం వద్ద రక్తదాన కార్యక్రమము అల్ హింద్ ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యక్రమము లో అధ్యక్షుడు ముజాహిద్ ఆధ్వర్యంలో ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ అధ్యక్షత న ఉదయం10గంటలకు రక్త దాన కార్యక్రమం జరిగింది ముఖ్య  అతిథులు రెండవ పట్టణ సర్కిల్ ఇన్స్ పెక్టర్ మన్సూరుద్దీన్. ఒకటవ పట్టణ సర్కిల్ ఇన్స్ పెక్టర్ బాల మద్దిలేటి. జామియా మసీదు ముత వల్లీ తలహా ఖాన్. షేక్ అస్లాం.మౌలానా అబ్దుల్ మాలిక్.మౌలానా జుబేర్.టిప్పు సుల్తాన్ రక్త దాన సంఘం జిల్లా అధ్యక్షులు షేక్ షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు వక్తలు  మాట్లాడుతూ ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలలో యువత ముందుoడడం హర్షణీయం అన్నారు కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రాణాలకు తెగించి యువత సేవలలో పాల్గొనడం అభినందనీయం అన్నారు.

103సార్లు రక్తదానం చేసిన సుందర్ కూల్ డ్రింక్స్ బాబు. జామియా ము త వల్లీ తలహా ఖాన్.మౌలానా అబ్దుల్ మాలిక్ రహమత్ ఏ ఆలం .టిప్పు సుల్తాన్ రక్తదాన సంఘం షేక్ షబ్బీర్.పయామె ఏ ఇన్సానియతే మౌలానా జుబేర్.తదితరులకు మెమెంటో దుశ్శాలువా తో సత్కరించారు.ఉమర్ ఫారూఖ్ ఖాన్ మాట్లాడుతూ రక్త దానం చేస్తాం కుల మతాల అడ్డుగోడల్ని కూలుద్దాం అనే నినాదాలతో ప్రతి 18నుండి 55సంవత్సరాలఆరోగ్యవంతుడైన యువతీయువకులు అపోహల్ని వీడి రక్తదానం చేయాలని అన్నారు ఎం ఐ ఎం కౌన్సిలర్ అదిల్.మున్నా.తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అల్ హింద్ అధ్యక్షుడుముజాహిద్ మాట్లాడుతూ మా అల్ హింద్ సామాజిక సేవా సంఘం సభ్యులు సాబిట్. అసిఫ్.షాహిద్.జబీ. అఖిల్. సుహైల్. ఖలందర్.రక్తదానం. అన్నదానం.కోవిడ్ బాధితులకు. సహాయ సహకారాలు. మానసిక వికలాంగుల కుసహాయం.విద్యార్థుల చైతన్య కార్యక్రమాలు .చెట్లు నాటే కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.


 
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 భారత రిజర్వేషన్ ల పితామహుడు

భారత సామాజిక ప్రజాస్వామ్య మూలస్థంభం

ఛత్రపతి సాహు మహారాజ్  

నమ్మిన సిద్దాంతాన్ని ఆచరణలో చూపిన మహానీయుడు

నేటి పాలకులకు నేడు అదే అవసరం

భారతదేశ చరిత్రలో దళిత , బహుజనులను బ్రాహ్మణుల పెత్తనం నుండి విముక్తి చేయటానికి సైద్ధాంతికంగా , పాలనపరంగా  మహాత్మ జ్యో తిబాపూలే , ఛత్రపతి శివాజీ ల వారసుడిగా కృషి చేసి భవిష్యత్ భారతానికి సామాజిక న్యాయ , ప్రజాస్వామిక తాత్విక పునాదిని ఏర్పరచి ప్రజల రాజుగా మిగిలిపోయిన మహానీయుడు , రాజర్షి ఛత్రపతి సాహుమహారాజ్.

1874 జూన్ 26 న రాధాబాయి , జయసింగ్ ఆబాసాహేబ్ ఘాట్గే లకు జన్మించిన యశ్వంతరావు ఘాట్గే నే ఆ తర్వాత కాలంలో సాహు మహారాజ్ గా  ప్రసిద్ది చెందుతాడు . ఘాట్గేలు మహారాష్ట్ర లో వెనుకబడిన తరగతులకి చెందిన కున్భీ కులం వారిది. వ్యవసాయం చేసుకొని జీవించేవారు. ఇతర కుల వృత్తులు చేసేవారు సైతం ఆ వృత్తులు వదిలి వ్యవసాయం చేయగానే వారిని కూడా కున్భీలు గా ఒక వృత్తిపరమైన వర్గంగా ఏర్పడిన అనేక కులాల కలయికే  కున్భీ కులం.  ఛత్రపతి శివాజీ స్థాపించిన మరాఠ సామ్రాజ్యంలోని కొల్హాపూర్ రాజ్యంలో వారసులు లేకుంటే నాల్గవ శివాజీ భార్య రాణీ ఆనందబాయి 1884 మార్చి , 17 న  దత్తపుత్రుడిగా స్వీకరించి  యశ్వంత్ రావు ఘాట్గే కి ముద్దుగా  ' సాహు ' అని  పేరు పెట్టుకుంటది. 

మూడేళ్ళకే తల్లిని కోల్పోయిన సాహు , 1886 మార్చి 20 న తండ్రి మరణంతో 11 ఏళ్ళకే తల్లిదండ్రులిద్దరులేని వాడైనాడు .సాహు చిన్నతనమంతా ఆంగ్లేయ అధ్యాపకుల పర్యవేక్షణ లో పెరిగినందున ఆధునిక భావాలు పుణికి పుచ్చుకున్నాడు. యుక్తవయసు రాగానే 1894 ఎప్రిల్ 2 న సింహాసనం అధిష్టించాడు సాహు. 1900 వ సంవత్సరం అక్టోబర్ నెలలో ఒక రోజు సాహు మహారాజ్ పంచగంగా నదిలో స్నానం చేస్తున్న సమయంలో బ్రాహ్మణ పురోహితుడు స్నానం  చేయకుండానే వచ్చి సాహు మహారాజ్ క్షత్రియ వంశస్తుడు కానందున ఒక వ్యవసాయం  చేసుకునే కులానికి చెందిన శూద్రుడైనందున ఈశడింపుతో వేదోక్త మంత్రాల బదులు పౌరాణిక  మంత్రాలు చదివి అవమానిస్తాడు . పుట్టుకతోనే మనిషి కులం నిర్ణయించబడుతుందనీ రాజైనంత మాత్రాన , దత్తత వచ్చినంత మాత్రాన క్షత్రియుడిగా మారిపోడని వాదనకు దిగుతాడు. ఈ సంఘటన సాహు మహారాజ్ ని మహాత్మ జ్యోతిబాపూలే సత్యశోధక సమాజ్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే వారసత్వాన్ని ఎన్నుకోవడానికి కారణమైతది. బాస్కరరావు జాదవ్ అనే ఉద్యోగిని ' సత్యశోధక్ సమాజ్ ' నడిపే బాధ్యతలు అప్పచెప్పి ' మరాఠ దీనబందు ' పేరుతో పత్రికని నడిపించి సత్యశోధక సమాజ తాత్విక దృక్పథాన్ని ప్రచారం చేయించిండు . బ్రాహ్మణేతరులకి పురోహిత శిక్షణనిచ్చేందుకు సత్యశోధక్ సమాజ్ ఆధ్వర్యంలో పాఠశాల ప్రారంభమైంది. కొల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో వందలాది వివాహాలు, వేడుకలు సత్యశోధక్ సమాజ్ పద్దతిలో జరిగాయి. తను సింహాసనం అధిష్టించే నాటికి తన రాజ్యంలో మత కర్మలలో మొదలు పరిపాలనలోని అన్ని ఉద్యోగ  రంగాలతో పాటు వ్యాపారం , వడ్డీ వ్యాపారం లో కూడా బ్రాహ్మణులే నిండిపోవడం సాహు గమనించిండు . బ్రాహ్మణేతరులని ఉన్నతోద్యాగాల్లోకి తెస్తే తప్ప వారి సామాజిక హోదాలో , జీవితాల్లో మార్పు రాదని , బ్రాహ్మణ ఆధిపత్యానికి అడ్డుకట్టపడదని  సాహు భావించిండు . తన ప్రైవేట్ సెక్రెటరీ ఉద్యోగానికి అండర్ గ్రాడ్యేట్  ( డిగ్రీ స్థాయి లేని ) అయిన ఒక జైనుడిని ఎన్నిక చేసుకుంటే బ్రాహ్మణ సమాజం ఏకమై పెద్ద ఎత్తున నిరసన తెలియచేసింది. ఐతే ఆ రాజ్యంలో అప్పటికి గ్రాడ్యేషన్ పూర్తి చేసిన బ్రాహ్మణేతరుడు ఒక్కరు లేరు. సమస్యను గుర్తించిన సాహు వెనుకబడిన కులాల వారందరికి స్కూల్స్ , హాస్టల్స్  ప్రారంభించి విద్యని ఒక ఉద్యమంగా నడిపిండు . కొల్హాపూర్ పట్టణంలో హాస్టల్స్ కాలనీనే నిర్మించిండు . ప్రపంచ చరిత్రలో ఇదొక అరుదైన విషయం. 1901 లో జైన హాస్టల్ , విక్టోరియ మరాఠ హాస్టల్ , 1906 లో ముస్లీంలకు , 1907 లో వీరశైవ లింగాయత్ లకు , 1908 లో అంటరానివారికి , మరాఠాలకీ 1921లో దర్జీ మరియు నేత కులస్తులకి  నామ్ దేవ్ హాస్టల్‌ , విశ్వకర్మలకి సోనార్ హాస్టల్స్ నిర్మించిండు.

ప్రతి గ్రామంలో కనీసం ఒక ప్రాథమిక పాఠశాలనేర్పరచి  అందరికి , అన్ని కులాల వారికి ఉచిత నిర్భంధ ప్రాథమిక విద్యనందించిండు . పాఠశాలలకు స్వంత భవనాలు ఏర్పడే వరకు  గ్రామాల్లోని అన్ని ఆలయాలను , చావడీలను పాఠశాలలుగా వాడాలనీ , ఏ గ్రామంలో ఏ కులస్తులు మెజారిటీ గా ఉన్నారో చూసి ఆ కులపు వ్యక్తినే ఉపాధ్యాయుడిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులనిచ్చింది. ముస్లీంలకు వాళ్ళ మాతృ భాషలోనే పాఠశాలలు ప్రారంభమైనాయి . ఆ తర్వాత కాలంలో కొంత మార్పు రాగానే  కులపరమైన విద్యాసంస్థలని రద్దు చేస్తూ  అన్ని కులాల  , మతాల వారు కలిసిమెలిసి ఏ పాఠశాలలోనెైన , విద్యా సంస్థలో నైనా చదువొచ్చని ప్రకటన ఇచ్చింది సాహు ప్రభుత్వం .వ్యవసాయం ఇతర వృత్తులు చేసే వయోజనుల కోసం రాత్రి పాఠశాలలు ఏర్పడ్డాయి. విద్యార్థులు , ఉద్యోగులు తమ జ్ఞానాన్ని పెంచడం కోసమని అనేక లైబ్రరీలు  ఏర్పాటు చేసిండు .ఆయా ప్రాంతాల విద్యావంతులకు అవసరమైన పుస్తకాలు కొనుక్కునేందుకు వ్యక్తిగతంగా సహాయం చేసిండు. మల్లయుద్ధం , క్రీడలు వంటి అంశాల్లో శిక్షణకు క్రీడా పాఠశాలలు ఏర్పాటు చేసిండు .జులై 26 , 1902 భారత దేశ చరిత్రలో ఒక చరిత్రాత్మక దినం. ఆ రోజు ఛత్రపతి సాహు మహారాజ్ ప్రభుత్వం , ప్రభుత్వ పాలన వ్యవహారాల్లో '  ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంత '  ఉండాలనే ఆలోచనతో  ప్రభుత్వోద్యోగాలన్నింటిలో వెనుకబడినవర్గాల వారికి  50% రిజర్వేషన్ లు కల్పిస్తూ సంచలనాత్మక ఉత్తర్వులని జారీ చేసింది . వెనుకబడిన వర్గాలు అనగా బ్రాహ్మణ , ప్రభు , షెన్వీ , పార్శీ, ఇతర అభివృద్ది చెందిన కులాలు మినహా మిగిలిన అన్ని కులాల వారు . ( Backward classes shall be understood to mean all castes other than brahmin , Prabhus, Shenvis , Parsees and other advanced classes .) అంటరానివారి నుండి అన్ని మతాలలో వెనుకబడినవారు కూడా రిజర్వేషన్ కిందికే వస్తారు.

మొదటిసారిగా బ్రాహ్మణేతరులు గౌరవప్రదమైన ఉద్యోగాలు పొందారు. బాస్కర్‌ రావు జాదవ్ డిప్యూటీ కలెక్టర్‌ మొదలు బాపు సాహెబ్ , బాబా సాహేబ్ ఖన్వీల్కర్ , అప్పాసాహేబ్ మైసీకర్ , దాజీరావు విచారే , A.B. లత్తే మొదలైన బ్రాహ్మణేతరులు సాహు పరిపాలనలో ఉన్నతోద్యోగులు గా పని చేసిండ్రు. వారి ఉద్యోగ నిర్వహణలో పూర్తి స్వేచ్ఛనిచ్చి  రాజకీయపరమెన ఒత్తిళ్ళు లేకుండా చూసిండు . ఉత్పత్తి రంగానికి , శ్రామిక సంస్కృతికి తరతరాలుగా దూరంగా ఉండిపోయిన బ్రాహ్మణ వర్గానికి శ్రామిక ప్రజల కష్టసుఖాలు అర్థమయ్యే అవకాశం లేదని ఆయన ఆలోచన. 

బాలగంగాధర తిలక్  లాంటి బ్రాహ్మణ జాతీయోద్యమ నాయకులు సాహు మహారాజ్ నడిపిస్తున్న పూలే వారసత్వ ఉద్యమాన్ని , పరిపాలన లో చేస్తున్న మార్పులని చూసి ఓర్వలేక అనేక కుట్రలు చేశారు. దాడికి దిగారు. కానీ సాహు మహారాజ్ గ్రామ పరిపాలన రంగంలో వంశపారంపర్యంగా వచ్చే  ముఖ్యులైన పటేల్ ( పాటిల్ ) , పట్వారీ ( కులకర్ణి ) వ్యవస్థని 1918 లో రద్దు చేసిండు .ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినంకా దాదాపు 66 సంవత్సరాలకు రద్దైంది పటేల్ , పట్వారి వ్యవస్థ. ఉపాద్యాయులుగా కూడా వారసత్వంగా పని చేయడాన్ని రద్దు చేసిండు . టీచర్ ట్రైనింగ్ మరియు పాటిల్‌ ట్రైనింగ్ స్కూల్స్ పెట్టించిండు. విద్యారంగం లో సాహు కృషి కేవలం ఆక్షరాస్యత కే కాకుండా సంగీత, సాహిత్య , నాటక ప్రక్రియలన్నింటిని ప్రోత్సా హించిండు . సాహు ఆస్థానంలో అల్లాదియాఖాన్ అనే గొప్ప సంగీత విద్యావేత్త ఉండేవాడు . రాజవల్లి అనే గొప్ప గాయనీ ఉండేది. సాహు కాలంలో నాటక రంగం అభివృద్ది చెందింది. కొల్హాపూర్ జ్జ్ఞాన సమాజ్ , కిర్లోస్కర్ కంపెనీ , స్వదేశ్ - హితా చింతక్ వంటి నాటక సమాజాలకు ఉదారంగా విరాళాలిచ్చేవాడు .భారత దేశంలో మొట్టమొదటి మహిళా నాటక సమాజమైన ' శేషశాని స్త్రీ సంగీత నాటక మండలి ' కొల్హాపూర్‌ కి చెందినదే . సాహు ఏర్పరిచిన భూమిక పై నుండే వి.శాంతారాం, మాస్టర్ వినాయక్ షిండే లాంటి ప్రసిద్దులైన సినిమా దర్శకులు కొల్హాపూర్ ప్రాంతం నుండి వచ్చిండ్రు. 

ఒక ఉద్యమాన్ని నడిపించే నాయకుడు కేవలం ఉపన్యాసాలిస్తే సరిపోదని తను చెప్పిన  ఆచరించి చూపిండు సాహు మహారాజ్ నిరక్షరాస్యుడైన గంగారామ్ కాంబ్లే అనే అంటరాని వక్తి ఆధారం చూపించమంటే సాహు డబ్బిచ్చి హోటల్ పెట్టిస్తే ఎవరు ఆ హోటల్ కి రాకుంటే సాహు స్వయంగా తన పరివారంతో వెళ్ళి ముందు తను  టీ తాగి తన వాళ్ళందరికి తాగిస్తాడు . పాలన నిర్వహణకి అవసరమైన విద్యార్హతలు లేని అంటరాని వారిని తన కుటుంబంలో వివిధ రకాల పనులకి తీసుకున్నాడు . రథచోదకులుగా , మావటీలుగా , రక్షకభటులుగా నియమించిండు . 1919 , సెప్టెంబర్ 6న అంటరానితనాన్ని పాటించడం నేరమని ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది. అంటరాని ఉద్యోగులతో ప్రజలు గానీ ,  ప్రభుత్వ కార్యాలయాల్లో ఇతర ఉద్యోగులు అగౌరవంగా ప్రవర్తిస్తే పిర్యాదు అందితే నేరస్తుల మీద చర్యలు తీసుకుంటారు. నేరస్తులు ఉద్యోగులైతే ఆరు వారాల్లోగా విచారణ జరిపి నేరస్తులని తేలితే ఉద్యోగం నుండి తొలగింపుతో పాటు పెన్షన్ కూడా రద్దైపోతుంది . 60 సంవత్సరాల భారత ప్రభుత్వం తెచ్చిన ఎస్.సి. / ఎస్.టీ. అట్రాసిటీ చట్టం కూడా ఇంత బలమైనది కాదు. 1920 మే , 3వ తేదిన వెట్టిచాకిరి వ్యవస్థ ని రద్దు చేస్తూ చట్టం చేసింది ప్రభుత్వం . ఆ తర్వాత 55 ఏండ్లకు స్వాతంత్రం వచ్చినంకా 1975 లో మాత్రమే భారత ప్రభుత్వం వెట్టిచాకిరి నిర్మూలన చట్టం చేసింది . గ్రామీణ పరిపాలనలో కింది స్థాయి ముఖ్య ఉద్యోగాలైన ' తలాతీ ' ( సుంకరి , గ్రామ రెవెన్యూ సహాయకులు ) లుగా అస్పృశ్యులే ఉంటారు కాబట్టి వాళ్ళందరికి ఉద్యోగ నిర్వహణకు అవసరమైన శిక్షణనిచ్చేందుకు ట్రేనింగ్ స్కూల్స్ ప్రారంభించిండు. 2010 వరకు ఆంధ్రప్రదేశ్ లో వీరికి శిక్షణ లేదు. 1919 నవంబర్ 6 న వెలువడిన చట్టం ప్రకారం అన్ని విధాల వృత్తుల్లోను , ఉద్యోగాల్లోను ఉండే అస్పృశ్యులకు ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యాన్ని కల్పించిండు. ఇప్పటికీ గ్రామీణ స్థాయి గ్రామ రెవెన్యూ సహాయకులకి ఈ సదుపాయం లేదు. కనీస వేతనాలు లేవు. గ్రామ పంచాయితీలలలో  పనిచేసే పారిశుద్య కార్మికులకు సంక్రాంతికి , దసరా పండుగకి లెక్కన బిక్షంగా లోకల్ ఫండ్ ఉంటే ఇస్తారు లేకుంటే లేదు. 

ఆదివాసీ తెగలకు , అంటరాని వారికి సంబంధించి బ్రిటీష్ ప్రభుత్వం పెట్టిన ' నేరస్థ కులాల చట్టాన్ని ' 1918 లో రద్దు చేసిండ్రు. మహర్ , మాంగ్ , రామోషీ , బెరాద్ లాంటి నేరస్థ కులాలుగా పరిగణింపబడే కులాల ప్రజలు ప్రతి రోజు పోలీస్ స్టేషన్ లో హాజరై సంతకం చేసే అమానుషం ఈ చర్యతో రద్దైంది . 

సాహు మహారాజ్ అంటరానివారికి ఆపద్భాంధవుడిగా మారిన విషయం తెలుసుకున్న బాబా సాహేబ్ అంబేడ్కర్ సాహు మహారాజ్ ల మద్య పరిచయం పెరిగి రాబోయే బ్రిటీష్ చట్టాలు మంచిచెడుల గురించి మాట్లాడుకునేవారు. అంబేడ్కర్ ఆస్పృశ్యుల హక్కుల సాధన కోసం ఒక పత్రిక పెట్టాలనుకుంటున్నాననీ , ఐతే ఆర్థిక ఇబ్బందులతో చేయలేకపోతున్నానడంతో ఆ పత్రిక కి ఆర్థిక వనరులు సమకూర్చే బాధ్యతను తీసుకొని మొదట 2500 రూపాయలు ఇవ్వడంతో ' మూక్ నాయక్ ' పత్రిక ప్రారంభమౌతది.1920 , ఎప్రిల్ 15 న నాసిక్ లో అంబేడ్కర్ మరియు మిత్రులు  అంటరానివారికోసం ఒక హాస్టల్ కట్టాలనుకుంటే ఆ కార్యక్రమ ప్రారంభోత్సవానికి హాజరై ఐదు వేల రూపాయలు ఇస్తాడు సాహు .  1920 లో అంబేడ్కర్ ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకొనుటకై ఆర్థిక సహాయం చేస్తాడు సాహు మహారాజ్ . అంబేడ్కర్ విదేశాల్లో ఉన్నంత కాలం ' మూక్ నాయక్ ' పత్రిక నిర్వహణ కి ఆర్థిక సహాయం చేసిండు .రమాబాయి యోగక్షేమాలను విచారిస్తూ , ఆమెకు అవసరమైన ఆర్థిక సహాయం చేస్తూ బాధ్యత గల స్నేహితుడిగా వ్యవహరించిండు సాహు . 1922 ఫిబ్రవరి 16న డిల్లీలో జరిగిన అంటరాని కులాల జాతీయ మహాసభలో పాల్గొన్న సాహు ' ఈ సభలో ప్రసంగించే అర్హత నాకన్న మించి ఉన్న అంబేడ్కర్‌  ఇంగ్లాండ్ లో ఉన్నందున పాల్గొనలేకపోవడం మన దురదృష్టం. మీ జాతి గర్వించదగిన మహోన్నత నాయకుడు అంబేడ్కర్ ను మీరందరు ఆదర్శంగా స్వీకరించాలని , ఆయన స్థాయికి అందుకోవడానికి మీ అభివృద్ధికి కావలిసిన సేవలను అందించడానికి నన్ను అనుమతించమని ప్రార్థన ' అంటూ మాట్లాడిండు.

పితృస్వామ్య , కుల , మత వ్యవస్థల వల్ల స్త్రీల మీద జరుగుతున్న అమానుషాలని గ్రహించిన సాహు మొదట తన భార్య లక్ష్మీబాయి కి యూరోపియన్ టీచర్ ల ద్వారా ఆధునిక విద్యను చెప్పించిండు . సంగీతంలో , చిత్రలేఖనంలో , ఎంబ్రాయిడరీ లో శిక్షణ ఇప్పించిండు .కొల్హాపూర్ సంస్థానంలో బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ప్రారంభం చేసిండు .ఉన్నత విద్యలోకి బాలికలను ప్రోత్సహించేందుకు ఉపకారవేతనాలు , ప్రోత్సాహక బహుమతులు ఏర్పాటు చేసిండ్రు. కొల్హాపూర్ రాజారాం కాలేజీ లో బాలికలకు ప్రత్యేక విభాగం ఏర్పరిచిండ్రు. వెనుకబడిన ఆడపిల్లలకు ఉచిత భోజన , వసతి సదుపాయాలు కల్పించిండ్రు. 1919 జూన్ లో బాల్య వివాహాల రద్దు చట్టం  వచ్చింది. 1919 జులై 12న కులాంతర , వర్ణాంతర వివాహాలను  చట్టబద్దం చేస్తూ చట్టం తెచ్చిన ' కొల్హాపూర్ స్పెషల్ మ్యారేజీ ఆక్ట్ - 1918 '  ప్రకారం  ఎందరో యువతీ యువకులు తమకు నచ్చిన భాగస్వామ్యులని ఎన్నుకున్నారు. విడాకులు మంజూరు చేయడం లో స్త్రీల నిర్ణయానికే ప్రాధాన్యతనిస్తూ 1919 ఆగష్ట్ 2 న విడాకుల చట్టం మరియు స్పెషల్ మ్యారేజీ ఆక్ట్ అప్పుడు దేశంలో సంచలనాలను సృష్టించాయి. 1920 జనవరి 17న జోగిని , దేవదాసీ వ్యస్థను రద్దు చేసిండు . ప్రభుత్వం దేవదాసీ ల పునరావాసానికి చర్యలు తీసుకుంది. 1919 జులైలో వ్యభిచార వృత్తిలో ఉన్న స్త్రీలకు పునరావాసాన్ని కల్పించాల్సిందిగా అధికారులను ఆదేశించిండు.కొల్హా పూర్  ప్రాంతంలోని కోర్టులన్నిoటిలో  సివిల్ , క్రిమినల్ కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతుండేది. రోజుకి ఎన్ని కేసులు విచారణ జరుపుతామనే అంచన లేక పెద్ద సంఖ్యలో పిలవడము చాలా మంది కేసు బెంచ్ మీదికి రాకనే తిరిగి పోవడం పదే పదే జరుగడంతో చాలా మంది పేదలు ఇబ్బంది పడేవారు. ఈ సమస్యకి పరిష్కారంగాను 1919 అక్టోబర్ 17న చట్టం చేస్తూ రోజు కు కేవలం మూడు కేసులకి మించి విచారణకు స్వీకరించకూడదు.అక్కడ సరైన న్యాయం జరగలేదని ఏ పౌరుడైనా భావిస్తే నేరుగా మహారాజ్ ని కలవచ్చు.  సాహు 1920 లో రూపొందించిన హిందూ న్యాయశాస్త్రం లోని అనేక అంశాలను స్వాతంత్రానంతరం రూపొందిన ' హిందూ పర్సనల్ లా ' లో భాగంగా భారత పార్లమెంట్ ఆమోదించింది.

ఉన్నత విద్యావంతుడైన సాహు మహారాజ్ నిరంతరం ప్రజల మద్యే ఉంటూ సమస్యలు తెలుసుకుంటా  ప్రజల భాషలో మాట్లాడేవాడు . పరిపాలనలో ప్రజలకు అర్ధం కాని , ప్రజలకు ఇబ్బంది కల్గించే బ్రాహ్మణ గుమాస్తాల , పట్వారీలు వాడే మోడీ లిపిని పరిపాలన వ్యవహారాల్లో రద్దు చేస్తూ 1917 మార్చి లో నిర్ణయం తీసుకున్నాడు . తెలంగాణాలో నైజాం పాలన తర్వాత కూడా కొన్నాళ్ళు మోడి లిపి రెవెన్యూ రికార్డుల్లో వాడబడింది. కరువు వచ్చినపుడు రైతులకు అన్ని రకాల పన్నులను , రుణాలని మాఫీ చేసిండు . అప్పుల కింద రైతుల ఆస్తులని , పనిముట్లనీ , పశువులని బలవంతంగా జప్తు చేసే చర్యలను నిషేధిస్తూ 1894 లోనే చట్టం చేసిండు. 1918 లో తన రాజ్యంలో వడ్డీ వ్యాపారాన్ని పూర్తిగా నిషేధిస్తూ సహకార సంఘాలని ఏర్పాటు  చేసిండు . రాజ్యంలో ప్లేగు వ్యాధి వచ్చినపుడు టెలిఫోన్ వ్యవస్థను ఏర్పాటు చేసి యంత్రాంగాన్ని సమర్థవంతంగా పని చేయించిండు. రాధానగరి , పనాలా , కరవీర్ , శిరోల్ వంటి ప్రాజెక్ట్ లని నిర్మించిండు . ' కింగ్ ఎడ్వర్ట్ అగ్రికల్చరల్ ఇన్సిట్యూట్ ' ద్వారా రైతులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేసిండు. తన తండ్రి పేరుతో ఏర్పరచిన ' జైసింగ్ రావు ఘాట్గే టెక్నికల్ ఇన్సిట్యూట్ '  ద్వారా సాంకేతిక శిక్షణ లభించి పరిశ్రమలు ఏర్పడ్డాయి.  చక్కర కర్మాగారాలు , బట్టల మిల్లులు , గోనే సంచుల ఫ్యాక్టరీలు , చిన్న తరహా కుటీర పరిశ్రమలు ఏర్పడ్డాయి. 

స్వాతంత్రం గురించి సాహు 1917 , డిసెంబర్ 27 నాసిక్ లో జరిగిన సభలో ' ఇపుడున్న కులవ్యవస్థ యధాతథంగా కొనసాగుతూ ఉండేట్లైతే ఒకవేళ మన చేతికి రాజకీయాధికారం వచ్చినప్పటికీ అదొక నియంతృత్వ రాజ్యం గానే తయారవుతుంది. స్వరాజ్యం పేరిట ఒక నియంతృత్వ రాజ్యం ఏర్పడటాన్ని నిరోధించాలంటే కనీసం పదేళ్ళ పాటు వెనుకబడిన కులాలకు విద్యా , ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం కల్పించే విధానం కొనసాగాలి. ' అని అన్నాడు. బొంబాయి ప్రెసిడెన్సి బ్రిటీష్ ప్రభుత్వ సెక్రటరీ లార్డ్ విల్లింగ్టన్ కు 1917 , డిసెంబర్ 29 న లేఖ రాస్తూ ' వెనుకబడిన కులాలను , ముఖ్యంగా అస్పృశ్యులను సామాజికంగా అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకతను గురించి గతంలో నేను ప్రస్తావించి ఉన్నాను. కొత్తగా రూపొందుతున్న భారత రాజ్యాoగం లో ఈ కులాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించవలసిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అస్పృశ్యులకు సంబంధించి మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని నా అభిప్రాయం . '  ప్రభుత్వం నియమించబోయే స్థానిక పాలక మండళ్ళలో వెనుకబడిన కులాలకు , అస్పృశ్యులకు తగిన ప్రాధాన్యత కల్పిoచాలని  కోరిండు . ముంబాయిలో కార్మికుల ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతూ ' రష్యా , జర్మనీ , ఇంగ్లాండ్ లలో వలే యుక్త వయసు వచ్చిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఉండాలి ' అన్నడు. 

1917 లో మరాఠ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ' నేనిక్కడికి ఒక మహారాజ్ గా రాలేదు ఒక సామాన్యుడిగా వచ్చాను. మీరు నన్ను మీలోని ఒక శ్రామికుడిగా , రైతుగా భావించవచ్చు. నా పూర్వీకులు ఇదే పని చేశారు ' అనడం సాహు మహారాజ్ ఎంతటి నిగర్వి , సామాన్య ప్రజలకు ఎంత దగ్గరగా చేరువయ్యాడో అర్థం చేసుకోవచ్చు.  అందుకే ఒక అమెరికన్ చరిత్రకారుడు ఇలా అంటాడు 

' సాదారణ రైతు కుటుంబానికి , వెనుకబడిన కులానికి  చెందిన జ్యోతిబాపూలే సామాజిక ఉద్యమ కారుడు కావడంలో ఆశ్చర్యo లేదు. కానీ ఒక రాజు  అయిన సాహు మహారాజ్ ఇoత నిబద్దతతో సామాజిక ఉద్యమాలను నిర్వహించడం నిజంగా అరుదైన విషయం '. కేవలం మహారాష్ట్ర కే కాకుండా దక్షిణ భారతంలో జస్టీస్ పార్టీ ఉద్యమంతో పాటు  భారతదేశం మొత్తం మీద ప్రభావం చూపిన సాహు మహారాజ్ మే 6 , 1922 న మరణించిండు . అతని మరణాంతరం అంత్యక్రియలు సైతం బ్రాహ్మణేతర పురోహితుల చేత జరిగాయి.  

✍️ రచయిత-కె.అర్.హరిప్రసాద్ బహుజన్   

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి