మతిస్థిమితం లేని మహిళను,,,

ఆస్పత్రిలో చేర్పించిన సబ్ కలెక్టర్ కల్పనా కుమారి


(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

మతిస్థిమితం లేని మహిళను నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి ఆస్పత్రిలో చేర్పించారు. మంగళవారం నంద్యాల సబ్  కలెక్టర్ కల్పనా కుమారి విధి నిర్వహణలో భాగంగా నంద్యాలలో పర్యటిస్తుండగా ఎమ్మెస్ నగర్ లో ఓ చెట్టుకింద మతి స్థిమితం లేని మహిళ ఇబ్బంది పడుతున్నట్లుగా గమనించిన సబ్ కలెక్టర్ ఆ మహిళ వద్దకు చేరుకొని వివరాలు  అడుగగా మతిస్థిమితం లేని మహిళకావడం చేత సమాధానం ఏమీ ఇవ్వలేదు. ఆకలితో ఉన్న ఆ మహిళకు  బిస్కెట్లు, మంచి నీరు అందించి శిశు సంక్షేమ శాఖ సిడిపిఓ చంద్రకళను పిలిపించి ఈ మహిళను వెంటనే ఆస్పత్రిలో చేర్పించాలని, వైద్యం అందించాలని అవసరమైతే మెరుగైన  చికిత్స కొరకు కర్నూల్ కు పంపించమని  ఆదేశించారు.

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: