కరోనా కట్టుడి చర్యలు ఏకడ. .....?

ఇలా అయితే ఎలా కరోనా నియంత్రణ సాగేనా

మాస్కులు లేకుండా మద్యం షాపుల వద్ద భారీ జనం


(జానోజాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

కరోనా నియంత్రణకు కర్ఫ్యూ పెట్టిన ప్రభుత్వాలు మద్యం షాపుల వద్ద మాత్రం అసలు ఉద్దేశాన్ని నీరుగార్చుతున్నాయి. మనిషికి మనిషి భౌతిక దూరం పాటించడం ద్వారా కరోనా వైరస్ ఒకరి నుంచి ఇంకోకరికి సోకకుండా నివారించాలన్న ఉద్దేశంతోనే లాక్ డౌన్లు, కర్ఫ్యూలు అమలు చేస్తున్నారు. ఏ ఉద్దేశంతో లాక్ డౌన్ కొనసాగుతోంది ఆ ఉద్దేశం మధ్య షాపుల దగ్గరకు వచ్చేసరికి నీరు గారుతోంది. ప్రభుత్వం కరోనా ను కట్టడి చేసేందుకు ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు ప్రజల నిత్య అవసరాలకు అనుమతి ఇచ్చింది.

వీటితో పాటు మద్యం దుకాణాల తెరుచుకోవడంతో మద్యం షాపుల వద్ద జనం గుంపులు గుంపులుగా చెరి మరి మద్యం కొనుగోలు చేస్తున్నారు. అధికారులు సామాజిక దూరం తో పాటు మాస్ వున్న వారికి మాత్రమే మద్యం అమ్మకాలు ఇవ్వాలని చెప్పిన వారి ఆదేశాలను లెక్క చేయకుండా గడివేముల మండలం లోని 2 వైన్ షాపుల లో మద్యం విక్రయాలు జరుపుతున్నరు. ఇదే నా కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున చర్యలు అని ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తాము కరోనా నియంత్రణకు ఉపాధి కోల్పోయి ఇండ్లలో పస్తులతో కాలం గడుపుతుంటూ మద్యం షాపుల వద్ద మందు బాబులకు భౌతిక దూరం వంటి నిబంధనలు మాత్రం వర్తించడలేదని వారు ఆందోళన వ్యక్తంచేశారు. ఇలా అయితే కరోనా నియంత్రణ ఎలా సాధ్యమని వారు ప్రశ్నిస్తున్నారు.


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: