ముస్లిం నగారా ఆధ్వర్యంలో...

నిరంతరంగా కొనసాగుతున్న అన్నదానం...మాస్క్ ల పంపిణీ



(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)

ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్, యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఐదవ  రోజు కోవిడ్ బాధితులకు అన్నదానం మాస్కుల పంపిణీ జరిగింది. హిందూపురం పట్టణం లోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం, కోవిడ్ బాధితుల అటెండర్లకు రోడ్డు ప్రక్కన హోటళ్లు లేక ఆకలితో అలమటిస్తున్న బాధితులకు ఏ.సీ.ఎన్ సిల్క్ నాగరాజు. లక్ష్మీ.శ్వేత. సుష్మ.మురళి కుటుంబీకుల ఆర్థిక సహకారంతో 100మంది ఆన్నార్తులకు అన్న దానం చేశారు ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ ఆదేశాలతో ఈ కార్యక్రమము జరిగింది.

 

టిప్పు సుల్తాన్ మానవతా రక్త దాన సంఘం అధ్యక్షుడు షేక్ షబ్బీర్ ఆధ్వర్యంలో జరిగిందిఆయనమాట్లాడుతూ కోవిడ్ బాధితులు భయాందోళనలకు గురి కాకుండా మూఢ విశ్వసాలను వీడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ సెంటర్లలో చికిత్స చేయుంచుకొని భౌతిక దూరం పాటిస్తూ మాస్కులను వాడుతూ చేతులను సబ్బు తో లేక శానిటయిజర్ తో శుభ్ర పరుచుకొంటు కోవిడ్ బాధితులకు వివక్ష చూపకుండా మనో ధైర్యాన్ని ఇస్తూ కోవిడ్ మహమ్మరిని కూకటి వేళ్ళతో పెకిలించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో టిప్పు బ్రిగేడ్ అధ్యక్షుడు అతీఖుర్రహమాన్ అలీ.దారుల్ యతామా అధ్యక్షుడు రియాజుల్లా ఖాన్ టిప్పు బ్రిగేడ్ సభ్యులు ఇనాయతుల్లా.ఇర్ఫాన్.ఆటోనగర్ ప్రెసిడెంట్ ఇస్మాయిల్. తదితరులు ఈ అన్నదాన కార్యక్రమంలోపాల్గొన్నారు.


 



 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: