ఈటెల మంత్రి పదవికి వేటు... 

ఆరోగ్యశాఖ పోర్ట్ పోలియో ఇక సీఎం కేసీఆర్ కు

పోర్ట్ ఫోలియో బదిలీకి గవర్నర్ ఆమోదం

వేడుకెక్కుతన్న తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు

ఆ శాఖ భవిష్యత్తులో కవితకేనా...?

కుట్రలు బయటపెడతానన్న ఈటెల

సమయం చూసి కేసీఆర్ వాత పెట్టారా...?


(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

తెలంగాణ రాష్ట్రంలో ఇపుడు టీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. సొంత ప్రభుత్వంలోని మంత్రి ఈటెల రాజేందర్ పై వచ్చిన ఆరోపణల విషయంలో స్పందించిన కేసీఆర్ సర్కార్ ఏకంగా విచారణకు ఆదేశించింది. ఈ విచారణ జరుగుతున్న సమయంలోనే ఈటెల కు ఉన్న శాఖ కేసీఆర్ కు బదిలీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి ఈటెల రాజేందర్ మీద వచ్చిన ఆరోపణలపై విచారణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ పోర్ట్ ఫోలియో బదిలీకి గవర్నర్ తమిళ సై ఆమోదం తెలిపారు. ఇదిలావుంటే సమీప భవిష్యత్తులో ఈ శాఖ కవితకు కట్టబెట్టే అవకాశముందని ప్రచారం సాగుతోంది. ఇటీవల కవితా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. ఆమెకు మంత్రి వర్గం ఖాయమని, గతంలో ప్రచారం సాగింది.

ఆమె మంత్రి వర్గంలోకి వస్తే...ఇపుడు ఉన్న మంత్రుల్లో ఎవరికి వేటు అన్న దిశగా కూడా చర్చ సాగింది. కానీ అదేమీ జరగలేదు. ప్రస్తుతం అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మంత్రి ఈటెల రాజేందర్ పై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆయనకున్న శాఖను సీఎం తన కిందకు బదిలీ చేసుకొన్నారు. దీంతో సమయం కోసం వేచిచూసిన కేసీఆర్ ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా వ్యవహరించారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. పలు మార్లు ఇటీవల ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంత్రి ఈటెల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై సీఎంపై కేసీఆర్ సీరియస్ గా ఉన్నట్లు కూడా ప్రచారం సాగింది. అయితే ప్రస్తుతం ఈటెలపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో అవకాశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకూలంగా మల్చుకొంటున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఈటెల రాజేందర్ ను నాడే కేబినేట్ నుంచి తొలిగించివుంటే పరిస్థితులు వేరుగా ఉండేవని, అది కేసీఆర్ శత్రువులకు కలిసొచ్చేవని రాజకీయ వర్గాల వాదన. అందుకే నాడు కేసీఆర్ మౌనానికి కారణమైవుండొచ్చని వారు పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం ఈటెల పరిస్థితి వేరు అని ఈ సమయంలో ఆయన్ని మంత్రివర్గం నుంచి తొలగించినా వచ్చే మైలేజీ కేసీఆర్ కేనని వారు పేర్కొంటున్నారు. ఇక్కడ కూడా ఒక్కదెబ్బకు రెండు పిట్టలు అన్నది కేసీఆర్ కు కలసివస్తుందని వారు చెబుతున్నారు. ఇక కవితకు కూడా మంత్రి వర్గంలో స్థానం కోసం లైన్ క్లియర్ అవుతుందని వారు పేర్కొన్నారు.

ఇదిలావుంటే  భూకబ్జా వ్యవహారం పట్ల రైతులు చేసిన ఫిర్యాదు మేరకు కలెక్టర్, సిబ్బంది అధికారుల సమక్షంలో విచారణ కొనసాగుతోంది. శనివారం సాయంత్రం వరకు ముఖ్యమంత్రికి రిపోర్టు సమర్పిస్తామని  మెదక్ జిల్లా కలెక్టర్ తెలిపారు. పేదల భూములు ఆక్రమణకు గురైంది అని గతంలో కూడా ఫిర్యాదు వచ్చిందని ఆయన అన్నారు. పూర్తి సమాచారం సేకరిస్తున్నామని, రైతులను విచారించి సర్వే నెంబర్లను కొలత చేసి వాటికి సంబంధించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య శాఖ భాద్యతలను చేపట్టనున్నారు. ప్రస్తుతమున్న తెలంగాణ ప్రాంతంలో కరోనా కట్టడిపై స్వయంగా ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మెదక్ జిల్లాలోని అచ్చంపేట ప్రాంతంలో ఉన్న భూములను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రభుత్వం నుండి ఆమోదం వచ్చేవరకు వేచి ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. మరోవైపు ఈటెల రాజేందర్ మాట్లాడుతూ మాట్లాడుతూ తాను ఎలాంటి భూకబ్జాలకు పాల్పడలేదని, కుట్ర పూరిత ఆరోపణలతో తనపై తప్పుడు కేసులు నమోదు చేసే దిశగా ముందుకు సాగుతున్నారు అని ఆవేధన వ్యక్తం చేశారు. చివరకు ధర్మమే విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తనపై ఆసూయ పెంచుకున్న పార్టీ అనుచరులే ప్రధాన భూమిక పోషించారు తెలిపారు.  ముఖ్యమంత్రికి తనపై తప్పుడు మాటలు చెప్పి తప్పు దోవ పట్టిస్తున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. 

✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: