బ్లాక్ ఫంగస్ రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి 

డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

బ్లాక్ ఫంగస్ అనేది వ్యాధి కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులకు.. నిరోధక శక్తి తక్కువగా ఉండే వారికి సోకుతుందని ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు. ఇది సోకితే... శరీరంలో వ్యాధి నిరోధక శక్తి మరింత తగ్గిపోతుందని అన్నారు. డయాబెటిస్ ఉన్న వారికి కూడా ఇది వచ్చే  ప్రమాదం ఉంటుందని చెప్పారు. అలాగే... వొరికొనజోల్ మందులు వాడుతున్న వారికి, డయాబెటిస్ ఎక్కువగా ఉన్నవారికి, స్టెరాయిడ్లు వాడే వారికి, ఐసీయూలో ఎక్కువ కాలం ఉండే వారికి సోకుతుందని కేంద్ర ఆరోగ్య శాఖనే చెప్పిందని గుర్తుచేశారు. బ్లాక్ ఫంగస్ వలన కళ్లు, ముక్కు చుట్టూ ఎర్రగా అవ్వడం లేదా నొప్పి రావడం, జ్వరం, తలనొప్పి, దగ్గు, ఊపిరి సరిగా ఆడకపోవడం, రక్తపు వాంతులు వంటి లక్షణాలు ఉంటాయని.. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కోరారు.. కరోనా పాజిటివ్ అని తేలితే వైద్యులను సంప్రదించకుండా ఎటువంటి మందులు వాడవద్దు.. ముఖ్యంగా స్టెరాయిడ్స్ వాడకం తగ్గించాలని కోరారు.  ఐసోలేషన్  వార్డులలో కోవిడ్ పేషంట్ కు ఆక్సిజన్‌ అందించేప్పుడు హ్యుమిడిఫయర్లేలో స్టెరైల్‌ నీటినే ఉపయోగించాలని డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి కోరారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: