కోవిడ్ బాధితులకు ఆదుకున్నందుకు ధన్యవాదాలు

 సీఎం వై.ఎస్.జగన్, ఎమ్మెల్యే బాలక్రిష్ణ కు హిందూపురం అఖిలపక్షం అభినందనలు


(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)

 అఖిలపక్షం  ఆధ్వర్యంలో కన్వీనర్  ఇంతియాజ్ అధ్యక్షతన కోవిడ్ బాధితులకు బాసటగా నిలిచి దాదాపు 30లక్షల రూపాయల కోవిడ్ మందుల కిట్లు ఇతర సామగ్రి హిందూపురం కోవిడ్ బాధితులకు పంపి ఆదుకున్న హిందూపురం శాసన సభ్యులు నందమూరి బాలక్రిష్ణకి కోవిడ్ మహమ్మారిని ఆరోగ్య శ్రీ లో చేర్చాలని అఖిలపక్షం పోరాటం చేస్తే స్పందించి కోవిడ్ మహమ్మారి ని ఆరోగ్య శ్రీలో చేర్చి కోవిడ్ బాధితులకు బాసటగా నిలిచి ప్రయివేటు వైద్యశాలలను కోవిడ్ వైద్యశాలలుగా మార్చినందుకు అఖిల పక్షం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధన్యవాదతీర్మానం చేసి కృతజ్ఞతలు తెలిపారు.
త్వరలో అఖిలపక్షం కు తెలుగుదేశం హిందూపురం పట్టణ అధ్యక్షుడు డీఈ రమేష్ ద్వారా అందించిన కోవిడ్ మందుల కిట్లను, అఖిలపక్షం ద్వారా దాతలు అందించిన నిత్యావసర వస్తువులను కోవిడ్ బాధిత కుటుంబాలకు అందజేస్తామని అఖిల పక్షం కమిటీ సభ్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో బాలాజీ మనోహర్, డి.ఇ.రమేష్ కుమార్, బీఎస్పీ శ్రీరాములు, ఆర్సీపీ శ్రీనివాస్. ముస్లిం నగారా అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్, ఈఎస్ వెంకటేష్, సీపీఎం రాము పెద్దన్న, టిప్పు బ్రిగేడ్ అతీఖు ర్రహమాన్. టిప్పు సుల్తాన్ మానవతా రక్తదాన సంఘం షేక్ షబ్బీర్. ,దుర్గ నవీన్ నాగేంద్ర  హరీష్, సమీవుల్లా  అమానుల్లా.తదితరులు పాల్గొన్నారు.

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: